Suryaa.co.in

Telangana

పేద వర్గాలకు ప్రభుత్వం బాసట : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మారేడుపల్లి మండలం లోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 58 ప్రకారం 60, 120 గజాలలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను బుధవారం డిప్యూటీ స్పీకర్ శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 31 మంది లబ్దిదారులకు కలెక్టర్ కార్యాలయం ద్వారా మంజురైన పట్టా పత్రాలు, క్రమబదీకరణ ఉత్తర్వులను అందించారు. కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి, సామల హేమ, కంది శైలజ, నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, లింగాని శ్రీనివాస్, రాజ సుందర్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 58 అర్హులైన వారికి ఇళ్ల పట్టాలివ్వడానికి కృషి చేస్తోంద ని డిప్యూటీ స్పెకేర్ శ్రీ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE