Home » దేశ ప్రజలు అమాయకులు కాదు

దేశ ప్రజలు అమాయకులు కాదు

– ఇన్కమ్ టాక్స్,ఇడి, సిబిఐల ద్వారా 26,000 కోట్ల రూపాయల సీజ్
– మీడియా సంస్థలలో, డిబేట్లలో, అనలిస్టుల పేరుతో, యాంకర్ల పేరుతో కడుపు మంట
– బిజెపి, మోడీ మీద అక్కసు వెళ్ళగక్కే కుహనా -లౌకికాలకు సమాధానం

జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి గతంలో కంటే ఓట్లు, సీట్లు తగ్గుతాయని కొంతమంది దేశ వ్యతిరేకులు, అవినీతిని ప్రోత్సహించేవారు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లు, కుహనా లౌకికవాదులు, వాళ్ల వాళ్ల మీడియా సంస్థలలో, డిబేట్లలో, అనలిస్టుల పేరుతో, యాంకర్ల పేరుతో కడుపు మంట భరించలేక, మన సిద్ధాంతానికి నూకలు చెల్లినవే అనే బాధ, రోజురోజుకు మన పరపతి సమాజంలో తగ్గిపోతుంది అనే భావనతో అబద్ధాలు చెబుతూ, సామాన్య ప్రజల మనసులను కలుషితం చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు.

ఈ దేశంలో అవినీతిపరులను ఇన్కమ్ టాక్స్,ఇడి, సిబిఐల ద్వారా వేలకోట్ల అవినీతి సొమ్మును ప్రభుత్వం ఖజానాకు జమ చేసుకొని వారి మీద కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నందుకా? ఇందులో రాజకీయ నాయకులు కేవలం 3% మాత్రమే. ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయలను సీజ్ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది.

గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే పై డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు జమయింది. ముఖ్యమంత్రిలను సైతం విడవకుండా దాడులు చేసి అరెస్టు చేస్తుంది ఇందుకు బిజెపి ప్రభుత్వానికి సీట్లు తగ్గుతాయా? అవినీతిపరుల పాలిట సింహ స్వప్నంగా, ఎవరూ కలలో కూడా ఊహించినంతగా దాడులు చేసి ప్రభుత్వాన్ని రక్షిస్తుంన్నదుకా!

వీరు చెబుతున్నంత మాత్రాన దేశ ప్రజలు అమాయకులు కాదు, తెలివి తక్కువ వారు అంతకన్నా కాదు. ఈరోజున గత పది సంవత్సరాలుగా బిజెపి అధికారంలోకి వచ్చి మోడీ నాయకత్వం చూసిన తర్వాత, విదేశాలలో సైతం భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చి, సబ్కా సాత్,సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, మంత్రంతో వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న తరుణంలో, భారతదేశాన్ని 2047 కల్లా మొదటి స్థానంలో నిలపాలని ప్రణాళికలు రచిస్తున్నందుకా? గతంలో బిజెపికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు సైతం బిజెపితో కలిసి పనిచేస్తూ, ప్రయాణం చేస్తున్నారు.

బిజెపికి సీట్లు తగ్గుతాయో ? పెరుగుతాయో ఒకసారి రాష్ట్రాల వారీగా తెలుసుకుందాం.

జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ఎత్తివేసిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో గతంలో 9%,14% ఓటింగ్ జరుగుతున్న పరిస్థితి నుండి ఈ రోజున మిగతా భారతదేశంలో ఎంత శాతం (60% నుండీ 65 %)అయితే ఓటింగ్ లో పాల్గొంటున్నారో మిగతా రాష్ట్రాలకు తీసిపోకుండా ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు. ఆర్టికల్ 370 ఎత్తివేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ అందాలను తిలకించుటకు దేశ, విదేశ ప్రజలు స్వేచ్ఛగా ఇప్పటికీ రెండు కోట్ల నలభై లక్షల మంది టూరిస్టులుగా వచ్చి తిలకించి, పులకించి పోయారంటే అక్కడ లా అండ్ ఆర్డర్ ఎంత అదుపులో ఉందో మనకు అర్థమవుతుంది.

ఎందుకు 370 ఆర్టికల్ ఎత్తివేసారో తెలుస్తుంది. సినిమా నిర్మాతల సైతం లొకేషన్ సెలెక్ట్ చేసుకుని షూటింగులకు రెడీ అవుతున్నారు. విదేశీ కంపెనీలు వ్యాపార అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్నారు తద్వారా ఆ రాష్ట్ర ప్రజలందరికీ అన్ని రకాలుగా జీవనోపాధి దొరికి,రాష్ట్ర దేశ ఆదాయం పెరిగి ప్రజలు సంతోషపడి, అక్కడక్కడ చెదురు మదురుగా జరుగుతున్న సంఘటనలను సైతం లెక్కచేయకుండా, విదేశీ శక్తుల, పాకిస్తాన్ టెర్రరిస్టుల ప్రభావాన్ని కూడా లెక్కచేయకుండా ఇది దేశంలో అంతర్భాగం అని ప్రపంచానికి చాటి చెబుతూ ఓటింగ్ లో పాల్గొంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.

