Suryaa.co.in

Andhra Pradesh

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక భూ భక్ష పథకం

– పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డు పెట్టుకుని భూ కబ్జాకు వైసీపీ నేతలు యత్నం
• వైసీపీ నేతల భూ కబ్జాలతో ఒంటి మిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబంతో సహా ఆత్మహత్య
• ఇండోసోల్ కంపెనీకి 8,500 ఎకరాలు తక్కువ ధరకే కట్టబెట్టే ప్రయత్నం
– మాజీ మంత్రి దేవినేని

దేశంలో ఎక్కడా అమలు చేయని చట్టాన్ని తీసుకు వచ్చి పేదల భూములను బొక్కేందుకు జగన్ రెడ్డి భూ భక్ష చట్టాన్ని తీసుకు వచ్చాడు.. దాన్ని అడ్డు పెట్టుకుని వివాదాలు సృష్టించి.. వైసీపీ నేతలు పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ భు కబ్జాదారుల ఆగడాలు తట్టుకోలేక కడప ఒంటిమిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.

రాష్ట్రంలో లాండ్ టైటిలింగ్ చట్టం 2023 అక్టోబరు 31 నుంచే అమల్లోకి వచ్చినట్టు.. ప్రభుత్వ జీవోనెం 512 ను తెచ్చింది. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్ పర్సన్, కమిషనర్, సభ్యులను నియమిస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తుర్వులిచ్చారు. ఈ భూభక్ష చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఈ చట్టానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదంటా నాటకాలాడుతున్నారు. దేశంలో ఏరాష్ట్రం చట్టం చేయకముందే ఇక్కడే చట్టం ఎందుకు చేశారో జగన్ సమాధానం చెప్పాలి?

ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజా, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం కొల్లగొట్టడం ద్వారా రూ. 8లక్షల కోట్లు స్వాహా చేశారు. ఈ పాపపు సొమ్మును భూముల్లోకి తరలించడానికి సివిల్ కోర్టులు అడ్డంకిగా ఉన్నవి. కోర్టుల రక్షణను తొలగించడానికే రెవిన్యూ అధికారులకు సివిల్ కోర్టుల అధికారాల్ని కట్టబెడుతూ లాండ్ టైట్లింగ్ చట్టం తెచ్చారు. జగన్ రెడ్డి బినామి ఇండో సోల్ కంపెనీకి ఒక్క రామాయపట్నం పరిసరాల్లోనే 8,500 ఎకరాల రైతుల భూముల్ని కారు చౌకగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ భూ మాఫియా లక్షలాది ఎకరాలు కబ్జా చేయడానికే తొందర తొందరగా ఈ చట్టం చేశారు.

జగన్ కి ఓటు వేయడం రైతుల భూ హక్కుల్ని, పౌరుల ఆస్తి హక్కులపై అధికారాల్ని జగన్ కి కట్ట బెట్టడమే అవుతుంది. ఈ చట్టంలోని సెక్షన్-5 లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (టిఆర్వో) నియామకం గురించి వుంది. “ఏ వ్యక్తినైనా, వ్యక్తులనైనా టీ ఆర్వోగా నియమించవచ్చని స్పష్టపరుస్తున్నది. టిఆర్వోలు గా జగన్ ముఠా నచ్చిన వాళ్ళను నియమిస్తారు. ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ ల అసలు యజమానుల పేర్ల బదులు వైకాపా వారు చెప్పిన పేర్లు వ్రాయించుకొని భూ కబ్బాలకు పాల్పడుతారు.

ఏదైనా ఆస్తి తమదేనంటూ ఎవరైనా తప్పుడు క్లెయిమ్ దాఖలు చేస్తే ఆ ఆస్తి వివాదంలో ఉన్నట్టు డిస్ప్యూట్ రిజిస్టర్ లో టిఆర్వో నమోదు చేస్తారు. దీనిపై అసలు యజమాని సివిల్ కోర్టులకు వెళ్ళేందుకు అవకాశం లేకుండా ఈ చట్టం నిరోదిస్తుంది. ఇలా అనేక ప్రమాదకర సెక్షన్లు ఈ చట్టంలో చేర్చారు. దీని ద్వారా లక్షలాది ఎకరాలు కబ్బా చేయడానికి లేదా కారు చౌకగా కొట్టెయ్యడానికీ ఆగమేగాల మీద ఈ భూభక్ష చట్టం చేశారు.

మే 1 నే పింఛన్లు ఇవ్వాలి

పింఛన్లకు నిధులు అట్టిపెట్టకుండా మార్చి 16-30 మధ్య రూ.13వేల కోట్ల నిధులు తన సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు. పింఛన్లకు నిధుల కొరత పెట్టాడు. అవ్వాతాతల్ని ఎండల్లో తిప్పి అందులో ఎవరైనా చనిపోతే దాన్ని విపక్షాలకు అంటకట్టి శవ రాజకీయం చేసి, ఎన్నికల్లో లబ్దిపొందాలని జగన్ కుట్ర చేశారు. నాడు ఎన్నికల్లో లబ్దికి బాబాయి వివేకాను చంపించి శవరాజకీయం చేశారు. కోడి కత్తి డ్రామాలాడి ఎన్నికల లబ్ది పొంది రాష్ట్రాన్ని దోచుకున్నారు. నేడు జగన్ ధరల బాదుడు, ప్రభుత్వ నిధుల లూటీ, వివేకా హత్యలో తాడేపల్లి కుట్రల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే పింఛన్ల పంపిణీపై కుట్ర చేశారు.సచివాలయం సిబ్బందిని ఉపయోగించుకొని ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ చేసి ఉండవచ్చు.

ఖజానాలో నిధులుంటే ఏప్రిల్ 1వ తేదీనే పింఛన్లు ఇచ్చి ఉండవచ్చు. తన కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లు దోచిపెట్టడం వల్లే ఏప్రిల్ 1న పింఛన్లు ఇవ్వలేకపోయాడనేది నిజం. ప్రతిపక్షాలు నిలదీసిన తర్వాత.. పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది.

చీఫ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిలు జగన్ రెడ్డి ప్రభావానికి లోనై పింఛన్ల పంపిణీ ఆలస్యం చేయక మే1 వ తేదీనే పింఛన్ల పంపిణీ ప్రారంభించాలి. మే నెలలో పింఛన్ల పంపిణీ ఆలస్యం చేసి అవ్వా తాతల మరణాలు జరిగితే దానికి జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

రాబోయే చంద్రబాబు ప్రభుత్వం పింఛన్లు రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుండి అమలు చేస్తుంది. దివ్యాంగులకు నెలకు పింఛన్ రూ.6 వేలకు పెంచుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్ల వయస్సు వారికి కూడా పింఛన్లు అందిస్తుంది.

LEAVE A RESPONSE