Suryaa.co.in

Telangana

రాహుల్ చెప్పిండు.. .లేకుంటే ఈ రెడ్డి కొడుకులు ఎప్పుడు కానిస్తుండే?

– నన్ను లాలూ ప్రసాద్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసాడు
– నన్ను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకుంది వీళ్ళే..కొడుకులు
– యాదవులకు )అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఇప్పటినుండి ఊరుకునేది లేదు
– రెడ్లపై అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: మాజీ ఎంపి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్‌యాదవ్ రెడ్డి సామాజికవర్గ నేతల పెత్తనంపై అగ్గిరాముడయ్యారు. ఆ కొడుకులు.. ఈ కొడుకులంటూ రెడ్డి నేతలపై శివాలెత్తారు. కాంగ్రెస్‌లో బీసీలను రెడ్డికొడుకులే అణగదొక్కుతున్నారంటూ విరుచుకుపడ్డారు.రెడ్లు ఓడిపోయినా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇస్తారని, బీసీలకు మాత్రం ఇవ్వరని ధ్వజమెత్తారు. నేరుగా జీవన్‌రెడ్డి, మున్నూరు కాపు నేత దానం నాగేందర్‌ల పేర్లు ప్రస్తావించారు. ఇప్పటికే కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్లపై బహిరంగంగానే విరుచుకుపడుతుంటే.. కొత్తగా మరో బీసీ నేత అంజన్న ఆయన సరసన చేరారు. సో.. తెలంగాణ కాంగ్రెస్‌పై రెడ్లపై తిరుగుబాటుకు తెరలేచినట్లే.

అంజన్‌కుమార్ యాదవ్ ఏమన్నారంటే.. రాహుల్ గాంధీ చెప్పిండు..అందుకే కులగణన జరిగింది..లేకుంటే ఈ కొడుకులు ఎప్పుడు కానిస్తుండే. తెలంగాణనే అడ్డుకున్నారు ఈ కొడుకులు( రెడ్లు). రాజ్య సభ యాదవులదే. అందుకే అనిల్ కి ఇచ్చారు. ఓడిపోయే సమయంలో నాకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.

ఇంట్ల కూర్చున్న వాణ్ణి తెచ్చి (దానం నాగేందర్ ) టిక్కెట్ ఇచ్చి పార్టీ ఎంపీ సీట్ కోల్పోయింది.నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భజనగాళ్ళు ( రెడ్లు) ఇవ్వలేదు. నన్ను లాలూ ప్రసాద్ యాదవ్ సోనియా గాంధీకి చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసాడు.

ఉత్తమ్, జగ్గారెడ్డి నాకు అడ్డు తగిలారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వొద్దని. నన్ను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకుంది వీళ్ళే .కొడుకులు. వీళ్ళ వల్లనే( రెడ్ల వల్ల) నష్టం అయింది. MLA గా ఓడిపోయి ఎంపీ గా పోటీ చేస్తారు ఈ నా కొడుకులు ( రెడ్లు) ..మనకేమో టిక్కెట్ ఇవ్వరు. జీవన్ రెడ్డి ఒడిపోయిండు. మరి టిక్కెట్ ఎందుకు ఇచ్చిండ్రు మళ్ళీ ఎంపీగా? వాణ్ణి దానం నాగేందర్ ని పక్కపార్టీ వాణ్ణి తీసుకొచ్చి ఎంపీ టిక్కెర్ ఇచ్చారు.

గెలిచే టైం లో నాకు ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు.మొన్న సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్ ఇస్తే నేను గెలిచేవాన్ని.. వానికి టిక్కెట్ ఇచ్చినందుకే పార్టీ ఓడిపోయింది. గెలిచే టైం లో టిక్కెట్ ఇచ్చినా దానం ఓడిపోయాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భజన సంఘాలు వచ్చాయి కాంగ్రెస్ లోకి. మాకు ( యాదవులకు )అన్నిట్లో ప్రాధాన్యత లేకుంటే ఇప్పటినుండి ఊరుకునేది లేదు.
ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా పోటీ చేస్తారు ఈ నా కొడుకులు (రెడ్లు). మనకేమో (బీసీ) టిక్కెట్ ఇవ్వరు’ అని కాంగ్రెస్‌ పార్టీలో రెడ్డి నాయకులతోపాటు రెడ్డి సామాజికవర్గంపై అంజన్‌ కుమార్‌ యాదవ్‌ వివరించారు.

ఇప్పటికే ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ కుమార్‌ (తీన్మార్‌ మల్లన్న) బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా ఆయన బాటలో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ నిలిచారు. అంజన్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి.

LEAVE A RESPONSE