ఈ పరిస్థితులన్నీ గమనించిన ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ప్రజలు సైతం, ఈ పాకిస్తాన్ ఆగడాలను తట్టుకోలేకపోతున్నాము మాకు తినడానికి తిండి దొరకడం లేదు. అభివృద్ధి అంతకన్నా లేదు. మా ప్రాంత సంపదనంతా దోచుకుని పోతున్నారు. మమ్మల్ని భారతదేశంలో వచ్చి కలుపుకోండి అని ప్రాధేయపడుతున్నారు. ఇది ప్రపంచమంతా చూస్తూనే ఉంది.

2019 కంటే కూడా 2024 లో సీట్లు పెరిగే రాష్ట్రాల గురించి ఆలోచిద్దాం. గతంలో పశ్చిమబెంగాల్లో ఉన్న 18 సీట్ల నుండి 25 సీట్లకు ఎగబాకుతుంది బిజెపి. కారణం ఆ రాష్ట్రంలో హిందూ మహిళలకు జరిగిన అన్యాయాన్ని, సందేశ్ కాళీ లాంటి ఘటనలలో వారికి అండదండగా నిలబడ్డ బిజెపిని సామాన్య ప్రజల సైతం నమ్మారు. మమత బెనర్జీ షాజహాన్ లాంటి దేశద్రోహులకు , అరాచక శక్తులకు కొమ్ము కాస్తున్నందుకు పశ్చిమబెంగాల్ ప్రజలు చీదరించుకుంటున్నారు.

ఎప్పటినుండో దేశ పౌరసత్వం కోసం పోరాడుతున్న అధిక శాతం ఉన్న మోహితా లకు బిజెపి ప్రభుత్వం పౌరసత్వం ఇవ్వబోతుంది.దేశంలో సిఏఏను అమలు చేయాలని అమలు చేస్తే తృణాముల్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వర్గాలు పూర్తిగా దెబ్బతింటాయి బిజెపికి అనుకూలంగా ఉన్న వర్గాలు పూర్తిగా బలపడతాయి.

ప్రపంచ దేశాలలో సైతం మంచి పేరు ప్రతిష్టలు కలిగిన రామకృష్ణ మిషన్, భారతీయ సేవా సమాజ్, ఇస్కాన్ లాంటి సంస్థలను, భారత జాతీయ భావాలు కలిగిన సంస్థలను మమతా బెనర్జీ ఇష్ట ప్రకారం మాట్లాడిన తరువాత ఆ సంస్థల స్వామీజీలు కాళ్లకు చెప్పులు లేకుండా నిరసన ప్రదర్శన చేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఘటనల వల్ల గతంలో బిజెపికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తులు, ప్రజలు ఈరోజు దగ్గరయ్యారు కావున బిజెపికి సీట్లు పెరగబోతున్నాయి.

రాజస్థాన్ రాష్ట్రంలో గత ఆరు నెలల క్రితం కాంగ్రెస్ చేతిలో ఉన్న రాష్ట్రాన్ని బిజెపి గెలిచి, గతంలో బిజెపి కి వచ్చిన 25 సీట్లు తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఆ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని కులాధిపత్యాల వల్ల కొంతమంది బిజెపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కానీ దేశ సౌభాగ్య దృష్ట్యా సామాన్య ప్రజలు వారిని విశ్వసించక పోవచ్చు.

అస్సాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ నాయకత్వంలో, వారి జాతీయ పరిపాలన నచ్చి పది సీట్ల కంటే మెరుగ్గా ఫలితాలు రాబోతున్నాయి. తూర్పు,ఉత్తర రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ లో అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న 60 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పటికే 10 అసెంబ్లీ స్థానాలు బిజెపి సొంతం అయిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా బిజెపి హస్తగతం కాబోతోంది. అదే విధంగా పార్లమెంటు స్థానాల్లో అధికంగా బిజెపికి సొంతం కాబోతున్నాయి.

వాస్తవ పరిస్థితులు ఈ విధంగా ఉంటే పనికట్టుకొని కొంతమంది కుహనా లౌకికవాదులు దేశ వ్యతిరేకులు బిజెపికి 200 సీట్లే వస్తాయి అని కొంతమంది 150,175 వస్తాయి అని కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారు. వీరి ప్రచారం అంతా నవ్వుల పాలు కాబోతోంది ఖచ్చితంగా వీరి కుయుక్తులు ఎన్ని పన్నినప్పటికీ కూడా గతంలో వచ్చిన 303 సీట్ల కంటే అధికంగా రాబోతున్నాయి.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
మొబైల్ నెంబర్ 7386128877

Leave a Reply