Suryaa.co.in

Andhra Pradesh

రైతులను నట్టేట ముంచిన వైసీపీ ప్రభుత్వం

– కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి ధ్వజం

రైతుల వద్ద కొనుగోలు చేసి న ధాన్యానికి ప్రభుత్వం బకాయిలు తీర్చలేదు.సరికదా తడిసిన ధాన్యానికి తేమ శాతం పేరుతో మిల్లర్లు అన్యాయం చేస్తే ప్రభుత్వం పట్టించుకోదు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ నుండి రైతు లు ఆనందంగా ఉన్నారని మాటలు వల్లె వేయడం పై కుమార స్వామి దుయ్యబట్టారు.ఈ మేరకు మీడియా కు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

మాటలతో మాయ చేయడం మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. వాణిజ్య పంటలు తో పాటు ఆహారధాన్యాల ను పండించే రైతులు వరకు అందరూ నష్టాలు చెవి చూసారు.కేంద్రం ప్రవేశ పెట్టిన బీమా విషయం లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు గమనించిన తర్వాత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శత్రువు గా పరిగణించాలి.

LEAVE A RESPONSE