– 50 కోట్ల విలువైన దళితుల భూమిని కాజేసిన కిలాడి రోశయ్య
-కలెక్టర్ వేణుగోపాల రెడ్డి తో కుమ్మక్కయ్యారు
-కిలాడి రోశయ్య పై విచారణ చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?
– టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ల సవాల్
గుంటూరు: రూ. 50 కోట్ల రూపాయల విలువ చేసే దళితుల భూములు దోచుకున్న కిలాడీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పై ప్రత్యేక విచారణ చేయించే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని పొన్నూరు మాజీ ఎమ్మెల్యే,సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సవాల్ విసిరారు.
బుధవారం గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని అనమర్ల పూడి గ్రామంలో 30 ఎకరాల ఎసైన్డ్ భూమి 1972సం.నుండి సం.2022లో వారి పేరున ఉన్న వాటిని నేడు నయా దోపిడీకి వైసీపీ ఎమ్మెల్యే కిలారు, జిల్లా కలెక్టర్ సాయంతో స్వాహాకు తెరలేపారు.
అనమర్ల పూడి ఎసైన్మెంట్ భూములు లాక్కుని బెదిరించి 50 కోట్ల రూపాయల భూములు తీసుకున్న కిలారు రోశయ్య, అదే గ్రామంలో 56 దళితుల కుటుంబాలు తమకు భూములు లేవని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే వారికి ఇవ్వడానికి మాత్రం వైసీపీ అధినేత కు కనపడలేదా? అని ప్రశ్నించారు.
ఈ దారుణం రెవెన్యూ అధికారులకు కనపడలేదా? దళితులంటే లెక్కలేని తనమా? అని నిలదీశారు.ముఖ్యమంత్రి దళితుల పేరు చెప్పి ఆర్డినెన్స్ తెచ్చి అసైన్డ్ భూములు దళితుల భూములు వైకాపా గద్దల పేర రాయడానికి రెవెన్యూ అధికారులు త్వరితగతిన పూర్తి చేయడం గమనించాలి.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన, ఆయన అనుచరులు రాబందుల్లాగా పేద దళితుల భూములపై వాలి దౌర్జన్యం చేసి మరీ లాక్కుంటున్నారు. “వైసీపీ నేతలు రాబందుల్లా దళితుల భూములను లాక్కోవడానికి జిల్లా కలెక్టర్ తో పాటు రెవెన్యూ అధికారులు కూడా కలసి పని చేయడం వల్ల తక్షణమే ముఖ్యమంత్రి ప్రత్యేక విచారణ జరిపించాలి.
దళితులకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేయడానికి వారి తరుపున ధూళిపాళ్ల నరేంద్ర ఉంటాడు.దళితుల ఎసైన్డ్ ల్యాండ్స్ ఎలాగైనా దోచుకోవాలనే నెపంతో ముఖ్యమంత్రి ఒక జీవో తెచ్చి సుప్రీంకోర్టు నియమ నిబంధనలు తుంగలో తొక్కి భయపెట్టి బెదిరించి బినామిలా పేర్లతో కొట్టేయడం మొదలుపెట్టారు. 2011-12 సం. లో రెవెన్యూ అధికారులు దళితుల పేర పట్టాదారు పాస్ బుక్స్ ఇస్తే 22ఏ క్రింద నేడు తొలగించి జిల్లా కలెక్టర్ తో కలసి ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు.
ఎసైన్మెంట్ దారులకు వారసులు ఉంటే వారికి మాత్రమే దానిపై హక్కులు కలిగి వుంటారు.కానీ విలువైన భూములు ఎసైన్మెంట్ దారులకు చెందిన 30 ఎకరాలు భూమి 50 కోట్ల రూపాయల విలువ చేసే దానిని దోపిడి చేశారు.జగన్మోహన్ రెడ్డి బాగా దోపిడీ చేసే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ ఇచ్చి జిల్లాలకు పంపరా అని ఎద్దేవా చేశారు.
1977 లో అసైన్డ్ భూములు అమ్మడానికి లేదు అని చట్టం తెచ్చారు.ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ భూములు అమ్ముకోడానికి ఆర్డినెన్స్ తెచ్చించి వేల కోట్ల విలువైన భూములను వైసీపీ నాయకులు కాజేశారు. 940 కోట్ల ప్రజా ధనాన్ని పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వివిధ మార్గాల్లో ప్రజా సంపదను దోపిడీ చేశారు.గుంటూరు జిల్లాలో 22 ఏ కింద భూములు తొలగించారు.
అధికార యంత్రాంగం కూడా వీరికి వత్తాసు పలుకుతున్నారు. ఈ భూములు తొలగించిన పాత్రలో జిల్లా కలెక్టర్ కీలక భూమిగా పోషించారు. ఆర్డినెన్స్ 9 అడ్డుపెట్టుకుని పేద ప్రజల భూములు వైసీపీ నాయకులు రాబంధుల్లా లాక్కుపోయారు.2011 లో 56 మంది దళిత రైతులు హైకోర్టు కి వెళ్లారు. 56 మంది రైతుల భూములు కూడా అసైన్డ్ చేయండి అని కోర్టు తీర్పు ఇచ్చినది.దళితుల భూములకు ఆర్డినెన్సు్ ను తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.
