Suryaa.co.in

Andhra Pradesh

హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆశ్చర్యం

– ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదనడం కరెక్టు కాదు
– హైకోర్టుపై నాకు నమ్మకం లేదని ముందే చెప్పా
– ప్రజల కోసం ఖర్చు పెట్టానన్న తృప్తి ఉంది
– సుప్రీంను ఆశ్రయిస్తాం… వాదనలు వినిపిస్తాం
– వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాజ్యాంగ ఉల్లంఘనలు చేసి ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని కార్పొరేషన్ ఆదాయంగా చూపి అప్పులు తేవడం పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదనడం బాధాకరమని, రాజ్యాంగానికి అందరూ కట్టుబడి ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన లను ఎవరైనా కోర్టు దృష్టికి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కిందనే తీసుకు వెళ్ళ గలరని నరసాపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తుంటే, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముందని న్యాయమూర్తి, తన న్యాయవాదిని ప్రశ్నించడం పట్ల ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాగదీయకుండా ఒకేసారి ఉత్తర్వులు జారీ చేయడంతో, ఈ అంశంపై ఆశ్రయిస్తామని తెలిపారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు ఈ కేసును వాదిస్తారని చెప్పారు.

భవిష్యత్ ఆదాయాన్ని, స్వలాభాపేక్షతో, ధనాపేక్ష తో తాకట్టు పెడితే ప్రజల భవిష్యత్తు అయిపోతుందన్న ఆందోళనను రఘురామకృష్ణంరాజు వ్యక్తం చేశారు.. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఆగ్రహించిన చీఫ్ జస్టిస్… కొట్టేసిన పిల్ అంటూ సాక్షి దినపత్రిక అడ్డగోలు కథనాలను రాస్తుందని మండిపడ్డారు.

తనకు ఖర్చు అయినప్పటికీ ప్రజల కోసమే, ఈ పిల్ దాఖలు చేశానన్న ఆయన, ముఖ్యమంత్రి ఇప్పటి తన భవిష్యత్తు కోసమే చూస్తున్నారని, తాను మాత్రం రేపటి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు.. తనకు రాష్ట్ర హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ముందు నుంచి లేదని, ఆ విషయాన్ని హైదరాబాదులో మీడియాతో మాట్లాడినప్పుడే వ్యక్తం చేశానని గుర్తు చేశారు.. తాను ముందుగా ఊహించినట్టే జరిగిందని, ప్రజల తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్థానని, చూద్దాం… లాభాపేక్ష.. ప్రజా పేక్ష , ఏది నెగ్గుతుందో ని ఆయన వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయులకు రేషన్ పెట్టిన జగనన్న సర్కార్
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రేషనలైజేషన్ విధించడం దారుణమని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 117 కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనకు తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అని తెలిపారు.. టీచర్ల రేషనలైజేషన్ విధానంలో భాగంగా 400 నుంచి 500 మంది ఉన్న 12 సెక్షన్ల కు ఇద్దరూ గణిత శాస్త్రం ఉపాధ్యాయులే పాఠాలను బోధించాల్సి ఉంటుంది. ఇక 13 సెక్షన్లలోని విద్యార్థులకు కూడా ఇద్దరు ఇంగ్లీష్ అధ్యాపకుల తోనే సరి పెట్టనున్నారు.

18 సెక్షన్ల విద్యార్థులకు గాను ఒకే ఒక హిందీ టీచర్ పాఠాలను చెప్పవలసి ఉంటుందనీ, ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు 13 సెక్షన్ల విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ని జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకువచ్చిందని రఘురామకృష్ణంరాజు వివరించారు. పాఠశాలల విలీనం ద్వారా సబ్జెక్టుపై అధ్యాపకులు ఫోకస్ పెంచేందుకు వెసులుబాటు కలుగుతుందని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు అధ్యాపకుల సంఖ్యను పూర్తిగా కు దించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు. సర్వ శిక్ష అభియాన్ కోసం కేంద్రం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పేరిట వినియోగించిందని, ఈ విషయం కేంద్ర మంత్రి భారతి పవర్ పర్యటన ద్వారా వెల్లడైందన్నారు.

రాష్ట్రంలో 18 వేల మంది ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, రేషనలైజేషన్ విధానం ద్వారా ఉపాధ్యాయుల పనిగంటలు పెంచి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నారని ని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. హెడ్మాస్టర్ లేకుండానే పాఠశాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యార్థులకు ఎదిగే దశలో వ్యాయామ విద్య ఎంతో అవసరమని, అయితే ఇకపై వ్యాయామ ఉపాధ్యాయుల సేవల ను ప్రభుత్వ పాఠశాలలో వినియోగించుకోరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అలాగే 150 మంది విద్యార్థులకు లోపు ఉన్న పాఠశాలలో లో, హెడ్మాస్టర్ ఉండరని, సీనియర్ అధ్యాపకుడి హెడ్మాస్టర్ గా డ్యూయల్ రోల్ పోషించాల్సి ఉంటుందని చెప్పారు.

పన్నులు కట్టే ప్రజలు ప్రశ్నించరా?
రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో పనులను చెల్లిస్తున్న ప్రజలు విద్యా వ్యవస్థ గురించి ప్రశ్నించారా? అంటూ రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ప్రశ్నిస్తుంటే, వారినీ ఎన్నో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.. రాష్ట్రంలో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ మానివేసి విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.. సత్యసాయి జిల్లా లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ గుజరాత్ కంటే పదవ తరగతి పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అధిక శాతం ఉత్తీర్ణులు అయ్యారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అస్సాం గురించి ఆయన ఎందుకు ప్రస్తావించలేదని అని ప్రశ్నించారు.

గతంలో ఎవరితో పోటీ పడ్డామో, వారితో పోల్చి చూసుకోవాలన్నారు. అంతేకానీ ఎప్పుడు తక్కువ ఫలితాలను నమోదు చేసే గుజరాత్ తో పోల్చుకోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. గుజరాత్ పదవ తరగతి పరీక్ష ఫలితాలు కోవిడ్ కు ముందు ఎంత? ఇప్పుడు ఎంత ? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రజలు అమాయకులని అబద్ధాలు చెబితే సరిపోతుందని అనుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు. తమ లాంటి వాళ్ళం నిజాలను చెబుతాను కదా అన్నారు.

కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో కోవి డ్ కు ముందు ప్రస్తుతం పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఒకే తీరుగా ఉన్నాయన్నారు.. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పూర్తిగా పడిపోతే, ప్రైవేటు పాఠశాలలో వచ్చిన ఉత్తీర్ణత శాతం ఆధారంగా ఆ 67 శాతం అయినా నమోదైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని చూసి ప్రభుత్వ పాఠశాలలోనే అందరూ చేరి ఉంటే ఈ ఉత్తీర్ణత శాతం మరింత పడిపోయి ఉండేదేమో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల గణానికి జవాబు దారుణమైన మనం… మెరుగైన విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.. ప్రతి ఏటా డీఎస్ సి లను నిర్వహిస్తామని , టీచర్ల రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడేమో టీచర్లను ఎలా తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు.. ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు తెలుగు మీడియం విద్యాబోధన తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.. అయినా కూడా ఇంగ్లీష్ మీడియం లోనే బోధిస్తామనడం చట్ట ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వం విద్యను దూరం చేయకుండా, కేంద్ర ప్రభుత్వ చట్టాలను గౌరవించాలని సూచించారు.

ఆరోగ్యశ్రీకి అనారోగ్యం
విద్యా దీవెన, విద్య వసతి పథకాల లో భాగంగా నేరుగా ప్రజల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లుగానే, ఇకపై ఆరోగ్యశ్రీ చికిత్స చేయించుకున్న వారి ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించడం విస్మయాన్ని కలిగిస్తోందనీ రఘురామకృష్ణంరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం కొన్ని ఆస్పత్రులలో ని చికిత్స చేస్తున్నారని, ఈ విధానం అమలు ద్వారా ప్రైవేటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేసే అవకాశమే ఉండదని తేల్చి చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేసుకునేవారు సొంత బ్యాంకు అకౌంట్ నెంబరు ఇవ్వాలా?, లేకపోతే ఈ పథకం కోసం కొత్త బ్యాంకు అకౌంట్లను తెరవాలా? అన్నది అర్థం కావడం లేదన్నారు.

ఈ విధానం అమలుకు రెండే రెండు కారణాలు ఉన్నాయన్న ఆయన, బ్యాంకులు తమ ఖాతాలో డబ్బులు పడగానే ప్రజలు మురిసిపోయి జగన్మోహన్రెడ్డికి ఓటు వేయాలి అనుకోవడం ఒకటైతే, నకిలీ అకౌంట్ లో ని ఓపెన్ చేసి మీ ఇష్టం వచ్చినట్లు నిధులను స్వాహా చేసేందుకు అవకాశం ఉన్నదని విజ్ఞులైన పెద్దలు చెప్పారన్నారు.. ఈ విధానం వల్ల ఆస్పత్రి తో నేరుగా సంబంధాలు తెగిపోయి, రోగితో పెట్టుకుంటున్నారని, అతను రోగో కాదో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యవస్థలను నాశనం చేసింది చాలని విద్యా వసతి, విద్యా దీవెన పథకం డబ్బులు చెల్లించకపోతే విద్యనే పోతుందని, ఇక్కడ ప్రాణాలు పోతాయన్నారు. ఇప్పటికే విద్యా వ్యవస్థను నాశనం చేశారని, ఇప్పుడు వైద్యా న్ని కూడా నాశనం చేయబోతున్నారని మండిపడ్డారు.

