– నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినా అభ్యర్ధుల జాబితా ఎందుకు ప్రకటించలేదు?
– పోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు తిరస్కరిస్తారా?
కొంతమంది అధికారులు వైసీపీ రౌడీలతో కుమ్మక్కయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
– చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికి చట్టబద్దంగా శిక్ష తప్పదు
– నారా చంద్రబాబు నాయుడు
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందని, అందుకు కొంతమంది అధికారులు సహకరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలిపెట్టబోమని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. స్ధానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ప్రలోభాలు, అరచకాలకు పాల్పడుతున్నారు.అందుకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు. నెల్లూరులో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసి 3 గంటలవుతున్నా ఇంతవరకు అభ్యర్ధుల తుది జాబితా ప్రకటించలేదు. కానీ మరో వైపు 8 వార్దులు ఏకగ్రీవమైనట్టు ఆర్వో ప్రకటించారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారం మీకెవరిచ్చారు? ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నారు?
మీ ఇష్ట ప్రకారం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా? అధికారులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఎన్నికల సంఘానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న చిత్తశుద్ది ఉంటే నెల్లూరులో ఎన్నికల్ని రద్దు చేయాలి. అక్కడ దినేష్ కుమార్ అనే అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు పనులు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. వైసీపీ రౌడీలు, గూండాలకు భయపడి కొంతమంది అధికారులు బానిసత్వం చేస్తున్నారు.
వైసీపీ పాలనలో ఇప్పటికే రాష్ట్రం తగలబడిపోయింది. వాళ్ల తప్పులు బయటపడతాయని ఎక్కడిక్కడ తప్పుడు పనులు చేస్తున్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు ఎక్కడా చూడలేదు. టీటీపీ అభ్యర్ధుల నామినేషన్ల పత్రాలు, ఈసీ, కలెక్టర్ కి పంపించాం. మేం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా..కొంతమంది అధికారులు బరితెగించి తప్పుడు కారణాలు తప్పుడు సంతకాలతో మా అభ్యర్దుల నామినేషన్లు రిజెక్ట్ చేశారు. ఏం తమాషా అనుకుంటున్నారా? కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం తప్పుడు పనులు చేస్తున్నారు, మా అభ్యర్ధుల నామినేషన్ పత్రాలన్ని అన్ని క్లియర్ గా ఉన్నాయా లేవా సమాధానం చెప్పాలి?
రాష్ట్రంలో కొంతమంది రౌడీలు, గూండాలు తయారయ్యారు, ఇలాంటి వారిని వదలిపెట్టే సమస్య లేదు. మీ అరాచకాలు ఏ మాత్రం సాగవు. అరాచకాలకు పాల్పడే వారు, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారు భవిష్యత్ లో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. పోలీస్ వ్యవస్థలో కొందరు లాలూచి పడుతున్నారు. కొందరు అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఏ ఒక్క అధికారిని వదలిపెట్టం.
ఉన్మాది, తుగ్లక్ ముఖ్యమంత్రి గా ఉంటే మీ ఇష్ట ప్రకారం గా వ్యవహరిస్తారా? ప్రజాస్వామ్య పరిరక్షణకు తెలుగుదేశం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఏ వక్కరిని వదలిపెట్టం. తప్పుడు పనులు చేసే వారిని ప్రజల్లో దోషులుగా నిలబెలబడతాం. వైసీపీ అరాచకాలపై ప్రజలందరూ ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మన కుటుంబాల్ని కాపాడుకోగలం. లేకపోతే మన కుటుంబాలు సపర్ అవుతాయి.
రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. మౌనంగా ఉంటే అరాచక శక్తులు ఇంకా రెచ్చిపోతారు. ప్రజలు దీనిపై ఆలోచించాలి. నెల్లూరులో అరాచకాలపై ఈసీకి లేఖ రాశాం. దీనిపై ఈసీ వెంటనే స్పందించాలి…ఈ ఎన్నికలు రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. వైసీపీ నేతల అరాచకాలపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.