– పర్సంటేజీలు ఇస్తున్న వారికే బిల్లులు
– గవర్నర్ పేరుని పరిపాలనకు ఉపయోగిస్తారు తప్ప, ప్రభుత్వంచేసే అప్పలకుకాదని బుగ్గనకు తెలియదా?
– ఉద్యోగులకు దానధర్మంగా జీతాలు ఇవ్వడంలేదని సజ్జల తెలుసుకుంటే మంచిది
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళాదిశగా పయనిస్తోందని, జగన్మోహన్ రెడ్డి నిర్వాకంతో ఇప్పటికే అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్లపాలు కానుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
అప్పులకోసం ఈ ప్రభుత్వం ఆఖరికి గవర్నర్ నుకూడా బలిచేసింది. రెండున్నరేళ్లలోనే రూ.3లక్షలకోట్లపైచిలుకు అప్పులుచేశారు. సాలీనా రాష్ట్రప్రజలపై రూ.35వేలకోట్లవరకు భారం వేశారు. గవర్నర్ అధికారులను పిలిచి, తనపేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చిందంటే, ఈ ప్రభుత్వం ఎటుపోతోందో, పతనావ స్థదిశగా ఎంతవేగంగా వెళుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎఫ్ఆర్ఎంబీ పరిమితి 4శాతమైతే, దాన్ని అధిగమించి 11శాతంవరకు అడ్డగోలుగా కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేశారు.
గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంతరాష్ట్రానికివెళ్లినాకూడా, ప్రభుత్వంచేసిన అప్పులు, వాటితాలూకా తప్పులు ఆయన్ని వదలవు. ఏప్రభుత్వమైనా అప్పులకు శాఖలపరిధిలోనే హామీలివ్వాలిగానీ, వ్యక్తులపేరుతో బ్యాంకులనుంచి అప్పులు తీసుకోకూడదు. కానీ గవర్నర్ ను వ్యక్తిగతంగా అప్పులకు వాడుకోవడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. గవర్నర్ పేరుతోనే అన్నీ నడుస్తాయని బుగ్గున చెబుతున్నారు. పరిపాలన గవర్నర్ పేరుతో నడుస్తోంది తప్ప, అప్పులకోసం ఆయన పేరుని ఎవరూ వాడుకోరని మంత్రికితెలియదా?
ప్రభుత్వం చేసే అప్పులు, గ్యారంటీలకు వ్యక్తిగతంగా గవర్నర్ హమీఇస్తారా? ప్రభుత్వానికి పరపతిలేదుకాబట్టే, ఈ ముఖ్యమంత్రిని చూసి ఎవరూ అప్పుఇవ్వడంలేదు కాబట్టే, చివరకు గవర్నర్ పేరుని వాడుకున్నారు. ప్రపంచబ్యాంక్ కూడా ఏపీకి అప్పులుఇవ్వడానికి జంకే పరిస్థితి వచ్చిందంటే, అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతికాదా? కాంట్రాక్టర్లకు బకాయిలు, ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వముంది. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా …కాస్త ఆలస్యమైతే ఏమిటన్నట్లు, ఉద్యోగులకు ఏదోధర్మం చేస్తున్నట్టుగా బుగ్గన మాట్లాడుతున్నారు. బుగ్గన గారికి సిగ్గుందా.. ఉంటే అలామాట్లాడతారా?
మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు ఠంచన్ గా ఒకటోతేదీనే జీతాలు తీసుకుంటున్నప్పుడు, జీతాలపై బతికే ప్రభుత్వఉద్యోగులకు సకాలంలో జీతాలు ఎందుకివ్వరు? ఏదో దానధర్మంగా ఇస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడు తున్నారు. ఉద్యోగులకు ఇస్తున్న జీతాలు ప్రజలసొమ్మునుంచి ఇస్తున్న వనే విషయం సజ్జలకు తెలియదా? కీలకమైనస్థానాల్లో ఉన్నవారు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదు.
సీఎఫ్ఎంఎస్ పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారు. ఎవరైతే పర్సంటేజీలు ఇస్తున్నారో, వారికే బిల్లులు క్లియర్ చేస్తున్నారు. కరోనావల్లే ఆదాయం తగ్గిందని, ప్రజలపై భారం పడిందని చెబుతున్నారు. కరోనాసమయంలో మద్యం ధరలుపెంచిన ప్రభుత్వం, వేలకోట్లను వ్యసనపరులనుంచి కొల్ల గొట్టింది. పెట్రోల్ డీజిల్, వంటగ్యాస్, నిత్యా వసరాల ధరలుపెంచిన ప్రభుత్వం వాటిపై ప్రజలనుంచి వేలకోట్లు దండుకుంటోంది. ప్రజలను, ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి, విచ్చలవిడిగా అప్పులుతెస్తున్న ప్రభుత్వం, ఇప్పటివరకు రూ.3లక్షలకోట్ల అప్పులు తెచ్చినా సకాలంలో ప్రభుత్వం ఎందుకు జీతాలివ్వడంలేదు?