Suryaa.co.in

Andhra Pradesh

అధికారం మాదే

-అప్పుడే సీఎం అయిపోయావా బాబు?
-పురందేశ్వరితో కలిసి కుట్రలు చేశారు
-ల్యాండ్‌ టైటిలింగ్‌పై సైలెంట్‌ అయ్యారేం
-వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ మళ్లీ గెలుస్తుందన్న నమ్మకం ఉంది. ఎవరిని భ్రమలో పెట్టాల్సిన అవసరం మాకు లేదు. జగన్‌పై వ్యక్తిగత విమర్శలు, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై తప్పుడు ప్రచారం చేశారు. జగన్‌ చేసిన పనులను ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఈ తీమ్‌ బలంగా పనిచేసింది. టీడీపీ ఏ కారణంతో గెలుస్తుందో ఒక్కటి చెప్పండి. ఫలితాలు ఎలా ఉంటాయో చంద్రబాబును చూస్తేనే తెలుస్తుంది. అధికారులను మార్చిన చోట ఘర్షణలు జరిగాయి.

చంద్రబాబు, పురందేశ్వరి కుట్ర పూరితంగా అధికారుల విషయంలో వ్యవహరించారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాను అని అనుకుంటున్నారా? ఈ ఆఫీస్‌ అప్‌గ్రేడ్‌ ఇవ్వొద్దని గవర్నర్‌కు లేఖ రాస్తున్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై టీడీపీ ప్రచారంతో వాళ్లకే నష్టం జరి గింది. మళ్లీ ఇప్పుడు దానిపై మాట్లాడటం లేదు. చంద్రబాబు డ్రామాలు ఆడారు ..ఆయనే అందులో కొట్టుకుపోయారని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE