దళిత రచ్చబండ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలి

– ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

విజయవాడ… దళితుల పై దాడులు జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వానికి చీమకుట్టినట్లుకూడా లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఎస్సీమోర్చా రాష్ట్ర కార్యవర్గసమావేశం ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసెదేవానంద్ అధ్యక్షతన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బస్తీ సంపర్క్ అభియాన్ (దళితరచ్చబండ) పోస్టర్, కరపత్రాలను పురందేశ్వరి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దళితులపై దాడులు జరిగిన సందర్భంలో రాష్ట్రప్రభుత్వం వ్యవహరించిన తీరు అవమానకరం అన్నారు. దళితుల పై వైసీపీ సర్కార్ కపట ప్రేమ కనబరుస్తోందన్నారు. బీజేపీ బలోపేతంలో ఎస్సీ మోర్చా కీలక పాత్ర వహించాలన్నారు. దళిత రచ్చబండ ద్వారా 8వేల పంచాయితీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్న నేపధ్యంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దళితులకు చేస్తున్న సేవలను వివరించాల్సిన అవసరం ఉందని వివరించారు.

Leave a Reply