Suryaa.co.in

Telangana

ఇందిరమ్మ రాజ్యంలో పరిస్థితి అధ్వానం

-చవట, దద్దమ్మ…రాష్ట్రం మొత్తాన్ని ఎండబెట్టారు?
-నీటి నిర్వహణ తెలియక, నాణ్యమైన కరెంట్‌ లేక ఈ దుస్థితి
-సీఎం రేవంత్‌పై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజం
-ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటల పరిశీలన

చవట, దద్దమ్మ…రాష్ట్రం మొత్తాన్ని ఎండబెట్టారని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎండిపోయిన పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిరచారు. కాళేశ్వరం ద్వారా కరీంనగర్‌ జిల్లాలో నాలుగు సజీవ ధారలు సృష్టించాం. వాటి ఫలితాలను కూడా ఉమ్మడి కరీంనగర్‌ వాసులు అనుభవించారన్నారు. అప్పర్‌ మానేరు, కాకతీయ వరద కాలువ, ఎల్లంపల్లి ద్వారా గత ఐదేళ్లుగా నీటి ఫలితాలను ఇక్కడ ప్రజలు అనుభవించారు. నాలుగు నెలల్లోనే దాన్ని మొత్తం ఎండిపోయేలా చేసింది కూడా ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈ దుస్థితి దాపురించిందన్నారు.

నీటి నిర్వహణ తెల్వని చవట, దద్దమ్మలు రాజ్యమేలుతున్న కారణంగానే ఈ పరిస్థితి.కాలం తెచ్చిన కరువా? ప్రజలు తెచ్చిన కరువా? కాంగ్రెస్‌ తెచ్చిన కరువా? ప్రజలు ఆలోచించుకోవాలని ధ్వజమెత్తారు. అడ్డగోలు, తొండిమాటలతో తప్పించుకోవాలని చూస్తే అది జరగదు. 15 నుంచి 20 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయాయన్నారు. ప్రతి చోటా ఇదే పరిస్థితి. నీటి నిర్వహణ తెల్వకపోవటం, నాణ్యమైన కరెంట్‌ లేకపోవటం కారణంగానే పంటలు ఎండిపోయాయన్నారు. రైతుబంధు విషయంలో ఓ పాలసీ లేదు. 48 గంటల్లో చనిపోయిన రైతుల లిస్ట్‌ ఇవ్వమంటే 4 గంటల్లో ఇచ్చాం. చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి. వాళ్ల కుటుంబాలను పరామర్శించాలి. లేదంటే రైతుల ఉసురు మీ ప్రభుత్వానికి కచ్చితంగా తగులుతుందని విమర్శించారు. సూర్యాపేటలో నేను పోయిన వెంటనే నీళ్లు వదిలారు. సాగర్‌లో డెడ్‌ స్టోరేజీ మీద కన్నా 14 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు లెప్ట్‌ కెనాల్‌కు నీళ్లు వదులుతున్నారు. కూలిపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నీళ్లు వదిలారు..కేసీఆర్‌ ముందే చెప్పొచ్చు కదా అంటాడు సీఎం. మరి నువ్వా సీఎం నేనా?

కొన్ని రోజుల ముందు నీళ్లు వదిలి ఉంటే ప్రతి గ్రామంలో ఎండిపోయిన పంట మనకు దక్కేది. డిసెంబర్‌ 9 నాటి రుణమాఫీ ఎక్కడ పోయింది. బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతుల కొంపలు పుచ్చుకుంటు న్నాయి. జొన్న పంటను మొత్తం కొనాలె. క్వింటాకు రూ. 500 బోనస్‌ ఇవ్వాలె. లేదంటే వెంటాడుతామని అన్నారు. మీరు ఇచ్చిన హామీలతో అన్ని వర్గాలు మోసపోయాయన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సంబం ధించిన కంపెనీ కట్టిన మిడ్‌ మానేర్‌ కట్ట కొట్టుకుపోయింది. కోమటి రెడ్డిని జైల్లో పెట్టాలనుకుంటే మేము పెట్టకపోయే వాళ్లమా? రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను వదిలిపెట్టాం. గోదావరిలో నీళ్లు ఎత్తటానికి మీకు ఎందుకు చేతనైత లేదు. మేం ఉన్నప్పుడు మే నెలలో కూడా మత్తలు దూకినయ్‌. తెలివి తక్కువ తనంతో 50 టీఎంసీ నీళ్లు వదిలేసిన్రు అని ఇంజనీర్లు చెప్పారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో నీళ్లన్నీ పోయేలా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు సంబంధించి ఎన్ని పంపులు ఉన్నాయో వీళ్లకు తెలుసా? అని ప్రశ్నించారు.

ప్రాజెక్టులలో చిన్న చిన్న లోపాలు జరుగుతాయి. వాటిని భూతద్దం పెట్టి చూపుతున్నారు. ఈ దద్దమ్మలకు చాతగాకపోతే 50 వేల రైతులను తీసుకొని పోయి వీళ్లను పండిబెట్టి తొక్కి మేడిగడ్డ వద్ద నుంచి నీళ్లు నేనే నింపుతా. హైదరాబాద్‌ లో రూపాయికి నల్ల ఇచ్చినమ్‌. ఇందిరమ్మ రాజ్యం లో ఎప్పుడైనా ఇలా ఇచ్చారా? హైదరాబాద్‌లో మళ్లీ ఎందుకు ట్యాంకర్ల దందా నడుస్తోందో చెప్పాలని, ఉచితంగా ఇవ్వాలని కోరారు. బంగారం లాంటి భగీరథ స్కీమ్‌ను ఎందుకు నడుపటం లేదన్నారు. బ్యాంకులతో మీటింగ్‌ పెట్టి రుణమాఫీ మీద స్పష్టత ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కారమయ్యే విధంగా మీ మెడలు వంచి హామీలు అమలయ్యే విధంగా చేస్తామన్నారు. నేత కార్మికులను నీచంగా మాట్లాడిన కాంగ్రెస్‌ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఫసల్‌ బీమా యోజన అట్టర్‌ ప్లాప్‌ స్కీంగా మిగిలిందని విమర్శించారు.

LEAVE A RESPONSE