అయ్యన్న కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం

Spread the love

అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై నమోదైన అట్రాసిటీ కేసులో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అరెస్ట్‌, ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఒకే అంశంపై ఒకటి కంటే ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని న్యాయవాది వీవీ సతీష్‌ తెలిపారు. న్యాయవాది సతీష్‌ వాదనలతో కోర్టు ఏకీభవించింది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సభలో అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై గుంటూరు జిల్లాలో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.

Leave a Reply