కడియం రైల్వేలైన్ విశిష్టత

Spread the love

కడియం రైల్వేలైన్ కి ఒక విశిష్టత ఉంది. కడియం చేపల చెరువుల సమీపంలో రైల్వేలైన్ బాగా వంగి ఉంటుంది. ఒకానొక దశలో ఇంజన్లో ఉన్న డ్రైవర్ చివరి బోగీలో జెండా ఊపే గార్డు ఒకరికొకరు కనిపిస్తారు. అంతటి వంపు ఇక్కడ ఉంటుంది.ఇది ఆసియా ఖండంలోనే రెండో వక్రంగా (curve) చెప్తుంటారు. బ్రిటిష్ వారు రైల్వే లైను వేసే సమయంలో ఈవంపు పెట్టారు. లేకుంటే రైల్వేలైను రాజమండ్రి నగరం తాకకుండా వెళ్ళేది.కడియం ఊరునీ, పంట పొలాల్ని ఓరుసుకుంటూ వెళ్లే ఈ లైన్లో రైలుప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.

– వెలగపూడి గోపాలకృష్ణ

Leave a Reply