– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
వీరులపాడు మండలం : సోమవారం నాడు ఉదయం ఈ క్రాఫ్ట్ నమోదులో జరిగిన అవకతవకల వలన పంట భీమా రాని రైతులను ఆదుకోవాలని వీరులపాడు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం, తహసీల్దార్ వారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేసి మండల వ్యవసాయ అధికారి కి, తహసిల్దార్ కార్యాలయంలో స్థానిక తేదేపా నేతలతో కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ..
రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు సమన్వయం తో కలిసి చేయాల్సిన పని ఈ రోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు. విఏఏ లు వాలంటీర్లు ఇచ్చిన జాబితా అగ్రికల్చర్ ఆఫీసుకు పంపుతున్నారు.ఇవాళ ఎక్కడ కూడా లబ్ధిదారుల జాబితా కూడా బహిర్గతం చేయడం లేదు.
మొన్న స్థానిక ఎమ్మెల్యే ఎవరయితే లిస్ట్ అడిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం.నష్టపోయిన రైతుకి అడిగే హక్కు కూడా లేదా? జాబితాలో చాలా మంది వైసీపీ నాయకులు,కార్యకర్తలు ,సానుభూతి పరులు ఉన్నారు.ఈ బోగస్ కేంద్రాల ద్వారా పెద్ద స్కామ్ చేస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. నష్టపోయిన నిజమైన రైతుకు పంటనష్ట పరిహారం అందేవరకు తెలుగుదేశం పార్టీ రైతుల తరపున పోరాటం చేస్తాం.