Suryaa.co.in

Andhra Pradesh

సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా 28 మందికి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు

– నియామక పత్రాలు అందించిన ఫౌండేషన్ చైర్మన్, ఐటీ సంస్థ ప్రతినిధులు

రామచంద్రపురం: రామచంద్రపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 28 మంది నిరుద్యోగులకు సోమవారం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంగారు, జైష్ణ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో నియామక పత్రాలు అందించారు. స్థానిక వి ఎస్ ఎం కళాశాలలో ఈనెల 13న ప్రముఖ ఐటీ కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా సాఫ్ట్ వేర్ జాబ్ మేళా నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఐటీ కంపెనీ ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలో ఎంపికైన 28 మందిని తొలి ప్రాధాన్యతలో ఎంపిక చేసినట్టు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, జైష్ణ మేనేజింగ్ డైరెక్టర్ సుంకర ఉషారాణి , సీఈవో పుప్పల రామకృష్ణ తెలిపారు. అనంతరం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించారు. త్వరలో మరిన్ని కంపెనీల్లో నియామక పత్రాలు అందించనున్నట్టు ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి, కష్టపడి చదువుకొని, ఉద్యోగ అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తమ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. భవిష్యత్తులో ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా క్రమాలు విస్తృతం చేస్తామని వెల్లడించారు.

నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమకు ఐటీ సంస్థలో ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ సత్యం గారు, ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఉషారాణి, సీఈఓ రామకృష్ణలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A RESPONSE