• జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఆడబిడ్డలపై దారుణాలకు సంబంధించి 518 ఘటనలు జరిగాయి.
• ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 518 కుటుంబాలకు కన్నీటివేదన మిగిల్చింది.
• అత్యాచారానికి గురైన బాధితులు, నిందితులను సరిగా గుర్తించలేకపోతున్నారని, అందుకే శిక్షించలేకపోతున్నామని హోంమంత్రిచెప్పడం సిగ్గుచేటు.
*మాజీ మంత్రి పీతలసుజాత
జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో రాష్ట్రం అత్యాచారాలు, అఘాయిత్యాలతో దారుణంగా తయారైందని, ఆడబిడ్డలు, యువతులు, భయంభయంగా బతుకుతున్నారని, ఆఫ్ఘనిస్తాన్ కంటే దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని మాజీ మంత్రి పీతలసుజాత ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ, ప్రజలరక్షణను గాలికొదిలేసి నిద్రావస్థకు చేరిందన్నారు. ఆడబిడ్డలపై కీచకుల ఆగడా లు అంతూపొంతూలేకుండా కొనసాగుతుంటే, వాటిని కట్టడిచేసి, నింది తులను శిక్షించాల్సిన పోలీస్ విభాగం, ప్రతిపక్షనేతలే లక్ష్యంగా తప్పుడు కేసులతో చెలరేగిపోతోందన్నారు.
హోంమంత్రి నిన్న మాట్లా డుతూ, అత్యాచారానికి గురైన బాధితురాళ్లు, నిందితులనుసరిగా గుర్తిం చలేకపోతున్నారని, అందువల్లే వారిని అరెస్ట్ చేసి, తగినవిధంగా చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పడం ఎంతటి సిగ్గుచేటో ఆమే ఆలోచించుకోవాలని సుజాత హితవుపలికారు. మహిళైన వ్యక్తి హోంమంత్రిగా ఉండి, ఆ విధంగా వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అత్యాచారానికి గురైన బాధితురాలు నిత్యం దు:ఖంతో కుమిలిపోతూ ఉంటుందని, అలాంటి ఆమె నిందితులను సరిగా గుర్తించడంలేదని హోం మంత్రి చెప్పడంకంటే నీచం మరోటి ఉండదన్నారు. ఆడబిడ్డలను చెరబట్టి, వారిపై అఘాయిత్యాలకు పాల్పే సమయంలో నిందితులు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు పడేసి వెళ్లిపోతారా అని పీతల సుజాత ఎద్దేవాచేశారు.
ఇళ్లకు వెలుగునిచ్చే, మా ఇంటిమహాలక్ష్ములు అని పిలవబడే ఆడబిడ్డలు, దుర్మార్గుల దారుణాలకు బలవుతుంటే, ప్రభుత్వం ఈ విధంగా దోషులకు వత్తాసుపలికేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. నిందితులను బాధితురాళ్లు గుర్తించకపోతే, ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోలేరా అని టీడీపీనేత మండిపడ్డారు. హోం మంత్రి వ్యాఖ్యలు నిందితులకు మరింత స్వేచ్ఛనిచ్చేలా, వారు మరిన్ని దురాగతాలకుపాల్పడేలా ఉన్నాయన్నారు. జరగరాని దారుణాలు జరిగితే పోలీస్ స్టేషన్ల పరిధితో సంబంధంలేకుండా జీరో ఎఫ్ఐఆర్ లు నమోదుచేయాలని గతంలో డీజీపీనే చెప్పారని, కానీ ఆచరణలో ఎక్కడా అది అమలుకావడంలేదన్నారు. మేడికొండూరు ఘటనలో బాధితురాలికి ఇదే అనుభవం ఎదురైందన్నారు. అత్యాచార బాధితురాళ్లు ఇచ్చే వాంగ్మూలాలకంటే బలమైన ఆధారం ఏముంటుం దో పోలీసులు, హోంమంత్రి సమాధానంచెప్పాలన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన హోంమంత్రి, డీజీపీలు గాలిమాటలు చెబుతూ, బాధితురాళ్లకు అన్యాయాన్నే మిగులుస్తున్నా రన్నారు. రమ్య హత్యోదంతంలో ప్రభుత్వం ఇంతవరకూ నిందితులను ఎందుకు శిక్షించలేకపోయిందన్నారు. నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న లోకేశ్ ని అడ్డుకున్న పోలీసులు, సదరుయువతిని దారుణంగా చంపేసిన విష్ణువర్థన్ రెడ్డిని ఎందుకు శిక్షించలేకపోయారని సుజాత మండిపడ్డారు. న్యాయాన్ని, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే, ఇక ఈప్రభుత్వం లోఆడబిడ్డలకు దిక్కెవరని ఆమె వాపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆడబి డ్డలు, యువతులకు శాపంగా మారుతోందన్నారు. దిశాచట్టం కింద 21 రోజుల్లో నిందితులను శిక్షించామని చెబుతున్న ప్రభుత్వం, ఇప్పటివర కు ఎందిరిని శిక్షించిందో వివరాలు వెల్లడించాలన్నారు.
హోంమంత్రి ముగ్గురికి ఉరిశిక్ష, 20మందికి యావజ్జీవ శిక్షలు వేయించినట్టు చెప్పార ని వారివివరాలను కూడా ప్రభుత్వం వెంటనే బహిర్గతంచేయాలని సుజాత డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం, ఆడబిడ్డల రక్షణకోసం ప్రత్యేకంగా ఎలాంటి చట్టాలను అమలుచేయాల్సిన పనిలేదన్న సుజాత, నిర్భయచట్టాన్ని కచ్చితంగా అమలుచేస్తే సరిపోతుందన్నారు. దిశా చట్టం పేరుతో ప్రభుత్వం బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, నిందితులపై చర్యలు తీసుకోకుండా వెంటనే వదిలేస్తోందన్నారు. తప్పలుచేసినవారు దర్జాగా బయట తిరుగుతుంటే, ఆడబిడ్డల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని, ఇలాంటి నీతిమాలి న పనులుచేయడానికేనా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేసిందని సుజాత నిలదీశారు.
ఈ ప్రభుత్వంలో రెండున్నరేళ్లలో దాదాపు 518 వరకు ఘటనలు జరిగాయని, ముఖ్యమంత్రి, డీజీపీలు ఉండేప్రాంతాల్లో జరిగినఘటనల్లోనే నిందితులను శిక్షించలేకపోయా రన్నారు. జగన్ ప్రభుత్వనిర్లక్ష్యం, అసమర్థత 518 కుటుంబాలకు కన్నీటిని మిగిల్చిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై పోలీస్ శాఖ కూడా ఆలోచన చేయాలన్నారు. ప్రతిపక్షాలను అకారణంగా అడ్డుకుంటున్న పోలీస వ్యవస్థ ప్రభుత్వం చెప్పుచేతల్లో కీలుబొమ్మగా మారిందని సుజాత ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల తీరు రాష్ట్రానికి ఎం త మాత్రం క్షేమకరం కాదన్నారు. రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే, నిందితులకు మూత్రం పడేదన్నారు. చంద్రబాబునాయుడి హయాంలో నిందితులను దారుణంగా శిక్షించిన పోలీసులు ఇప్పుడెందుకు పనిచేయడంలేదో వారు ఆత్మవిమర్శ చేసు కోవాలన్నారు.
ప్రభుత్వం ఆడబిడ్డల విషయంలో చాలాపెద్ద తప్పు చేస్తోందని, ప్రతిపక్షాలను పోలీసులతో అడ్డుకోవడం ఎల్లకాలం కుదరదని సుజాత తేల్చిచెప్పారు. ప్రజలే సహనంకోల్పోయి, ప్రభుత్వంపై పోలీసులపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. ప్రభుత్వంలేని దిశాచట్టంతో ప్రజలను, మరీ ముఖ్యంగా మహిళలను వంచించడం ఎంతమాత్రం మంచిదికాదన్నారు. ఆడబిడ్డలకు అన్నగా ఉండి, వారికి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పడానికి వెళుతున్న లోకేశ్ ను అడ్డుకుంటున్న పోలీసులు, ప్రభుత్వం రేపు చంద్రబాబునాయుడిని , లక్షలాదిమంది టీడీపీకార్యకర్తలను అడ్డుకోలదా అని సుజాత ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు ప్రజలను, ఆడబిడ్డలను మభ్యపెట్టే కార్యక్రమాలకు స్వస్తిపలికి, దుర్మార్గుల దురాగతాలకు బలవుతున్న వారికి ఎలాన్యాయంచేయాలో ఆలోచిస్తే మంచిదని మాజీమంత్రి ఈ సందర్భంగా హితవు పలికారు.