– సాగునీటి మీద సమీక్ష ఎందుకు చేయలేదు ?
– మంత్రులు ధైర్యం ఉంటే పంటలు ఎండుతున్న రైతుల పొలాల వద్దకు వెళ్లి రైతులను కలవాలి
– మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దని ముకుళిత హస్తాలతో కోరుతున్నాం
– ప్రాధేయపడుతున్నాం .. వేచి ఉండండి .. సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని శిక్షించండి
– తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
హైదరాబాద్: ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందించే పథకం రైతుబీమా .. రైతు చనిపోయిన ఏడు పనిదినాలలో రైతు కుటుంబానికి పరిహారం అందేది. ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలలో ఒకటి రైతుబీమా, రైతుబంధు అని యూఎన్ఓ కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రకటించింది
రైతు బీమా పథకం ప్రవేశపెట్టిన తరువాత డిసెంబర్ 4, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్రంలో 1,18,197 మంది రైతులు మరణించగా రూ.5,909.85 కోట్లు ఆ రైతు కుటుంబాలకు పరిహారంగా అందించడం జరిగింది రైతు బీమా పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6122.65 కోట్లు ఎల్ఐసీ కి ప్రీమియంగా చెల్లించింది
ఏడాదికి రూ.1500 కోట్లకు గాను రెండో విడత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.750 కోట్ల ప్రీమియం చెల్లించని కారణంగా ఏడు వేల పై చిలుకు కుటుంబాల పరిహారం పెండింగులో ఉన్నాయి 440 కి పైగా రైతులు 15 నెలల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు రాదు, నీళ్లు రావు, రైతుబంధు రాదు, రైతుభీమా ప్రీమియం చెల్లించరు .. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తున్నది ?
కాంగ్రెస్ అభయహస్తంలో వ్యవసాయానికి రూ.3 లక్షల వడ్డీ లేని రుణం అన్నారు. 24 గంటల కరంటు అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీలను భర్తీ చేయలేదు. అసైన్డ్ పోడు భూములకు పట్టాభూములతో సమానంగా పరిహారం అని దాని ఊసెత్తడం లేదు
ప్రభుత్వ భూములను కుదువపెట్టి రైతుభరోసా కోసం అని రూ.10 వేల కోట్లు తెచ్చి రెండు నెలలు అవుతుంది .. మూడెకరాల వరకు రైతులకు కూడా రైతుభరోసా నిధులు పడలేదు . మూడెకరాల వరకు రైతుభరోసా ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెబుతుంటే .. మూడెకరాల వరకు రైతులకు డబ్బులు వేయాలని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు. పది వేల కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి రూ.750 కోట్లు రైతు బీమా ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదు ?
ఇది రైతు అనుకూల ప్రభుత్వమా ? రైతుబీమాను ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది. రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే సాగునీళ్లు లేక, కరంటు లేక రైతుల పొలాలు ఎందుతున్నాయి .. పశువులకు మేతగా మారుతున్నాయి రాష్ట్రంలో అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారు. యాసంగి సీజన్ మొదలయ్యే సమయానికి దాని మీద సమీక్ష చేయడంలో ప్రభుత్వం విఫలమయింది
రైతులు పంటలు వేసుకున్న తర్వాత రైతు కమీషన్ చైర్మన్ కోదండరెడ్డితో రైతులు పంటలు వేసుకోవద్దు అని చెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖా మంత్రి చెప్పకుండా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తో సాగునీళ్లకు కొరత లేదని చెప్పించారు. మరి నీటికి, కరంటుకు సమస్య లేకుంటే రైతులు దేనికి ఆందోళన చెందుతున్నట్లు ? ప్రభుత్వం సాగునీటి మీద సమీక్ష ఎందుకు చేయలేదు ?
ఇరిగేషన్, వ్యవసాయ, విద్యుత్ శాఖా మంత్రులు ధైర్యం ఉంటే పంటలు ఎండుతున్న రైతుల పొలాల వద్దకు వెళ్లి రైతులను కలవాలి . రాష్ట్రంలో ఎక్కడా పంటలు ఎండడం లేదని ధైర్యం ఉంటే ప్రభుత్వం ప్రకటించాలి. కష్టపడి సాగు చేసే రైతులు తమ పంటలను ఊరికెనే పశువులకు వదిలేస్తారా ? రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లు, వర్షాలు ఉన్నా దానిని నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైంది. మంత్రులు రైతుల వద్దకు వెళ్లి భరోసా కల్పించాలి .. ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం కల్పించాలి
తుంగతుర్తి, సూర్యాపేటలకు 300 కిలోమీటర్ల దూరం కాళేశ్వరం నీళ్లను తీసుకువచ్చి బీఆర్ఎస్ హయాంలో పంటలు పండించారు. గోదావరిలో నీళ్లున్నా ఎత్తిపోయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. రైతాంగం బాధలను దిగమింగాలి కానీ ఆత్మహత్యలకు పాల్పడవద్దని వేడుకుంటున్నాం . మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దని ముకుళిత హస్తాలతో కోరుతున్నాం .. ప్రాధేయపడుతున్నాం .. వేచి ఉండండి .. సమయం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని శిక్షించండి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, వ్యవసాయం పట్ల బాధ్యత లేదు .. బాధ లేదు