Suryaa.co.in

Devotional

శ్రీకృష్ణుడు..సొరకాయ

కురుక్షేత్ర మహాసంగ్రామం తరువాత ధర్మరాజు తీర్ధయాత్రలు చేయాలని కోరిక కలిగి శ్రీకృష్ణుడిని తోడు రావలసిందిగా ఆహ్వనించాడు.
శ్రీకృష్ణుడు తనకు తీర్దయాత్రలకు సమయము లేదని చెప్పగా, ధర్మరాజు రావాలసిందే అని ఒత్తిడి చేయగా.. శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రతినిధిగా ఒక సొరకాయని ధర్మరాజుకి ఇచ్చి పంపెను.
ధర్మ రాజు తన సిబ్బందితో ఆ సొరకాయని సకల తీర్దాలలో ముంచి తిరిగి వచ్చాక, అది కృష్ణపరమాత్మకి ఇచ్చి కృష్ణపరమాత్మని తను చేయబోతున్న అన్న సమారాధనకి ధర్మరాజు ఆహ్వానించాడు.
కృష్ణ పరమాత్మ ఆ సొరకాయను వండి అందరికి ప్రసాదముగా వండి పెట్టమని ఆదేశించెను. అప్పుడు ధర్మరాజు ఆ సొరకాయను అందరికీ ప్రసాదముగా పెట్టగా, చేదుగా ఉన్న ఆ సొరకాయ తిన్న అందరూ వాంతులు చేసుకొన్నారు.
ధర్మ రాజు శ్రీకృష్ణా.. నీవిచ్చిన సొరకాయ చేదైనది అని అనగా, శ్రీకృష్ణ‌పరమాత్మ ఓనా అది చేదని నాకు ముందే తెలుసు. అన్ని పుణ్యక్ధేత్రాలలో తిరిగి అన్ని తీర్దాలలో మునిగినా, చేదు తీపి అవలేదనమాట అనగా, ధర్మరాజుకి మర్మం అర్దమై శ్రీకృష్ణపరమాత్మకి నమస్కరించెను.
చిత్తశుద్ధి లేకుండా ఎన్ని తీర్దయాత్రలలో శరీరాన్ని ముంచినా, మనసులో ఉన్న మాలిన్యము పోదు. చేసిన చేస్తున్న పాపాలకి కర్మ అనుభవించకా తప్పదన్నది ఈ సొరకాయ కధలో నీతిసూత్రము.

LEAVE A RESPONSE