– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్
సికింద్రాబాద్: మాజీ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు గారి యొక్క 104వ జయంతిని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ నెక్లెస్ రోడ్ వద్ద గల పివి ఘాట్ లో నివాళులర్పించారు.
రవి ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సమయంలో దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు నడిపించి మచ్చలేని నాయకుడిగా తెలుగు రాష్ట్రాల నుండి మొదటి ప్రధానమంత్రి గా మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాలించి తన పేరు చిరస్థాయిగా చేసుకున్న బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు అని రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు కార్యక్రమంలో బిజెపి నాయకులు..ఎస్.మహేష్.అల్లాడి గంగాధర్. వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.