Suryaa.co.in

Devotional

అంతరాత్మ-పరమాత్మ…!!

(శ్రీపాద శ్రీనివాసు)

మిన్ను విరిగి మీద పడ్డట్టు “ఫెళ….ఫెళ” మంటూ ఒక్క సారిగా భారీ శబ్ధం…
గాఢ నిద్రలో ఉన్న పరమానందం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి తన చుట్టూ పరికించి చూస్తున్నాడు….
అంత చీకటి మయంగా ఉంది…!
… దూరాన ఎక్కడోనుండో వినిపిస్తున్న కీచురాళ్ళ శబ్ధం..
భయం..భయంగానే తన మంచాన పక్కనే ఉన్న కీటిలోనుంచి బయటకు చూస్తున్నాడు పరమానందం….
క్రమక్రమంగా గాలుల తీవ్రత ఎక్కువవుతోంది….
వీస్తున్న గాలుల ప్రభావానికి తలవీరబూసుకుని నృత్యం చేస్తున్నట్టుగా తనఇంటి చుట్టూ ఉన్న చెట్లు…!

సరిగ్గా అదే సమయంలో…..
ఆకాశం “ బ్రద్దలయ్యినట్లుగా మెరుపులతో కూడిన ఓ భారీ శబ్ధం”…..
……..ఆ శబ్ధ తీవ్రతకు భయంగా ఒక్కసారిగా కళ్ళు మూసేసుకున్నాడు పరమానందం
ఆ క్షణంలో ఏం జరుగుతోందో అర్ధం కాలేదు పరమానందానికి….!!

ఒక్కసారిగా తన చుట్టు వేడి గాలులు ఆవహించాయి పరమానందానికి….. ఆ క్షణంలో తనముందు ఎవరో నిలపడినట్టుగా అలికిడి అవ్వడంతో…భయభయంగా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసాడు…
ఒక్కసారిగా గుండె గుభేలు మంది ఆ క్షణంలో పరమానందానికి…!.
ఎదురుగా “భీకరమైన నల్లటి ఆకారం”..!!.. తన రూపం కంటే భయంకరంగా వికటహాసం చేస్తూ తనముందే నిలబడిఉంది ఆ ఆకారం ….పైగా చేతిలో ముళ్లతో కూడిన ఓ దండం… ఒంటినిండా విభూధీ పూసుకున్న ఛాయలు మరింత భీకరాన్ని కలిగిస్తోంది….!!
…. ఆ భీకార ఆకారానికి తోడుగా ఎవరినో పొడిచొచ్చినట్లుగా రక్తం కారుతున్న కొమ్ములతో ముందుకు దూసుకొస్తున్న వృషభం…
భీతికొల్పుతున్న పరిస్ధితులు తలపిస్తున్నాయి ఆ క్షణంలో పరమానందానికి తన చుట్టూ…!!
భయంతో ఒక్కసారిగా తనపక్కనున్న దుప్పటిని కప్పెసుకున్నాడు పరమానందం…. భీకర ఆకారం చేస్తున్న వికటహాసల తీవ్రత ఎక్కువవుతు ఉండటంతో తన మొహం మీద ఉన్న దుప్పటిని సగం వరకు లాగుకుని భయం..భయంగానే… “ఎవరు నువ్వు… ఎందుకొచ్చావు ఇక్కడికి”..??…అంటూ ప్రశ్నించాడు పరమానందం….!

“నేను ఎవరో నీకు తెలియదా….!! ..నేను మృత్యు దేవతని.. …” అంటూ ఒక్కసారి ముందుకు ఉరికింది ఆ భీకర ఆకారం…
“అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు”..?…అంటూనే భయంగా ప్రశ్నించాడు పరమానందం…..
“ఓరి అర్భకా…నేను ముందుగా చెప్పిరావాలా నీ దగ్గరకు…అయినా నీకు తెలియదా వాన రాకడ..ప్రాణం పోకడ..అనేవి చెప్పి జరిగేవి కాదని…!!”…..అంటూ ఛాతీని ముందుకు ఎగదోస్తూ క్రోధంతో ముందుకు రాసాగింది ఆ మృత్యుదేవత…..

