– పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా
వైసిపి అధికార పార్టీ మెప్పు కోసం కొందరు పోలీసు అధికారులు శృతి మించి వ్యవహరించడంతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్ల కుమార్ రాజా ఆరోపించారు.
పామురు టౌన్ నాలుగు రోడ్లు కూడలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ శత జయంతి ఉత్సవాల పురస్కరించుకొని విగ్రహ కమిటీ ఏర్పాటుచేసిన బ్యానర్ లను పోలీసు వారి సహకారంతో పంచాయతీ సిబ్బంది తరలించకుపోయారు, విషయం తెలుసుకున్న కుమార్ రాజా తిరిగి అదే స్థానంలో అన్న ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ శత జయంతి ఉత్సవాల బ్యానర్లని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహం చుట్టూ ఉన్న బ్యానర్లు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ పోలీసు వారు తొలగించడం తీవ్ర ఆక్షేపనీయం అన్నారు. వైసీపీ వారు సాధికారక బస్సు యాత్ర పేరుతో పచ్చటి చెట్లను, కొట్టివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిజేసి కార్యక్రమం నిర్వహిస్తే ఈ పోలీసు వారు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదే సమయంలో పోలీసు వారు గుడివాడ డివిజన్ లోని నందివాడ పోలీస్ స్టేషన్ కు కుమార్ రాజా ని తరలించడం జరిగింది.