అమెరికా, కెనడా దేశాల్లో నివసిస్తున్న తెలుగువారికి, తెలుగు సాహిత్యమంటే మక్కువ ఉన్న భాషాభిమానులకు ఇది శుభవార్తనే. తొలిసారి కెనడా వేదికగా తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. దీనికి కెనడా లోని టొరంటో నగరం వేదిక కానుంది. ‘‘మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు-12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’’ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. దీనికి అమెరికా,కెనడాలో నివాసం ఉంటున్న వందమంది తెలుగు సాహితీవేత్తలు ప్రసంగ ప్రతిపాదనలు పంపినట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగుతల్లిపత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియా తెలుగు ఫౌండేషన్, టొరంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణ అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం తమ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. సెప్టెంబర్ 25,26వ తేదీల్లో.. ఉదయం 9 నుంచి సాయంత్రం 7 వరకూ జరిగే ఈ సదస్సును యూట్యూబ్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాటుచేశారు. 25న http://bit.ly/3zcqOo1 26 న http://bit.ly/3mjgLYS లింకులో సదస్సును వీక్షించవవచ్చు. ఈ సదస్సు గురించి కెనడాలో ఉంటున్న హర్షదీపిక రాయవరపు, భావన పగిడేలా ప్రత్యేక వీడియోలో వివరించారు. సదస్సు పూర్తి వివరాల కోసం సంచాలకులు లక్ష్మీ రాయవరపు (Sadassulu@gmail.com) హ్యూస్టన్‌కు చెందిన వంగూరి చిట్టెన్‌రాజు(vangurifoundaion@gmail.com ), సంధానకర్తలు విక్రమ్ సింగరాజు (triv.sing@gmail com ) సాయి రాచకొండ (sairacha@gmai.com ), కార్యనిర్వాహక సంఘం సభ్యులు యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్‌ఖాన్, కృష్ణకుంకాలను సంప్రదించాలని కోరారు.