Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం కుదేలైంది

– జగన్ రెడ్డి 33 నెలల పాలలో రూ. 37 వేల కోట్లు విద్యుత్ భారాలను ప్రజలపై మోపారు
– ఏ.పీ.ఈ.ఆర్.సి కేవలం డిస్కంల గురించే కాదు వినియోగదారుల గురించి కూడా ఆలోచన చేయాలి
– టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు లు కిమిడి కళావెంకట్రావ్

జగన్ రెడ్డి 33 నెలల పాలలో రూ. 37 వేల కోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై మోపారు. విద్యుత్ ఛార్జీల రూపంలో రూ. 11,611 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.37,872 కోట్లు అప్పుల భారాలు ప్రజలపై మోపారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరోసారి విద్యుత్ భారాలు మోపాలని చూస్తున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా విద్యుత్ కొనుగోళ్లలో రూ.2,432 కోట్లు ఆదా చేసామని చెబుతున్న ప్రభుత్వం వినియోగదారులపై ఎందుకు భారం మోపాలని చూస్తోంది? రివర్స్ టెండరింగ్ విధానంలో నిజంగా ఆదా చేస్తే ట్రూ డౌన్ ఛార్జీలు ఎందుకు అమలు చేయడం లేదు? ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయాల్సిన అవసరం ఏంటి? కమీషన్ కు డిస్కంల గురించి ఆలోచన తప్పా వినియోగదారుల గురించి పట్టదా? 300 యూనిట్లు లోపు వాడే వారిని దారిద్ర్య రేఖకు దిగువనున్న వారిగా భావించి రేషన్ కార్డులు ఇస్తుంటే జగన్ రెడ్డి దానిని 30 యూనిట్లకు కుదించి చూపడం దుర్మార్గం. 30 యూనిట్లు పైబడి విద్యుత్ వినియోగించే ప్రతి ఒక్కరిపై రేట్ల పెంచాలని ప్రజాభిప్రాయం సేకరిస్తుండటం బాధాకరం. పెంచబోతున్న విద్యుత్ ఛార్జీలను కూడా ఏప్రిల్ నుంచి కాకుండా ఆగష్టు నుంచి అమలు చేస్తామనడం మరో దుర్మార్గం. ప్రమాణస్వీకారోత్సవ సభలో జగన్ రెడ్డి చెప్పిన మాటకు కట్టుబడి విద్యుత్ ఛార్జీలు పెంపును విరమించుకోవాలి. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.22 వేల కోట్లను వెంటనే చెల్లించాలి. విద్యుత్ వినియోగదారులపై భారాలు తగ్గించాలి.

LEAVE A RESPONSE