– ఫైబర్ నెట్ చైర్మన్ పదవి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
అమరావతి: ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి ప్రకటించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీరెడ్డి రాజీనామా చేశారు. ఇటీవల ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.