మీ అందరి పాపం శృతి మించుతోంది…అందుకే పరమాత్ముడికి కోపం వచ్చింది…మీ అందరికి ఆవనిపై నూకలు చెల్లినట్టే అంటూ భయంకరంగా కరతాళ నృత్యం చేయడం మొదలు పెట్టింది మృత్యుదేవత….భయంతో వణుకుతున్న తన స్వరంతో కాస్త ధైర్యాన్ని కూడబలుక్కుని…..
“ నాకు నూరేళ్ళపాటు ఆయుషు ఉందని జాతక చక్రంలోనే చెప్పపడింది కదా… మరి ముందుగానే నిన్ను ఎందుకు పంపించాడు ఆ భగవంతుడు”..!!…
“అయినా ఆ పరమాత్ముడికి రోజూ శ్రద్ధగా పూజ చేస్తూనే ఉన్నాను…..అన్నప్రసాదాలు నేవేద్యాలు పెడుతూనే ఉన్నాను కదా”…. మరి దేనికి ఆ భగవంతుడుడికి నా మీద ఇంత కోపం…??

ఆ మాటలకు కోపంగా పళ్లు పటపటలాడింస్తూ మృత్యుదేవత….
“ఓరి అర్భక… పాచిపట్టిన నూతి నీళ్ళతో అభిషేకం…చిత్తశుద్ధిలోపించిన మనస్సుతో నేవేద్యాన్ని సమర్పించడం ఫలితాన్ని ఇవ్వదు… అయినా ఎక్కడో ఉన్న భగవంతుడికి నెవేద్యాలను పెట్టడం కాదు… ఆవనిపై ప్రత్యక్ష దైవాలైన కన్న తల్లితండ్రులకు పట్టెడు అన్నం పెట్టకపోవటం…కాస్తం నీడను ఇవ్వకపోవడం వంటివాటికి పాల్పడుతున్నారు…
మరణాంతరం వారికి కర్మ క్రియలను నిర్వహించడాన్ని కూడ విస్మరిస్తున్నారు… ఈ కారణంగా పున్నామ నరకాన్ని తప్పించుకోలేక పోతున్నారు తల్లితండ్రులు… వారి మనోవేధనలను మేమందరం చూడలేకపోతున్నాం అక్కడ..!!
జాతక చక్రం ప్రకారము మీకు ఉన్న ఆయుఘను చూసి మరింతగా మీరు పెట్రేగిపోతున్నారు… అందుకే పరమాత్ముడు కూడ ఆప్-డేట్ అవుతున్నాడు… మీరు చేస్తున్న పాపపుణ్యాలకు అనుగుణంగానే ఇకపై మీ ఆయుషులో హెచ్చుతరుగుగులు ఉంటాయి..

“సృష్టికి మూలం స్త్రీ మూర్తే….. అటువంటి స్త్రీ మూర్తికి భూమి మీద నిలువనీడ లేకుండా చేస్తున్నారు.. భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు…… ముక్కుపచ్చలారని నాలుగు, ఐదేళ్ల పిల్లలను సైతం చరపడుతున్నారు… మరొపక్క లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు”…
మరోపక్క హైందవ ధర్మాన్ని అపహాస్యం పాలు చేస్తూ అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలను సైతం విస్మరిస్తున్నారు… ఒక కలం పోటుతో విడకాలు అంటూ పెళ్ళిళ్లను పెటాకులు చేసేస్తున్నారు… ఈ విధంగా హైందవ ధర్మాన్ని అపహాస్యం పాలు చేస్తూ స్త్రీమూర్తికి సమాజంలో సాంఘీక భద్రతను లేకుండా చేస్తున్నారు…!

ఇది చాలదు అన్నట్లుగా వావివరసలు మర్చిపోయి అక్రమ సంబంధాలకు ఎగబడటం, మధ్యపాన వ్యసనపరులుగా మారడం రివాజుగా చేసేసుకుంటున్నారు..!!……. పైగా నాడు యజ్ఞయాగాల సమయంలో సురపానం చేయబడలేదా అంటూ దేవతలు, బుషులు, మహానీయులకు తప్పుడు భాష్యాలను ఆపాదించడానికి భరితెగిస్తున్నారు.”….అంటూ కోపంతో శివలెత్తుపోతోంది మృత్యుదేవత….!

