– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం
– రాజ్య సభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం. ప్రజా సంగ్రామ యాత్ర తో టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి. రాష్ట్ర పోలీసు అనుమతి తీసుకున్న ప్రజాసంగ్రామ యాత్రను ఎట్లా అపుతారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను ఖండుస్తున్న. ప్రశాంతంగా పాద యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు.
పూర్తి స్థాయిలో చట్టబద్ధంగా పాదయాత్ర చేసేందుకు అనుమతి తీసుకున్నాము, అయినా కూడా పోలీసులు సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి.మా యాత్రకు టీఆరెస్ వాళ్ళు అడ్డు పడతారని తెలిస్తే వాళ్ళను అరెస్ట్ చేయాలి కానీ సంజయ్ ని ఎట్లా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్న.ఇదంతా కేవలం ప్రజా సంగ్రామ యాత్ర ఆపేందుకు కేసిఆర్ చేసిన కుట్రగా స్పష్టమవుతుంది.
ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు వాళ్ళ కష్ట సుఖాలను, కెసిఆర్ అరాచక పాలనలో వాళ్లు పడుతున్న ఇబ్బందులను సంజయ్ కి చెప్పుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తన పతనం ఖాయమని కేసీఆర్ కు అర్థం అయింది.అందుకే పోలీసుల సాయంతో యాత్రను అడ్డుకునే కుట్రలో భాగంగానే సంజయ్ ని అరెస్ట్ చేశారు.అరచేతిని అడ్డంపెట్టి సూర్యుడిని ఎట్లా ఆపలేమో, అదేవిధంగా తెలంగాణలో బిజెపికి పెరుగుతున్న ప్రకాశాన్ని ఆపలేవు అని కేసీఆర్ కు చెపుతున్న.
రాష్ట్రంలో యువత బడుగు బలహీన వర్గాలు మహిళలు, అందరూ బిజెపి వైపు చూస్తున్నారు. దీంతో కెసిఆర్ చేయించుకుంటున్న అన్ని సర్వేల్లో బిజెపి గ్రాఫ్ చాలా వేగంగా పెరుగుతోంది. టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పతనం అవుతోంది. దీంతో ఆయన ఫ్రస్టేషన్లోకి వెళ్లిపోయారు.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుటుంబ సభ్యుల పేర్లు బయటపడటంతో ఆయనకు మతిభ్రమించింది. ఏం చేయాలో తోచక ఆవేశంలో అనాలోచితంగా తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారు.
మొన్న మునుగోడులో జరిగిన అమిత్ షా బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడం చూసి టీఆర్ఎస్ పీఠాలు కదిలిపోయాయి. అక్కడ టీఆర్ఎస్ ఓటమి ఖాయం అని స్పష్టం కావడంతో అప్రజాస్వామికంగానైనా బిజెపిని ఎదుర్కోవాలని సీఎం గారూ నిర్ణయించుకున్నారు.
కానీ ఈ చిల్లర మల్లర దాడులకు బిజెపి భయపడదు అన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి.పార్టీ కోసం, దేశం కోసం ఎట్లాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండే క్యాడర్ బిజెపీది. పైసలు ఇచ్చి కార్యకర్తలు కొనే పార్టీ టీఆర్ఎస్.నువ్వు ఎన్ని జిమ్మిక్కులు, దాడులు, దుర్మార్గాలు చేసిన మునుగోడులో గెలవబోయేది బిజెపి అని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి.ఎన్ని కుట్రలు చేసినా, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ను ఆపలేరని నేను సూచిస్తున్న. ప్రజాస్వామ్యయుతంగా ఉంటే నాలుగు కాలాలపాటు కనీసం ప్రతిపక్షంలోనైనా ఉండగలవు, లేకుంటే రాజకీయ సమాధి తప్పదని కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా.