Suryaa.co.in

Andhra Pradesh

మద్యతరగతికి మేలు చేసే విధంగా మేనిఫెస్టో ఫోకస్

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ: మద్యతరగతి ప్రజలకు ఫోకస్ చేయడమే కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్దిని దృష్టిలో ఉంచుకుని బిజెపి ఎన్నికల ప్రణాళిక ఉండాలని బిజెపి ఎన్నికల ప్రణాళికా సభ్యులకు దిశానిర్దేశం చేశారు బిజెపి రాష్ట్ర అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మేని ఫెస్టో కమిటీ సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు. ఇప్పటికే 25 పార్లమెంటు నియోజకవర్గాల్లొ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించిన నేపధ్యంలో ఎన్నికల ప్రణాళిక సిద్దం చేసేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యతరగతి ప్రజలకు మేలు చేస్తూ పాలనా సంస్కరణలు, సంపద సృష్టి, ఉపాధి అవకాశాలు ప్రధాన అంశాలుగా ప్రతిపాదిస్తూ బాలలకు, మహిళలకు, దళితులకు రక్షణ తదిర అంశాలను పొందు పర్చాలన్న విషయాలను ప్రస్తావించారు అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తిరిగి ఈ నెల 20 వ తేదీన మరో పర్యాయం సమావేశం కావాలని నిర్ణయించారు. దాదాపు నాలుగు గంటల పాటు నిర్విరామంగా మేని ఫెస్టో అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

LEAVE A RESPONSE