ప్రభుత్వ హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే క్రమబద్దీకరించాలి

బొప్పరాజు & ఫణిపేర్రాజు

ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం చిత్తసుద్ది చూపించడంలేదని స్వాయానా గౌః ముఖ్యమంత్రిగారే గత ఏడాది జరిగిన ఉద్యమ చర్చల సందర్బంగా జెఏసి నాయకులకు ఇచ్చిన హామీమేరకు నేటికీ నెరవేరలేదనీ తెలిపారు. నియమ నిభందనలకు లోబడి రిక్రూట్మెంటు కాబడిన కాంట్రాక్టు ఉద్యోగులు గత 22 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. విరంతా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగానే విధులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే క్రమబద్దీకరిస్తామని హామి ఇచ్చిన గౌః ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ విషయం పై దృష్టిపెట్టక పోవడం చాలా బాదాకరమని, కావున గౌ|| సియం గారు ఇచ్చిన హామిమేరకు వీళ్లందరీని తక్షణమే క్రమబద్దికరించి కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,స్టేట్ అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

బుదవారం (1) కమీషనర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (2) కమీషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (3) కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (4) డైరెక్టర్, యస్.యస్.సి బోర్డు (5) డైరెక్టర్ ఆఫ్ ఆర్చీస్ (6) డైరెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గజెటీర్స్ & ఓరియంటల్ మన్స్క్రిప్ట్ లైబ్రరీ డిపార్ట్మెంట్ తదితర హెడ్ (శాఖాధిపతులు కార్యాలయాలు) ఆఫీసులను సందర్శించిన సందర్భంగా అక్కడ ఉద్యోగులను ఉద్యేశించి బొప్పరాజు మాట్లాడుతూ… ప్రభుత్వం తో ఇంతవరకు జరిగిన చర్చలలో ఆర్దికపరమైన అంశాలపై ఇచ్చిన హామీమేరకు ఇంతవరకు దేనికి ఎంతచెల్లించారో..ఇంకా చెల్లించాల్సిఉందో కూడా కాకిలెక్కలు చెపుతున్నారు గాని లిఖితపూర్వకంగా అడిగితే ఎందుకు ఇవ్వడము లేదో అర్దం కావడంలేదు అన్నారు. అలాగే హెల్తుకార్డులపై ఉద్యోగులకు,పెన్షనర్లుకు సరైన వైద్యసైకర్యాలు అందడంలేదని ఎన్నోఏళ్లుగా మేరపెట్టుకుంటున్నప్పటికీ దానిపై కూడా ఇప్పటీ స్పష్టమైన హామీలు ఏమీ ఆవ్వడంలేదు, అంతేకాకుండా ప్రభుత్వమే ఉద్యోగులను ఇబ్బందులోకి, సమస్యలలోకి నెట్టేస్తుంటే మా బాదలు ఎవరికి చెప్పుకోవాలి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో బాగస్వామ్యూలే అంటున్న ప్రభుత్వ పెద్దలు, మరి మాన్యాయమైన సమస్యలు పరిష్కారంలో ఇచ్చినహామిలు అమలు చేయడములోను, మాబకాయిలు మాకు చెల్లించడంలోను, ఆర్దికేతర అంశాలు పరిష్కారంలోను ఎందుకు అంత నిర్యక్ష్యదోరణితో ఉన్నారో అర్దంకావడంలేదు. అందువల్లనే ఉద్యోగుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ఈనెల 9 నుండి నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులమంతా విధులకు హాజరౌతున్నామని, అంతేకాకుండా ఈనెల 21 నుండి వర్కుటూ రూల్ కూడా చేస్తున్నాం. ఇప్పటైనా ప్రభుత్వం ఉద్యోగున్యాయమైన డిమాండ్లు పరిష్కరం లో జాప్యం చేయకూండా మా సమస్యలు గతనెల 13 న సియస్ గారికి ఇచ్చిన 50 పేజీలలో ఉన్న డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేనీ ఎడల ఏఫ్రిల్ 5 న భవిష్యత్ కార్యచరణను ప్రకటించి మలిధశ ఆందోళణా కార్యక్రామలను తీవ్రతరం చేస్తామని బొప్పరాజు & ఫణిపేర్రాజు తెలిపారు.

ఈకార్యక్రమంలో ఏపిజెఏసి అమరావతి కో చైర్మన్ మరియు ఏపీ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి జీ.జ్యోతి, కో-చైర్మన్ యస్.మల్లేశ్వరరావు, కార్యదర్శి ఏ.సాంబిశివరావు, రెవిన్యూఅసోషియేషన్ NTR జిల్లా నాయకులు కిషోర్, తధితరులు తో పాటు అధికసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave a Reply