Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ క్రిమినల్ పార్టీ మాత్రమే కాదు గంజాయి పార్టీ కూడా

– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
వైసీపీ క్రిమినల్ పార్టీ మాత్రమే కాదు గంజాయి పార్టీ కూడా. గంజాయి పార్టీ కార్యకలాపాలను టీడీపీ బట్టబయలు చేస్తోందనే అక్కసుతో ప్రజల దృష్టిని మరల్చేందుకు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకలు దండెత్తారు. వైసీపీ నేతల ప్రోద్భలంతోనే ఆ పార్టీ కార్యకర్తలు గంజాయి, మందు మత్తులో వచ్చి టీడీపీ కార్యాలయ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచారు. డీజీపీ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా చచ్చిపోయిందా?
దాడిపై మాట్లాడకుండా మత్రి బొత్స మొదలు గుడివాడ అమర్నాథ్ రెడ్డి వరకూ తమ పదవులు కాపాడుకునేందుకు ఇష్టమొచ్చినట్టు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. తామెప్పుడు అసభ్య భాష మాట్లాడలేదని ముఖ్యమంత్రి సాక్షిలో ప్రకటనలు ఇస్తున్నారు. నాడు నంద్యాల ఉప ఎన్నిక సమయంలో చంద్రబాబు గారిపై జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా దిగజారి మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. 33 క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గంజాయి కేంద్రంగా మార్చేశారు. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు గారు. ఆ విషయం మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. నీ తల్లికి పెందుర్తిలో టీడీపీ టికెట్ ఇచ్చిన విషయం గుర్తులేదా?
కారణం లేకుండా నారా లోకేష్ , అశోక్ బాబు గార్లపై ఏ1, ఏ2 ముద్దాయిలంటూ కేసులు పెడతారా? వాళ్లు ఏం చేశారని కేసు పెడతారు? ఏ1 అంటే జగన్ రెడ్డి, ఏ2 అంటే విజయసాయి రెడ్డి గుర్తొస్తారు ప్రజలకు . ఒక్క కేసు కూడా లేని లోకేష్ గారిపై ఏ1 ముద్దాయని కేసు పెట్టారంటే మిమ్మల్ని ఏమనాలి? హైదరాబాద్ సీపీ గారే ఏపీ డ్రగ్స్ పై అన్నీ చెప్పారు. త్వరలో సాక్ష్యాలతో సహా వైసీపీ డ్రగ్స్ మాఫియాపై ప్రెస్ మీట్ పెడతాను. అప్పుడు మీరు చేసిన అక్రమాలు బయటపెడతాను. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై హోంమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆమెకైనా అర్ధమవుతోందా?
నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు తమ విద్యాసంస్థల్లో డ్రగ్స్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించమని డీఐజీ స్థాయి అధికారిని పిలిపించారు. ఎటుపోతోంది రాష్ట్రం? మీ బెదిరింపులకు బెదరం. అదరం. ఏం చేసుకుంటారో చేసుకోండి. రాష్ట్రంలో డ్రగ్స్ బారినపడిన వారు ఎందరున్నారో, ఎంతమంది సైకియాటిస్ట్ దగ్గరకు వెళుతున్నారో పోలీసులు ఆరా తీయడం మానేసి దాడులకు తెగబడుతున్న వారికి కొమ్ము కాస్తారా? చేనేత వర్గానికి చెందిన సోషల్ మీడియా ఇన్ చార్జ్ పై దాడి చేశారు. వైసీపీ మమ్మల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం.

LEAVE A RESPONSE