పోలవరంలో అగాధాలు పూడ్చే పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్ట్ లోని గ్యాప్ 1, 2 ల్లో గతంలో వచ్చిన వరదల వల్ల ఏర్పడిన అగాథాలను పూడ్చే ప్రక్రియ బుధవారం ప్రారంభం ఐంది. డాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డి డి ఆర్ పీ ) ఆమోదించిన డిజైన్ ప్రకారం ఈ పనులు ప్రారంభం అయ్యాయి. జలవనరుల శాఖ ఎస్ ఈ నరసింహమూర్తి, ఈ ఈ లు మల్లికార్జున రావు, పాండురంగయ్య, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) సి జి ఎం ఎం. ముద్దు కృష్ణ, జనరల్ మేనేజర్ గంగాధర్, అసోసియేట్ జనరల్ మేనేజర్ మురళి పమ్మి గ్యాప్ 1, 2 లలో పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏర్పడిన అగాథాలను పూడ్చటంలో భాగంగా ఇసుకను అక్కడ డోజర్ల ద్వారా నింపుతున్నారు. ఇసుకను నింపిన తరువాత వైబ్రో క్యాంపక్షన్ విధానం ద్వారా ఆ ప్రాంతాన్ని గట్టి పరుస్తారు. ఇది పూర్తి ఐన తరువాత తాజాగా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్ హె చ్ పి సి ) డయాఫ్రామ్ వాల్ పటిష్టతపై ఇచ్చిన నివేదిక ఆధారంగా డి డి ఆర్ పీ ఆమోదం పొందిన తరువాత పనులు చేపడతారు. డయాఫ్రామ్ వాల్ పనులు పూర్తి ఐన తరువాత ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ ) పనులు ప్రారంభం అవుతాయి.

Leave a Reply