Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రభుత్వం విఘాతం కలిగిస్తోంది

-రాష్ట్ర భవిష్యత్తును ఎవరు కాపాడాలి.?
-జోగి రమేష్ పై రౌడీషీట్ తెరవాలి
-పోలీస్ వ్యవస్థను డీజీపీ నిర్వీర్యం చేశారు..తక్షణమే పదవికి రాజీనామా చేయాలి
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య 
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసిన ప్రభుత్వం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది. ఇది దురదృష్టకరం. శోచనీయం. బాధాకరం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించమని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ, పోలీసు అధికారులు చెబుతుంటే.. రాష్ట్రాన్ని ఎవరు కాపాడాలి.? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఎవరు కాపాడాలి.? దుర్మార్గపు చర్యలు, దుష్ట కార్యాల నుండి రాష్ట్రానని కాపాడేదెవరు? భగవద్గీతలో చెప్పినట్లు సంభవామి యుగే యుగే అంటూ ఎవరో రావాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ముఖ్యమంత్రి ప్రమేయం, ప్రోత్సాహం లేకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి దిగేంత ధైర్యం జోగి రమేష్ కు ఉందా.? జోగి రమేష్ అనే వ్యక్తి చాలా పిరికి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఉసిగొల్పి పంపించిన మీకు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు మీకు ఉందా.?
చలనం లేని గోడకు, చెట్టుకు చెప్పినా డీజీపీకి చెప్పినా ఒక్కటే. మా నాయకుడు విమర్శ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై కత్తులు, రాళ్లు, రాడ్లతో దాడికి పాల్పడతారా.? ఆ నాడు చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు. బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. చెప్పులతో కొట్టాలన్నారు. మేమేమైనా జగన్ ఇంటిపై దాడికి దిగామా.? జోగి రమేష్ బుద్ధి, జ్ఞానం, అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడికి వస్తావా. శాసన సభ్యుడిగా చట్టం చేయాల్సిన వ్యక్తి వందల మంది రౌడీలను తీసుకొచ్చి దాడికి దిగడం ఎక్కడి సంస్కృతి.? రేపు దాడి చేస్తానని సోషల్ మీడియాలో మాట్లాడితే పోలీసులు ఏం చేస్తున్నారు. ఒక శాసన సభ్యుడు.. చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తా అంటూ సోషల్ మీడియాలో చెప్పినా స్పందించని డీజీపీని ఏమనాలి.? అడ్డుకోవాల్సిన బాధ్యత డీజీపీపై లేదా.? హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు.? ఈ సిగ్గుమాలిన డీజీపీ పోలీసు వ్యవస్థ ప్రతిష్టను కూడా దిగజార్చారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే హక్కు కూడా లేదా.? విమర్శ శృతి మించితే కర్రలు, కత్తులతో దాడి చేసేస్తారా.? ముఖ్యమంత్రివా ఫ్యాక్షనిస్టువా.?
జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫ్యాక్షనిస్టువా లేదా సీఎంవా? కత్తులతో పోడుచుకుంటారా? పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేగానీ కర్రలు, కత్తులతో ఆ పనికి మాలినోడు ఉన్నాడని చెప్పి.. అతనికి అవగహాన లేదు.. అర్ధం పర్థం లేదు. తెలివితెటలు చదువుసంజలు లేవని అతన్ని ఉసిగొల్పి పంపిస్తారా? మరి మీ బూతుల మంత్రి రేపో మాపో చంద్రబాబు నాయుడు చచ్చి పోతాడని మాట్లాడినప్పుడు మేము ఇంటి మీదకు వెళ్లామా? చంద్రబాబు నాయుడికి చిన్న మొదడు చితికి పోయిందని కామెడీగా రోజా మాట్లాడింది మేము ఆమె ఇంటి మీదకు వెళ్లామా? ఏమిటి ఈ సిగ్గుమాలిన చర్య? ఏమిటి ఈ దుర్మాగపు చర్య? ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకు ఒక శాసనసభ్యుడు వెళ్లడం ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? మీకు నైతిక విలువలు ఉంటే డీజీపీ సవాంగ్ రాజీనామా చేయాలి? నువ్వు పోలీసు అఫీసర్ గా ఉండానికి హక్కు లేదు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పంపించారు కాబట్టి చంద్రబాబునాయుడికి క్షమాపణ చెప్పాలి. నాకు ఆలోచన లేదు..నాకు అవగహన లేదు.. నేను పనికిరాని ముఖ్యమంత్రిని అని రాష్ర్ట ప్రజలకు చెప్పాలి. శాంతి భదత్రలు కాపాడటం నాకు రాదని చెప్పు.. నరుకుతామంటే మీ ఇంటి మీదకు వచ్చామా? నాలుక కోస్తామంటే మీ ఇంటి మీదకు వచ్చామా? తాట తీస్తామంటే మీ ఇంటికి వచ్చామా? తాటి మట్టలతో కొడతామంటే ఇంటికి వచ్చామా? చీపుర్లతో కొడతామన్నపుడు మీ ఇంటి మీదకు వచ్చామా? మీ సంస్కాకారం అది అనుకున్నాం. మీరు పెరిగిన వాతావరణం అది. మీ తల్లిదండ్రులు పెంచిన విదానం ఇది అనుకున్నాం. అంతే గానీ మీ ఇంటి మీదకు రాలేదు. ఏమిటీ సిగ్గుమాలిన చర్య. పోలీసులు మీరు డ్రామా పోలీసులా? నిజమైన పోలీసులా? నిజమైన పోలీసులైతే జోగి రమేష్ తాట తీయండి ప్రతి పక్షనాయకుడి మీదకు ఎలా వస్తావని కాళ్లు విరగోట్టవద్దండి..జుట్టుపట్టుకొని బరబర ఈడ్చవద్దండి. మెడపట్టకొని వ్యాన్ లోకి నెట్టవద్దండి. తిరిగి టీడీపీ నాయకులపై రాళ్ల విసురుతారా? పోలీసులు చట్టబద్దంగా వ్యవహిరించకుండా సినిమా పోలీసుల్లా వ్యవహరించారు. జోగి రమేష్ పై చార్జీషీట్ ఓపెన్ చేయాలి. అతన్ని వెంటనే అరెస్టు చేయాలి. అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. రౌడీలా వ్యవహిరించే వ్యక్తిని శాసనసభ్యుడిగా అనర్హవేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాం
సిగ్గుమాలిన వ్యక్తులకు, రోడ్డు పక్కన తిరిగే వ్యక్తులకు, వీధి రౌడిలా వ్యవహరించే వ్యక్తులను అసెంబ్లీ పెట్టుకుని వీళ్లు మనకు శాసన కర్తలా.? వీళ్లా మన నిర్ధేషకులు.? వీళ్లా రాష్ట్రాన్ని పాలించేది. జోగి రమేష్ ఎందుకు వచ్చాడు. అయ్యన్న మాట్లాడిన దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయ్. చంద్రబాబు ఇంటికి కాళ్లు పట్టుకోవడానికి వచ్చావా..? గడ్డం పట్టుకోవడానికి వచ్చావా.? ఎందుకు వచ్చావు.? నీధైర్యం ఏమిటి.? ఎవరు నిన్ను ఉసిగొల్పింది.? జగన్మోహన్ రెడ్డే కదా.? పనికిమాలిన మంత్రిపదవి కోసం ఈ కుప్పిగంతులు. ఇలాంటి వాళ్లకే కదా మంత్రి పదవులు ఇచ్చేది. పనికి మాలిన చెత్త మనుషులు. విమర్శించే హక్కులేదా.? నోరెత్తకూడదా.? మాట్లాడకూడదా.? ఇది సరైంది కాదు. ప్రజాస్వామ్య వాదులు ఈదాడిని ఖండించాలి. మాట్లాడితే దాడులు చేస్తూ పోతే ఎలా.? అయ్యన్నపాత్రుడు కూడా మంత్రిగా చేసిన వ్యక్తి. సీనియర్ నాయకుడు ఆయన. తప్పు మాట్లాడితే యాక్షన్ తీసుకో. యాక్షన్ అంటే రాళ్లతో, కర్రలతో దాడి చేయడమా.? ప్రతిపక్ష పార్టీది ఒక రౌడీ గ్రూపు..మీదొక రౌడీ గ్రూపా.? రాజ్యాంగం తెలియని చెత్త ఇదంతా. చెత్త పరిపాలన చేస్తున్నారు. మీరూ రిపోర్టివ్వండని పోలీసులు మాట్లాడుతున్నారు. ఏమి సవాంగం గారూ..ఇంత ఘనత వహించిన పోలీస్ వ్యవస్థను నిర్యీర్యం చేశారు. ఆయన స్వార్థం కోసం పోలీస్ వ్యవస్థను నిర్యీర్యం చేశారు. డీజీపీగా నియమించిన జగన్ రుణంతీర్చుకోవడం కోసం పోలీస్ వ్యవస్థను తాకట్టు పెట్టి నిర్వీర్యం చేసిన వింత వ్యక్తి గౌతమ్ సవాంగ్. జోగి రమేష్ ను అరెస్టు చేయండి.

LEAVE A RESPONSE