Suryaa.co.in

Features

నరకప్రాయంగా మారిన రహదారులు 

జిల్లాలోని పలు ప్రధాన రహదారులు, స్టేట్ హైవే, గ్రామీణ రహదారులు  అధ్వాన్నంగా మారటంతో వాహనాల్లో ప్రయాణం ప్రమాద కరంగా మారటంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందు తున్నారు. వీరితో పాటు వాహన యజ మానులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు యల్లనూరు, పుట్లూరు, శింగనమల, తాడిపత్రి  ముఖ్యంగా తాడిపత్రి  నుండి సింహాద్రిపురం, ప్రొద్దుటూరు పూర్తిగా గుంతల మయం అయ్యింది. యల్లనూరు మండలం శింగవరం దగ్గర చిత్రావతి నది వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. గత సంవత్సరం వేసిన ప్రధాన రహదారి 44 కల్లూరు గార్లదిన్నె దగ్గర గుంతలు ఏర్పడ్డాయి.

గత పది సంవత్సరాలుగా నిర్వహణ లేక  పంచాయితీ రాజ్ రహదారి గుంటల మయంగా మారాయి. ఈ దారుల  గుండా పెద్ద వాహనాల సైతం వెళ్ళే వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఆటోలు ద్విచక్ర వాహనాల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఎక్కడ గుంట ఉందో తెలియని పరిస్థితులు నెలకొని ఉండటంతో రాత్రి వేళ్ళలో ఈ రహదారిపై ప్రయాణం నరకయాతన గా మారిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.తరచు ప్రమాదాలు జరిగి ద్విచక్ర వాహన దారులు గాయాలపాలవుతున్నారు. శింగనమల నుండి గార్లదిన్నె, పామిడి నుండి ఎద్దులపల్లి,  నాగసముద్రం, పుట్లూరు మండలాల్లో రోడ్లు భయానకంగా ఉన్నాయి.    గ్రామీణ ప్రాంత రహదారులు నరకప్రాయంగా మారి దశాబ్ద కాలం అవుతుంది.  గుత్తి నియోజకవర్గంలో  గ్రామీణ ప్రాంతాలల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది.  కొద్ది పాటి వర్షానికి రోడ్లన్నీ ఛండాలంగా తయారయ్యాయి. మాముడూరు, అబ్బేదోడ్డి, అనగానదొడ్డి, పి ఎర్రగుడి, పెద్దొడ్డి రోడ్లు మరి అద్వాన్నంగా ఉన్నాయి. ప్రతి రోజు వ్యవసాయ పనులకోసం ఇదే దారులే గతి.

తురకపల్లి, న్యమతాబాద్, రామరాజుపల్లె  పల్లెలకు వెళ్లాలంటే నరకప్రాయంగా ఉంది.  కూలీలను దూర ప్రాంతాలనుండి పిలుచుకుందామని ఆటోలు మాట్లాడిన రావట్లేదు. గుంతల మయం కావడంతో తరచూ మరమత్తులు చేసుకోవాల్సి వస్తుంది. ప్రతి ఆటోలోను కనీసం పది మందికంటే ఎక్కువగా ఉండటం, లోడ్ ఎక్కువగా ఉండటం  వలన తరచూ క్లచ్ వైర్లు తెగిపోతున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాలకు రాక చాల కాలమయ్యింది.  ఐదు సంవత్సరాల క్రిందట ఎలా ఉందో ఇప్పుడు అంత కంటే దారుణంగా తయారయ్యాయి. కనీసం ట్రాక్టర్ యజమానులు, జెసిబి, ట్రిప్పర్  యజమానులతో  ప్రజలను భాగస్వాములను చేసి రోడ్డు కు ఇరువైపులా ఉన్న కంచెను తీసి గుంతలు పూడిస్తే కొంత కాలం అయినా ప్రజలు తిరగ గలుగుతారు. తరచూ రైల్వే ట్రాక్ మరమత్తులు చేయడంతో ప్రజలకు ప్రత్యామ్న్యాయం లేక  అండర్ పాస్, మోరీల క్రింద పోవాల్సిన పరిస్థితి. కొత్తగా ఎన్నికైన  ప్రజా ప్రతినిధులు కనీసం దారులైన మరమత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మాముడూరు నుండి అబ్బేదోడ్డి 
రహదారి రూపు రేఖలు కొల్పోయి గుంటల మయంగా మారింది. ఈ రహదారి గుండా కనీసం సైకిల్‌పై కూడా సక్రమంగా వెళ్ళే వీలు లేని పరిస్థితి ఉందంటే రహదారుల పరిస్థితి ఎంత ఆధ్వాన్నంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రహదారులపై స్కూల్ బస్సులు,ట్రాక్టర్లు,ఆటోలు ద్విచక్ర వాహనాలు,లారీలు ఎక్కువగా తిరుగు తాయి. గోతులు, పెద్ద పెద్ద గుంటలు ఏర్పడటంతో పలు చోట్ల కంకర రాళ్ళు లేచి ప్రమాదకరంగా మారాయి. రాత్రి వేళ్ళల్లో ఈ రహదారి వెంట ఆటోలుగానీ, ద్విచక్ర వాహనాలుగాని వెళ్ళేందుకు సాహసించరు…అలాగే అణగనదొడ్డి  నుండి పి ఎర్రగుడి  వెళ్ళే  రోడ్డు పరిస్థితి చెప్పనలవికాదు.ముఖ్యంగా మలుపుల వద్ద రోడ్డు అధ్వాన్నంగా మారటంతో పరిస్థితులు దారుణాతిదారుణంగా మారాయి. గుంతకల్లు నియోజకవర్గంలోని ఈ రహదారులు పాలకులు 15 ఏళ్ల కింద ఏర్పాటు చేయబడినవి. ఇంతవరకు ఎలాంటి మరమ్మత్తులు చేయలేదు. ప్రభుత్వం  ఏర్పడి నలభయ్ నెలలు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు జిల్లాలోని ఏ గ్రామంలోకూడా రోడ్లు వేసులేదని,మరమత్తు లు చేపట్టలేదని  ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డా ముచ్చుకోట సురేష్ బాబు అన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించటంతో నిర్మించిన అద్వాన్నంగా మారాయి. దీనితో తరచూ ఈ రహదారులపై ప్రయాణం ప్రమాదకరంగా మారాయని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.తరచూ ఏదో ఒక రహదారిపై ప్రమాదాలు జరగటంతో ఒక్కొసారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో పాటు కాళ్ళు, చేతులు పోగొట్టుకున్న సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి.అధికారులు ఇకనైనా స్పందించి అధ్వాన్నంగా మారిన రహదారుల మరమ్మతులు చేపట్టాలని కర్షక సమాఖ్య అధ్యక్షులు బాయినేని నాగేంద్ర ప్రసాద్, తాటికొండ సత్యనారాయణ  కోరుతున్నారు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE