Suryaa.co.in

Andhra Pradesh

జీవీఎల్ విశాఖ క్షేత్ర స్థాయి నియోజకవర్గ పర్యటనలకు అనూహ్య స్పందన

పర్యటనలో పెద్ద యెత్తున జీవీఎల్ ను చుట్టుముట్టి తమ సమస్యల పరిష్కారానికై అభ్యర్థిస్తున్న ప్రజలు
రైల్వే శాఖ సంబంధిత అనేక సమస్యలపై జీవీఎల్ స్థానికులతో చర్చ

విశాఖ: క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి విశాