Suryaa.co.in

Andhra Pradesh

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకం బెంబేలు

కుంభకోణాల కాకాణి మాకొద్దు బాబోయ్‌…
జైలుకెళ్లే వ్యక్తితో వెళ్లలేమంటున్న క్యాడర్‌

ఊళ్లకు ఊళ్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు
పేదల పక్షపాతి సోమిరెడ్డితో కొనసాగాలని నిర్ణయం
తోటపల్లి గూడూరు నుంచి భారీగా చేరికలు

సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాణి గోవర్థన్‌రెడ్డి పేరంటేనే హడలుతున్నారు. ఆయన కుంభకోణాలతో ఎప్పుడు జైలుకెళతారో తెలియదని ఆయనతో తాము ప్రయాణం చేయలేమని బహిరంగంగానే కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో భారీగా ఆయా మండలాల నుంచి టీడీపీలో చేరుతున్నారు. పేదలకు అండగా ఉండే సోమిరెడ్డితోనే తాము కొనసాగుతామని చెబుతున్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని వేదాయపాలెం సోమిరెడ్డి నివాసంలో తోటపల్లి గూడూరు మండలం విలుకానిపల్లి పంచాయతీ నుంచి మొత్తం 52 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరాయి.

వారికి కండువాలు కప్పి సోమిరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. వల్లభనేని పార్థసారథి ఆధ్వర్యంలో చేరిన వారిలో మాజీ జెడ్పీటీసీ గంధర్ల శ్రీనివాసులు, గద్దె నరసింహ, పల్లం భాస్కర్‌, సాధన సీనయ్య, తుమ్మతాటి పోలయ్య, కోయి పెంచలయ్య, పర్వత సుబ్బయ్య, తిరుపతి శేషయ్య, గల్లా అమర, పర్వత సురేష్‌, షేక్‌ షహరోజ్‌, యాట గిరి విగ్నేష్‌, తలపల శ్రీనివాసులు, ఇండ్ల సీనయ్య, తుపాకుల రాజా, చలంచర్ల సాల్మన్‌, పొన్నూరు చెంచమ్మ, పులి శాంతమ్మ, పులి వనమ్మ, నల్లి అనిత, రాపూరు వెంకట శేషమ్మ, బెల్లంకొండ మాధవి, మరో 30 కుటుంబాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యద ర్శి బొమ్మి సురేంద్ర, మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు శివయ్య నాయుడు, సొర కత్తి శ్రీనివాసులు, చుక్కపల్లి మల్లికార్జున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE