Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు నాయుడిపై అవాకులు, చెవాలకు పేలితే తాటతీస్తాం

– ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే బూతులు తిడతారా?
– సన్నిబియ్యం ఇవ్వలేని సన్నాసి మంత్రి నీశాఖలో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పు
– టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్. రాజు

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, తప్పుల్ని టీడీపీ ప్రజల్లో ఎండగడుతుంటే సమాధానం చెప్పలేక సన్నబియ్యం ఇవ్వలేని సన్నాసి మంత్రి కొడాలి నానికి ప్రతి సారి…‎మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడ్ని బూతులు తిట్టడం పరిపాటిగా మారిందని, ఇకపై చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే..తాట తీస్తామని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎం.ఎస్. రాజు హెచ్చరించారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…..

మంత్రి కొడాలి నాని తన శాఖలో జరుగుతున్న అవినీతిపై సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడ్ని బూతులు తిట్టడం సిగ్గుచేటు. చరిత్ర తెలియని సన్నాసులకు చంద్రబాబు విలువ ఏం తెలుస్తుంది. నేడు మీడియా సమావేశంలో కొడాలినాని చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు. టీడీపీ హయాంలో అమరావతికి 180 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం అంగీకరించి అనుమతులిస్తే… వైసీపీ ప్రభుత్వ చేతకానితనం, ముఖ్యమంత్రి జగన్ అసమర్ధవత వల్ల రింగ్ రోడ్డుకు భూములు సేకరించటం చేతకాక కేవలం 78 కి.మీ రోడ్డును కుదించారు. వైసీపీ చేతకానితనాన్ని కేంద్ర మంత్రే పార్లమెంట్ సాక్షిగా చెప్పారు.

రోడ్డుకు భూములు సేకరించే దమ్ము లేని సజ్జల రామకృష్ణారెడ్డి,‎ కొడాలి నాని చంద్రబాబు నాయుడుపై అసత్యాలు చెబుతూ. అహహేళన చేస్తూ బూతులు మాట్లాడుతున్నారు. వేలి ముద్ర కొడాలి నానికి చంద్రబాబు నాయుడు తిట్టడం తప్ప విషయ పరిజ్నానం లేదు. జగనన్న కాలనీలకు 70 లక్షల టన్నుల సిమెంట్ అవసరం అని పత్రికల్లో పుల్ పేజీ ప్రకటనలు ఇవ్వగా కొడాలి నాని 2.7 లక్షల టన్నులు సరఫరా చేసినట్టు చెబుతున్నారు. మిగిలిన 66 లక్షల టన్నులకు వినియోగదారుల నుంచి బస్తా రూ. 450 లు వసూలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ సొమ్ము ఎవరి ఖజానాలోకి వెళ్లింది. ‎

కొడాలి నాని మాట్లాడే ముందు లెక్కలు తెలుసుకుని మాట్లాడాలి. తన శాఖలో ‎జరిగిన అవినీతి డబ్బుల్ని రూ. 100 కోట్లు పట్టుకుంటే దానికి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేని సన్నాసి చంద్రబాబు నాయుడు తిట్టడం సిగ్గుచేటు. నిత్యవసరాల ధరలపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నారని

కొడాలి నాని అంటున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏ కిరణా షాపుకైనా వెళ్తాం…..మేం చెప్పిన రేట్ల కంటే ‎ ఒక్క రూపాయికి తక్కువకు ఇప్పించగలవా? హెరిటేజ్ నాణ్యమైన సరుకులో అందిస్తోంది.దాని గురించి మాట్లాడటం సిగ్గుమాలినచర్య. అధిక ధరలకు భారతి సిమెంట్ అమ్మూతు ప్రజల్ని నిలువు దోపిడి చేస్తున్నారు. కరోనా కంటే జగన్ పాలనే ప్రమాదకరం అని ప్రజలనుకుంటున్నారు.

వైసీపీ 32 నెలల పాలనలో ఎవరికి ఏం చేశారో చెప్పగలరా? దళితులు, మైనారిటీ, మహిళలు, రైతులు ఏ వర్గం సంక్షేమంపై పైనా మేం చర్చకు సిద్దం కొడాలి నాని, సజ్జల రామకృష్ణా రెడ్డి సిద్దమా? ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డ కట్టింది చంద్రబాబేనని తెలంగాణ అసెంబ్లీలో, కేసీఆర్, కేటీఆర్ చెప్పలేదా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టింది చంద్రబాబు కాదా? చంద్రబాబు చేసిన అభివృద్ది చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. మీరెన్ని తప్పుడు మాటలు మాట్లాడినా ప్రజలు విశ్వసించరు. మీ చేతాకినతనంతో అమరావతిని నాశనం చేసి రాష్ట్ర భవిష్యత్ ని అంధకారంలోకి నెట్టి.. ‎మీ వైఫల్యాల్ని ‎ చంద్రబాబుపైకి నెట్టి, అవాకులు చెవాకులు పేలుతారా?

ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల బూతులు మాట్లాడుతారా? నీశాఖలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి, ఒక్క దానిపై సమాదానం చెప్పావా? టన్నుల కొద్దీ రేషన్ బియ్యం పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు? వందల లారీలు పట్టుబడ్డాయి దానిపై ఏ నాడైనా మాట్లాడావా?

పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని వారి కడుపుకొట్టి అమ్ముకుని సంపాదించిన రూ. 100 కోట్లపై దమ్ముంటే కొడాలి నాని సమాధానం చెప్పాలి. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే చేతనైతే సమాధానం చెప్పాలి, అంతే తప్ప బూతులు మాట్లాడితే తోలు తీస్తాం. సాక్షి జీతగాడు జీతగాడి లా ఉండాలి, ముఖ్యమంత్రి లా భావించుకుని చంద్రబాబు నాయుడపై అవాకులు చెవాకులు పేలితే తాటతీస్తాం. కొడాలినాని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకోసారి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేటపుడు వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఎం.ఎస్.రాజు హెచ్చరించారు.

LEAVE A RESPONSE