“ఈ ఒక్క విషయంలోనే కాదు… మీరు చేస్తున్న పాపాలు…పాల్పడుతున్న అకృత్యాలు ఇంకా అనేకం ఉన్నాయి”…
భగవద్ధీతను సైతం అపవిత్రం చేసేస్తున్నారు.. మిడిమిడి జ్ఞానంతో భగవద్దీత అంటే కేవలం కైవల్యప్రాప్తికి సంబంధించినది అని సరిపుచ్చుకుంటున్నారు… “సాక్ష్యాత్తు పరమాత్మ అవతారుడగు శ్రీ కృష్ణుడు అర్జునకు ఉపదేశించిన ఉపనిషత్తుల సారాంశమే భగవద్దీత”…!!. సమస్త మానవాళి అనుసరించాల్సిన నియమములు గురించి అందులో చెప్పబడింది…
అటువంటి పవిత్ర భగవద్దీతలోని శ్లోకాలను చనిపోయినవారి ఇంట మరియు శవయాత్రలలో భగవద్దీత సారాంశన్ని మైకులు పెట్టి ఊదరగొట్టెయాడాన్ని రివాజుగా చేసేసుకుంటున్నారు…..!
అందుకే ఈ పరిస్ధితుల నేపధ్యంలో ఎవరి ఇంట అయినా భగవద్గీత వినిపిస్తే చాలు “అయ్యో పాపం ఇంట ఎవరో చనిపోయినట్టున్నారు అని వాపోవాల్సిన దిక్కులమాలిన పరిస్ధితులు చోటుచేసుకుంటున్నాయి..
… అందుకే మీ అందరిమీద పరమాత్ముడికి కోపం వచ్చింది…అందుకే నన్ను పంపించాడు”.. అంటూ బిగ్గరగా అరుస్తూ ఎరుపెక్కిన తన కళ్ళను కోపంతో గిరగిర తిప్పుతోంది….మృత్యుదేవత….!

“ఈ పరిణామాలన్నింటికి నేను ఒక్కడినే బాధ్యడిని చేయడం భావ్యమా”…!!?? అంటూ భయంతోనే నెమ్మదిగా గొణుకుతున్నాడు పరమానందం…..
“ఇది నీ ఒక్కడితప్పే కాదు.. సమాజానిది కూడ..! “ నీవంటి వాని ద్వారా సమాజానికి పర్యావసానాలు ఎట్లా ఉంటాయో తెలియాల్సిందే”..!…. అంతేకాదు తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోవడం కూడ పాపమే…. ఎవరైనా పాపానికి ఒరిగొడుతున్నప్పుడు నిలువరించక పోవడం కూడ నేరమే….
ఈ తరహా ఉదాసీనత, స్వార్ధన చింతనతో పంచభూతలైన గాలి, నీరు, నిప్పు..భూమి, ఆకాశం వంటి వాటిని సైతం కాలుష్యం బారినపడే విధంగా వ్యవహారిస్తున్నారు…తద్వారా తమతోపాటు సమస్త జీవరాశుల ఊనికికి గోతులు తీస్తున్నాడు స్వార్ధ మానవుడు..

అందుకే పరమాత్ముడికి మీ అందరిమీద కోపం వచ్చింది… అందుకే నన్ను పంపించింది”… అంటూ తన చేతిలోని మృత్యు దండాన్ని తిప్పుతూ పరమానందం మీదకి ఊరికింది”……..

ఒక్కసారిగా “ రక్షించండి…రక్షించండి..” అంటూ పరమానందం కేకలు పెట్టసాగాడు…
“ఏమండీ ఏమి అయ్యిందండీ”..?… “నాన్న ఏమయ్యింది”……అంటూ గాఢ నిద్రలో ఉన్న పరమానందాన్ని భుజంతట్టి లేపుతున్నారు భార్య పిల్లలు… ఆ కంగారును చూసి భరణిలో ఉన్న విభూధిని పరమానందం మొహం మీదు పూస్తోంది ముసలి తల్లి…..!
అప్పుడు అర్ధం అయింది పరమానందానికి…..
……. తన ముందుకు వాస్తవంగా వచ్చింది మృత్యు దేవత కాదు… సమాజంలో జరుగుతున్న దాష్టీకాల విషయమై తనను “అంతరాత్మ” ప్రశ్నించింది అని..!!….దీన్ని ఆకళింపు చేసుకుని నైతిక ధర్మాలను పాటించడమే ఉత్తమమని….!!..
…..ఆ విధంగా “పరమాత్ముని” ఆడుగుజాడలలో నడిస్తే అంతరాత్మకి సమాధానం చెప్పుకోలేని దుస్ధితి ఏర్పడదని..!!…తద్వారా సంఘం సుభిక్షంగా తన మనుగడను కొనసాగిస్తుందని…!!. ఇది తన ఒక్కడికే కాదు మొత్తం సమాజానికే అందాల్సిన సందేశం అని..!

LEAVE A RESPONSE