బిజెపి గెలుపు దేశ ప్రజల విజయం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

విజయవాడ: బిజెపి గెలుపు దేశ ప్రజల విజయంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు అభివర్ణించారు. నాలుగు రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించిన నేపధ్యంలో బిజెపి రాష్ట్రకార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. బిజెపి శ్రేణులు డాన్స్ లతో హోరెత్తించారు . బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

సోమువీర్రాజు కార్యాలయానికి చేరుకోగానే బాణా సంచా కాల్చి డప్పు వాయిద్యాలతో వేడుకులు నిర్వహించారు.

ఏపీ బిజెపి కార్యాలయం వద్ద కోలాహలం కొనసాగింది.పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి సంబరాలు జరిపిన బిజెపి రాష్ట్ర నాయకులు స్వీట్లు పంచి అభినందనలు తెలుపుకున్న నాయకులు.సంబరాలలో పాల్గొన్న సోము వీర్రాజు, పలువురు నాయకులు. సోము వీర్రాజు ను‌ కలిసి రాజధాని రైతులు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సోమువీర్రాజు మాట్లాడుతూ, అమరావతి రాజధాని అని బిజెపి ఎప్పుడూ చెబుతూనే ఉందన్నారు. ఈవిషయం అందరూ గమనించాలన్నారు.

అనంతరం బీజెపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మీడియా తో మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించాం.పంజాబ్ లో కూడా ఓట్లు పెంచుకునే ప్రయత్నం చేసాం.ఇది భారతీయ ప్రజా విజయం.భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 2 లోకి తీసుకెళ్ళేలా మద్దతు ప్రజలిచ్చారు
మోడీ చెబితే రష్యా యుద్ధం ఆపింది.ఏపీలో రాజకీయ నాయకులు మోడీని విరుద్ధంగా తీసుకుంటున్నారు.రాబోయే రోజుల్లో ఏపీలో కూడా నాలుగు రాష్ట్రాల్లో జరిగిందే జరుగుతుంది.మోడీ బియ్యానికి ముప్ఫై మూడు రూపాయలిస్తున్నారు.నితిన్ గడ్కరీ రోడ్లు రయ్ రయ్ అంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోడ్లను పట్టించుకోదు.

గ్రామ సభల్లో మోడీ ఇప్పటి వరకూ ఇచ్చిన నిధులు, పధకాలు చెపుతాం.ఓటు కుండలను పక్కకు పెట్టి ఓటు బ్యాంకు సిద్ధం చేస్తున్నాం.ఎపి లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి.2024ఎన్నికలో దేశ వ్యాప్తంగా మరోసారి బిజెపి కి ప్రజలు పట్టం కట్టడం ఖాయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెడతామని అందులో భాగంగా ప్రజలకు మేం ఏం చేస్తాం అన్నది వివరిస్తామన్నారు.

ప్రజలు భారతీయ జనతాపార్టీ వైపు ఉన్నారన్న విషయం ప్రతిపక్షాలు అంగీకరించాలన్నారు. కేంద్రం ప్రభుత్వం చేస్తున్న అభివ్రుద్ది పనులను ప్రజల్లోకి తీసుకుని వెడతామన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత కోనసీమలో రైలు పట్టా కూడా చూడలేదని అయితే కేంద్రం నిధులు కేటాయిస్తే వైసిపి ప్రభుత్వం సహకరించడం లేదని ఇదేవిషయం కోనసీమ ప్రజలకు వివరిస్తామన్నారు. ఈవిధంగా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బరిలోకి దిగుతామని వివరించారు. ఈ ఎన్నికల తరవాత అయినా కుటుంబ పార్టీలు తమ ఆలోచనా సరళిని మార్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతిరాణి, ఓబిసి మోర్చా రాష్ట్రప్రధాన కార్యదర్శి దాసం ఉమామహేశ్వరరాజు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు బొడ్డు నాగలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీ రాం, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కర్రి నాగలక్ష్మి , బిజెపి నాయకులు పోతిరెడ్డి వెంకట్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply