మే మొదటివారంలో పదో తరగతి ఫలితాలు

గుంటూరు: పదో తరగతి పరీక్షల ఫలితాలను మే మొదటివారంలో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.నేటి నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రశ్నపత్రాల మూల్యాంకనం జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 26 జిల్లా కేంద్రాల్లో 47.88 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని, 25 వేల మంది టీచర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించింది..

Leave a Reply