Suryaa.co.in

Andhra Pradesh

శాసన మండలికి సమర్ధుడైన నాయకుడు అవసరం

– ప్రచారం విస్తృతం..”పేరాబత్తుల”దే విజయం
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, వాసంశెట్టి సత్యం ధీమా

రామచంద్రపురం: పట్టభద్రుల సమస్యలు శాసన మండలిలో వినిపించే సమర్థత ఉన్న నాయకుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు (1) వేసి గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యంలు పిలుపునిచ్చారు.

. ఎమ్మెల్సీ ఎన్నికల సమయం దగ్గర పడటంతో కూటమి పార్టీ నాయకులు ప్రచార జోరు పెంచారు. సోమవారం రామచంద్రపురంలో పలు వార్డుల్లో పట్టభద్రులను నేరుగా కలసి కరపత్రాలు పంచుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి వివరిస్తూ విస్తృత ప్రచారం చేశారు. రామచంద్రపురంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి నాయకులు, బూత్ ఇన్చార్జిలతో విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఇరువురూ మాట్లాడుతూ ఈనెల 27న జరగనున్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయమే లక్ష్యంగా అలుపెరగకుండా ప్రచారం చేయాలని సూచించారు. సమర్థుడు, పట్టభద్రుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న రాజశేఖర్ ను గెలిపించుకుని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని పట్టబద్రులను కోరాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE