Suryaa.co.in

Andhra Pradesh Editorial

చిన్నారులను కాటేసిన పాము

ఒకరి మృతి, మిగిలిన వారి పరిస్థితి విషమం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఖరీదైన కార్పొరేట్ స్కూళ్లలో చదువు‘కొనలేని’ పిల్లలకు సర్కారు హాస్టళ్లే దిక్కు, అదే వారికి ఒక నారాయణ.. ఇంకో శ్రీచైతన్య.. మరో విజ్ఞాన్, వికాస్‌లు. ఆ హాస్టళ్లలో సీటొస్తే వారికి కార్పొరేట్ సూళ్లలో వచ్చినంత సంబరం. తల్లిదండ్రులను వదలి, సర్కారు హాస్టళ్లలో చేరుతున్న వారికి మరి సర్కారు బ్రతుకుభరోసా ఇస్తోందా? వారి ప్రాణాలకు పూచీకత్తు ఇస్తోందా? లేక పాములు, తేళ్లు, జెర్రుల మధ్య వారి మానాలకు వారిని వదిలేస్తుందా?.. అవును. అక్కడి బీసీ హాస్టల్‌లో ఇప్పుడు అదే జరిగింది. పాము

కాటేసిన ముగ్గురు చిన్నారులో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ పరిస్థితిని మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పుష్పవాణి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలోని ఈ బీసీ బాలుర హాస్టల్ వైపు ఓసారి తొంగిచూడండి. మీకే అర్ధమవుతుంది.

అది విజయనగరం జిల్లా కురుప్పాం జ్యోతి బాపూలే బీసీ హాస్టల్. విద్యార్ధులు ఎప్పటిమాదిరిగానే పాఠాలు

చదవడం పూర్తి చేసి పడుకున్నారు. కానీ ఈలోగా ఓ పాము వారి గదిలోకి దూరింది. అది తెలియని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు.

అంతే..లోపలికి జొరబడ్డ పాము, అక్కడ పడుకున్న ముగ్గురిని వరసగా కాటేసింది. దానితో బిక్కచచ్చిన విద్యార్ధుల ఆర్తనాదాలతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆ ముగ్గురినీ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో
Whats-App-Image-2022-03-04-at-10-28-31-1 విశాఖ ఆసుపత్రికి తరలించారు. అందులో మంతిని రంజిత్‌కుమార్ అనే విద్యార్ధి చికిత్సపొందుతూ మృతి చెందినట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్‌కుమార్ శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిగిలిన ఇద్దరి
Whats-App-Image-2022-03-04-at-10-28-31 పరిస్థితి విషమంగా ఉంది. ఇదీ సర్కారు హాస్టళ్లలో పిల్లల ప్రాణాలకు ప్రభుత్వం ఇస్తున్న భద్రత. పాలకులూ…. మీకు అర్ధమవుతోందా?బీసీ పిల్లల ప్రాణాలంటే సర్కారుకు లెక్కలేదనే ప్రతిపక్షాల విమర్శలకు ఈ తాజా ఘటన నిలువెత్తు నిదర్శనంగా మారింది.

LEAVE A RESPONSE