చంద్రబాబు ఇంటిపై వైసీపీ మూక దాడి ప్రజాస్వామ్యంపై దాడే-

అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తామనే ధోరణిలో జగన్ రెడ్డి తీరు
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర పన్నారు. ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడుకే భద్రత లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఇంటిపై వైసీపీ మూక దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడే. తమ అవినీతిని ప్రశ్నిస్తే చంపేస్తామనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రం ఉన్మాదుల చేతిలో బందీ అయింది. చంద్రబాబు  ఇంటి దాడికి తెగబడటంతో పాటు టీడీపీ నేతలపై కర్రలు, రాళ్లలో హింసకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మంత్రులు, ఇతర వైసీపీ నేతల భాషను ఒక్కసారి పునపరిశీలన చేసుకోవాలి. సభ్య సమాజం తలదించుకునే విధంగా మంత్రులే నోరు పారేసుకుంటున్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వైసీపీ మూక దాడికి కొంతమంది పోలీసులు వత్తాసు పలకడం అత్యంత హేయం. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. దాడి ఘటనపై డీజీపీ ఏం సమాధానం చెబుతారు? శాంతిభద్రతలను అదుపుచేయడంలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర డీజీపీకి పదవిలో కొనసాగే అర్హత లేదు. చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు టీడీపీ నేతలపై రాళ్లు, కర్రలతో భౌతిక దాడులకు దిగిన వైసీపీ నేతలను తక్షణమే అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్యం

Leave a Reply