ఈ ఆర్డినెన్సు ను అడ్డం పెట్టుకుని పేదలను భయపెట్టి,బెదిరించి వేలకోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారు.2540 కోట్ల ప్రజాధనం స్థానిక ఎమ్మెల్యే రోశయ్య దోచుకున్నారని ప్రజా పోరాటం లో ప్రజలకు వివరించాం.1972-2022 వరకు లిటిగేషన్ లో ఉన్న 56 మంది దళితుల భూములను భూస్వామి వర్గం దోచుకున్నారు.ఆర్డినెన్సు 9 ప్రకారం పది సంవత్సరాలు పాటు వారి స్వాధీనం లో ఉండాలి.వాగులు,వంకలు, చెరువులు ఇష్టారాజ్యంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తో కుమ్మక్కు అయి దోచుకున్నారు.
అసైన్డ్ భూముల వారసులు ఉన్నారో లేదో చూడాలి.వారసులే లేని వారి భూములను బినామీల పేరు పై బదిలి చేయించుకున్నారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య కోర్టుకు వెళ్ళిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెత్తందారాలు దోపిడీ దారుల వ్యవస్థ నడుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదల భూములను బకాసురుల్లాగా దోచుకుంటున్నారు.
ఎసైన్మెంట్ దారులకు వారసులు ఉంటే వారికి మాత్రమే దానిపై హక్కులు కలిగి వుంటారు.కానీ విలువైన భూములు ఎసైన్మెంట్ దారులకు చెందిన 30 ఎకరాలు భూమి 50 కోట్ల రూపాయల విలువ చేసే దానిని దోపిడి చేశారు. జగన్మోహన్ రెడ్డి బాగా దోపిడీ చేసే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ ఇచ్చి జిల్లాలకు పంపరా అని ఎద్దేవా చేశారు.1977 లో అసైన్డ్ భూములు అమ్మడానికి లేదు అని చట్టం తెచ్చారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ భూములు అమ్ముకోడానికి ఆర్డినెన్స్ తెచ్చించి వేల కోట్ల విలువైన భూములను వైసీపీ నాయకులు కాజేశారు.940 కోట్ల ప్రజా ధనాన్ని పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వివిధ మార్గాల్లో ప్రజా సంపదను దోపిడీ చేశారు.గుంటూరు జిల్లాలో 22 ఏ కింద భూములు తొలగించారు. అధికార యంత్రాంగం కూడా వీరికి వత్తాసు పలుకుతున్నారు.ఈ భూములు తొలగించిన పాత్రలో జిల్లా కలెక్టర్ కీలక భూమిగా పోషించారు.
ఆర్డినెన్స్ 9 అడ్డుపెట్టుకుని పేద ప్రజల భూములు వైసీపీ నాయకులు రాబంధుల్లా లాక్కుపోయారు.2011 లో 56 మంది దళిత రైతులు హైకోర్టు కి వెళ్లారు.56 మంది రైతుల భూములు కూడా అసైన్డ్ చేయండి అని కోర్టు తీర్పు ఇచ్చినది. దళితుల భూములకు ఆర్డినెన్స్ ను తీసుకొచ్చి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.ఈ ఆర్డినెన్సు ను అడ్డం పెట్టుకుని పేదలను భయపెట్టి, బెదిరించి వేలకోట్ల విలువైన భూములు కొట్టేస్తున్నారు.
2540 కోట్ల ప్రజాధనం స్థానిక ఎమ్మెల్యే రోశయ్య దోచుకున్నారని ప్రజా పోరాటం లో ప్రజలకు వివరించాం. 1972-2022 వరకు లిటిగేషన్ లో ఉన్న 56 మంది దళితుల భూములను భూస్వామి వర్గం దోచుకున్నారు.ఆర్డినెన్సు 9 ప్రకారం పది సంవత్సరాలు పాటు వారి స్వాధీనం లో ఉండాలి. వాగులు,వంకలు, చెరువులు ఇష్టారాజ్యంగా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తో కుమ్మక్కు అయి దోచుకున్నారు. అసైన్డ్ భూముల వారసులు ఉన్నారో లేదో చూడాలి.
వారసులే లేని వారి భూములను బినామీల పేరు పై బదిలి చేయించుకున్నారు.ఎమ్మెల్యే కిలారి రోశయ్య కోర్టుకు వెళ్ళిన 56 మంది రైతులను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెత్తందారులు దోపిడీదారుల వ్యవస్థ నడుస్తుంది.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదల భూములను బకాసురుల్లాగా దోచుకుంటున్నారు.”అని విమర్శల వర్షం కురిపించారు.