Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లకు పెన్షన్ బాధ్యత తప్పించడానికి వైసీపీనే కారణం

అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల ద్వారా మెరుగైన సంక్షేమం
దొంగలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లను కట్ డ్రాయర్లపై ఊరేగిస్తాం
మంగళగిరి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్

మంగళగిరి: పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించడానికి వైసిపినే కారణం, వారిని రాజకీయ అవసరాలకు వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థ మరింత పటిష్టపర్చి పెన్షన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని యువనేత లోకేష్ చెప్పారు.

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి ప్రకాష్ నగర్ లో నిర్వహించిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… టిడిపి కారణంగా పించన్లు ఆపేశారని వైసిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు, సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది, తొలిసారి పెన్షన్ ను ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. 200 పెన్షన్ ను 2వేలు చేసింది చంద్రబాబునాయుడు.

రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ ను 4వేలకు పెంచి ఇంటివద్దకే అందజేస్తామని స్పష్టంచేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే దొంగలు, రౌడీలు, బ్లేడ్ బ్యాచ్ లు ఉండవు, ప్రజలను ఇబ్బందులు పెట్టే అసాంఘిక శక్తులను కట్ డ్రాయర్లపై ఊరేగిస్తామని లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE