Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రానికి తిరిగి కోలుకోలేనంత నష్టం కలిగింది

– ప్రభుత్వంపై పోరాటం తప్ప మరో అవకాశం లేదు.
– రాష్ట్రాన్ని రిపేరు చేయాలంటే సమిష్టిగా పనిచేయాలి.
– సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండికెక్కింది.
– ప్రభుత్వానికి పైశాచిక ఆనందం తప్ప ప్రజల సమస్యలు, అభివృద్ధిపై ద్యాస లేదు.
-టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
రాష్ట్రానికి తిగిరి కోలుకోలేనంత నష్టం కలిగిందని, ప్రభుత్వంపై పోరాటం తప్ప మరో అవకాశం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ బాధ్యులు వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు టీడీపీ కేంద్రకార్యాలంలో బుధవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జిగా బాబ్జీని నియమించాక కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచే మొదటి స్థానం తాడేపల్లిగూడెం అన్నారు. సర్పంచ్, పరిషత్ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం పరిధిలో మంచి ఫలితాలు సాధించారని తెలిపారు.
ఇదే స్ఫూర్తిని వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సూచించారు. ఎప్పడు ఎన్నికలు జరిగినా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో టీడీపీనే గెలపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రమంతా విధ్వంసమే జరగుతోంది. ఎక్కడ చూసినా రాక్షసపాలన సాగుతోంది. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుంది. కార్యాకర్తలు, నాయకులు ఐకమత్యంతో ముందుకు వెళ్లి పార్టీని గెలిపించాలి. ఎర్రకాలువ వరదలు వచ్చాయి. 4,500 ఎకరాల్లో పంట నష్టపోయింది. ప్రభుత్వం ఎలాంటి పరిహారమూ అందించలేదు. రైతులకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇన్ పుట్ సబ్సీడీ, పంట నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. 30 శాతం పరిహారం ఇచ్చి మమ అనిపిస్తున్నారు. పంట నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వరి ధాన్యానికి కావాల్సిన ఇత్తనాలు కూడా సరిగా ఇవ్వనందున దిగుబడి కూడా తగ్గిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో సీజన్ వచ్చేనాటికి రైతాంగానికి అవసరమైనవన్నీ అందించి అండగా నిలబడి రైతాంగాన్ని కాపాడాం.
ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండికెక్కింది. దున్నపోతు మీద వర్షం పడినట్లు ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. జనం అవస్తలు పడుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని ఆనందం పొందుతున్నాడు. పైశాచిక ఆనందం తప్ప ప్రజల సమస్యలు, అభివృద్ధిపై ద్యాస లేదు. జాతీయ రహదారులు తప్ప రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. రాష్ట్రాన్ని రిపేరు చేయాలంటే అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదు, ధైర్యంగా ముందుకు వెళ్లండి’’ అని చంద్రబాబు తెలిపారు.
డ్రగ్ మాఫియా దాడులకు బెదిరే ప్రసక్తి లేదు
రాష్ట్రంలో వేలకోట్లరూపాయల డ్రగ్ మాఫియా కార్యకలాపాలను బట్టబయలు చేసిన పార్టీ సీనియర్ నేతలు పట్టాభి, రాజప్ప, కొండబాబు, నవీన్, రామకృష్ణారెడ్డిలు కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వైసిపి మూకల దాడి దుర్మార్గం. డ్రగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్న మాఫియా నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ మూకతో దాడులకు తెగబడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై డ్రగ్ మాఫియా దాడులకు దిగుతుంటే పోలీసు యంత్రాంగం నిద్రపోతోందా? వైసిపి నేతల నిజస్వరూపం బయటపడుతుందనే భయంతోనే ఎమ్మెల్యే ద్వారంపూడి గూండాలు తెలుగుదేశం నేతలపై దాడులకు దిగారు. డ్రగ్ మాఫియా ఆగడాలకు, వైసిపి మూకల తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదు. తాలిబాన్లతో వైసిపి నేతలకు ఉన్న లింకులన్నీ ఒక్కొక్కటిగా బట్టబయలు ప్రజాక్షేత్రంలో ఎండగట్టి తీరుతాః పోలీసు యంత్రాంగం తక్షణమే కాకినాడలో తెలుగుదేశం నేతలపై దాడికి దిగిన మాఫియా మూకలను అరెస్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎటువంటి హాని జరిగినా ముఖ్యమంతి వైఎస్ జగన్, రాష్ట్ర డిజిపి, పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాం.

LEAVE A RESPONSE