ఒక ఎంపీని అలా అడగడం ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు
ఒక పార్లమెంట్ సభ్యుని దమ్ముంటే తన నియోజకవర్గానికి రావాలని సవాలు చేయడం ఏమిటి ..బుద్ధుందా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు. వచ్చే నెలలో భీమవరంలో జరగనున్న అల్లూరి స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని నిష్క్రమించిన వెంటనే శాంతిభద్రతల నెపంతో తనను అరెస్టు చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు కుట్ర చేస్తున్నట్లుగా తనకు సమాచారం ఉందని తెలిపారు.

తనకు, విజయసాయి రెడ్డి మధ్య ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో జరిగిన ట్విట్టర్ వార్ ను గమనిస్తే విజ్ఞులైన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు అర్థం అవుతాయని చెప్పారు . నా నియోజకవర్గానికి నన్ను దమ్ముంటే రమ్మను సవాల్ చేయడం చూస్తే…తనకు కడుపు మండిపోయింది అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి నీ… ఎంపీ తన నియోజకవర్గానికి తాను రావాకంటే దమ్ము ఉండాలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఎందుకంటే వీరికి బుద్ధి లేదని తాను ప్రశ్నించడం లేదన్నారు.

నియోజకవర్గానికి వస్తున్నాను అంటే, దమ్ముంటే రారా అని ఒక ఎంపీ సవాల్ చేయడాన్ని డి జి పి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి ఎన్నో పిల్ల చేష్టలు చేశాడని, ఇప్పుడు అటువంటి చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హాజరవుతున్న సభకు ప్రోటోకాల్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన ఆహ్వానించక పోయినా తాను హాజరవుతానని, తనకు ఎలాంటి భద్రత కల్పిస్తార న్నదానిపై డి జి పి కి లేఖ రాశానని, డి జి పి ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు, తన లేఖకు స్పందిస్తారో… లేదో చూద్దామన్నారు.. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

దొంగలు పడ్డ ఆరు నెలల తర్వాత ఏదో జరిగినట్లు, కోనసీమ అల్లర్లను ముఖ్యమంత్రి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు.. అల్లర్లలో గృహ దహనమైన మంత్రిని కనీసం పరామర్శించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు తనకేదో దళితులు అంటే చిత్తశుద్ధి ఉన్నట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనీ నిర్ణయించి, అభ్యంతరాలుంటే తెలియజేయమని చెప్పారని గుర్తు చేశారు. అభ్యంతరాలను చెప్పే అవకాశం ఇచ్చారు కాబట్టి, కొంతమంది తమకున్న అభ్యంతరాన్ని చెప్పే క్రమంలో అల్లర్లు జరిగాయన్నారు..

ఈ అల్లర్ల వెనుక ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే, ఆయనతో కలిసి ఫోటో దిగిన నలుగురిని, మంత్రి విశ్వరూప్ తో కలిసి ఫోటో దిగిన వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా ముఖ్యమంత్రి గొంతు చించుకొని, ఏడుపు మొహం తో చెప్పిందంతా అబద్ధం అయిపోలేదా అని ప్రశ్నించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకే అర్థమవదా అన్నారు. ముఖ్యమంత్రికి , మా పార్టీ అధ్యక్షుడికి ఎక్కడ సమన్వయం లో పెంచిందో అర్థం కావడం లేదన్నారు.. నీలి కవాతు నిర్వహణలో నిర్వాహకులకు, పోలీసులకు మధ్య ఉన్న ప్రేమ అనురాగాలు చూస్తే ముచ్చటేసిందన్న ఆయన… ఇది కదా ప్రజాస్వామ్యం అంటే …అని అపహాస్యం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని నామకరణం చేసిందన్న ఆయన, నీలి కవాతు నిర్వాహకులు మార్గం కోనసీమ పేరు లేకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా గానే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారని, దానికి ఆందోళనలు నిర్వహించడం ఎందుకు?, ప్రభుత్వం తో మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అని అన్నారు.. ఒకవైపు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నిరసిస్తూ, కేవలం కోనసీమ జిల్లాగా ప్రకటించాలని కొందరు ఆందోళనకు దిగడం వల్ల అల్లర్లు జరగా, ఇప్పుడు ఒక అంబేద్కర్ పేరు పెట్టాలని మరొకరు చేస్తున్న ఆందోళనకు సహకారం అందించడం ఎందుకు?ఇరువర్గాలను కూర్చోబెట్టి మధ్యేమార్గంగా కోనసీమ అంబేద్కర్ జిల్లా బాగానే ఉందని సముదాయించవచ్చు కదా అని రఘురామకృష్ణంరాజు సూచించారు. కులాల మధ్య అంతరాలు వద్దని రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పేరిటనే కులాల కుంపట్లను రా జేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.

LEAVE A RESPONSE