(స్రవంతి)
ఈ మెుక్క బొటానికల్ నేమ్” క్రోటాన్ బోన్ ప్లాంటాడియం.” ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందింది.
దీనిని సాదారణంగా బాన్ తులసి లేదా అడవితులసి అని అంటారు. రైల్వే ట్రాక్ లపక్కన ఎక్కువగా వుంటుంది .అందుకే రైల్వే కలుపు మెక్కగా పిలుస్తారు..(Railway weed).పవిత్రమైన తులసి మెుక్కను పోలివుంటుంది.కొంచెం వైరటి వాసన కలిగివుంటుంది..
దీని ఆకులు కొమ్మలు తుంచి నప్పుడు ఒక పాలు లాగా లేదా గమ్ లాగా ఒక రసం స్రవిస్తుంది..ఆ రసాన్ని పులిపుర్లు వున్నచోట ఉదయం సాయంత్రం పుాస్తుా వుండాలి…అంతే ఒక వారంలో పులిపుర్లు మాయమై పోతాయి…!!! చర్మం మీద ఆ పులిపురి మచ్చ కుాడా లేకుండా చర్మంలో కలిసిపోతుంది..!!
పల్లెల్లో దిన్ని పిచ్చి బీర అని అంటారు..!! ఇది పులిపుర్ల కి దీని రసాన్ని వాడుతారు కాని ఎలాంటి ఆంగ్లమందులు రసాయనాలు వాడరు…!!” పార్వతి ఊరిలోపల మనుషుల్ని ఊరిబయట ఆయుర్వేద మందు మెక్కల్ని సృష్టించాను..మనుషులకి కలిగే వివిధ వ్యాధులు రోగాలకి ఈ మందుమెక్కలే ఔషధాలు …!! అని శివుడు పార్వతి కి చెప్పిన మాట నిజమే అనిపిస్తుంది .మన చుట్టుపక్కల వున్న మెుక్కలు ఏవి వ్యర్దమైనవి కావు. ప్రతి చెట్టుకి ఏదో ఔషధ గుణం వుంటుంది .మానవుడు ప్రకృతి తో టచ్ లేనందువలనే అన్ని రోగాలు జబ్బులు .కాని మనుషులు ఇప్పుడు ఇళ్ళలో ఏదైనా చెట్టు మెుక్కలు చుాస్తే పీకిపారేసి శుభ్రంగా వుంచుకోవాలని అనుకుంటారు..కాని పనికిరాని చెట్టు కానీ మెుక్క లేనేలేదు!!