Suryaa.co.in

Andhra Pradesh

నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి

-మండలాల ప్రత్యేక అధికారులు విస్తృతంగా మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
-జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

పుట్టపర్తి, మే 23 : మండలాల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని కోర్టు కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల అమలపై మరియు గురువారం (25.5.23 తేదీ)రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై. సమగ్ర నివేదికలు సిద్ధం చేయుటపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూప్రభుత్వ పథకాల నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళిక బద్ధంగా అధికారులు పని చేయాలిలక్ష్య సాధనలో పురోగతి లేనిచో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు . నాడు నేడు పనులు వేగవంతం చేయాలని, స్కూల్ తెరిచే నాటికి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మహిళా పోలీస్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి ఏవైనా సమస్యలు గుర్తించినచో వాటిని కన్సిస్టెంట్ రిథమ్ యాప్ లో అప్లోడ్ చేసి వాటి పరిష్కారం సత్వరమే జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

ఇప్పటివరకు ఏవైనా పెండింగ్ ఉంటే వాటిని మూడు రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా బెనిఫిషరీ ఔట్ రీచ్ ప్రోగ్రాం సర్వే లో బాలింతల సర్వేలో వెల్ఫేర్ అసిస్టెంట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని రాబోయే రెండు రోజుల్లోపు పురోగతి ఉండాలని సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి డిఎంహెచ్ఓ సర్వే సకాలంలో పగడ్బందీగా జరిగేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. 6- 19 సంవత్సరాల పిల్లల ఆధార్ నమోదు, 0-5 సంవత్సరాల పిల్లలకు ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆసుపత్రి, పీహెచ్సీ, సిహెచ్,సి అర్బన్ హెల్త్ సెంటర్స్ లలో పుట్టిన పిల్లలకు సత్వరమే జనన ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని తదనుగుణంగా ఆధార్ నమోదుకు చర్యలు చేపట్టాలని, ఆదేశించారు. ఏపీ సేవ యొక్క సేవలు మరిన్ని పెంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, వైద్య శాఖ ను సమీక్షిస్తూ అసంక్రమిత వ్యాధుల సర్వే వివరాలను ఆన్లైన్లో యాప్ లో అప్లోడ్ చేయాలని సంబంధిత వైద్య అధికారులు వారి ఏఎన్ఎం లను సమీక్షించుకొని రేపటి రోజుపూర్తి చేయాలని ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని ఇందులో ఓపి మరియు ఫాలో అప్ యాక్షన్ సక్రమంగా ఉండాలని పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా డిజిటల్ అక్నాలజీమెంట్ పనులు 100% పూర్తి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. పై కార్యక్రమాలలో ఎటువంటి అలసత్వం నిర్లక్ష్య వైఖరి కనిపించినా చర్యలు తప్పవని అందరూ అధికారులు బాధ్యతాయుతంగా లక్ష్యాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని ఉన్నత స్థాయిలో ఈ అంశాలన్నీ సమీక్షిస్తున్నారని, లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి అని హెచ్చరించారు.

ఈ సమీక్షలో సిపిఓ విజయ్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, డిఎంహెచ్ఓ ఎస్ వి కృష్ణారెడ్డి, ఐసిడిఎస్ పిడి లలిత కుమారి, బిసి సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గ్రామ వార్డుల నోడల్ అధికారి శివారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ యువ వాణి. ఎస్ సి పి ఆర్ గోపాల్ రెడ్డి విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE