Suryaa.co.in

Andhra Pradesh

రైతుల శ్రేయస్కారమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి కాకాణి

•రైతు భరోసా కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో అనుసంధానించి రైతులకు ఉత్తమ సేవలు
• 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు, సీఈవోలతో మంత్రి సమీక్షా సమావేశం
• పీఏసీఎస్ ల అడాప్షన్ పాలసీ, COBNET మోబైల్ యాప్ విడుదల
• గ్రామ స్థాయిలో రైతులకు విస్తృతస్థాయి సేవలందించాన్న సీఎం ఆకాంక్షను నెరవేర్చాలని అధికారులకు మంత్రి సూచన
• మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

రాష్ట్రంలో 10,778 రైతుభరోసా కేంద్రాలను (RBK)లను రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(PACS)కు అనుసంధానించి రైతులకు ఉత్తమసేవలు అందించాలని, తద్వారా గ్రామ స్థాయిలో రైతులు, గ్రామీణ సమాజానికి విస్తృత సేవలందించాలన్న ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాకార బ్యాంకు లిమిడెడ్ (ఆప్కాబ్) కార్యాలయంలో డీసీసీబీ చైర్ పర్సన్ లు, సీఈవో లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆప్కాబ్ అభివృద్ది కోసం చైర్ పర్సన్ లు, అధికారులు చెప్పిన ప్రతి విషయంపై కూలంకషంగా మంత్రి కాకాణి చర్చించారు. అనంతరం PACS అడాప్షన్ పాలసీ, 59వ యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ 2021-22, కార్పోరేట్ గవర్నెన్స్ పాలసీ, COBNET మొబైల్ యాప్ లను మంత్రి విడుదల చేశారు. ఆప్కాబ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ప్రగతిని మంత్రికి వివరించారు. అనంతరం 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు మంత్రిని కలిసి శాలువాతో సత్కరించి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… అప్కాబ్ 2021-22 వసంవత్సరానికి 40% పైగా వృద్ధి రేటుతో అద్భుతమైన ప్రగతిని సాధించిందని, వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ వ్యవసాయ రుణ పంపిణిలలో సహకార బ్యాంకులు
1 మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత సహకార రంగంలో పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింన్నారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం APCOB, DCCBలకు 295 కోట్లు షేర్ కేపిటల్ రూపంలో సహయం చేసిందన్నారు. ఈ రోజు APCOB గాని, 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కానీ లాభాల్లో నడుస్తున్నాయంటే దానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. ఈ బ్యాంకులపై శ్రద్ధ వహించి, గత సంవత్సరం దాదాపు రూ. 600 కోట్ల పైచిలుకు బకాయిలు విడుదల చేయడం జరిగిందన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రోజు జిల్లా కేంద్ర, సహకార బ్యాంకులు, APCOB లాభాల ఉండి.. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై సమీక్ష నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సహకార బ్యాంకులకి బకాయిలు విడుదల చేయడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ స్కీములతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవసాయ యాంత్రీకరణ, ఆర్బీకే గోడౌన్ల నిర్మాణం వంటివి మన బ్యాంకుల ద్వారా చేపించి, పెద్దఎత్తున ఈ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్బీకేలు, పీఏసీఎస్ ల అనుసంధానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీఏసీఎస్ ల బలోపేతానికి ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు మేలు కలిగిలే అవసరమైన అన్ని వసతులు, సదుపాయాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని.. ఆ రకమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. మూడంచెల సహకారవ్యవస్థలో పైనున్నరెండు అంచెలు APCOB, DCCBs ఆర్థికంగా బలపడ్డాయని, దిగువన ఉన్నప్రాథమిక వ్యవసాయ సంఘాలుఇంకా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఛైర్ పర్సన్ లకు, సీఈవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి మీద దృష్టిపెట్టాలని మంత్రి కోరారు. ముఖ్యంగా రైతుల శ్రేయస్కారం కలిగించే చర్యలు, కంప్యూటరైజేషన్ కు ప్రణాలికలు రూపొందించామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. .

ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ పర్సన్ ఇన్ ఛార్జ్ ఎం. ఝాన్సీ రాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ వై. మధు సూదన్ రెడ్డి, సీసీ అండ్ ఆర్సీఎస్ బాబు. ఏ., ఆప్కాబ్ ఎండీ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, సీజీఎం ఎన్. రాజయ్య, ఆప్కాబ్ 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు, సీఈఓ లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE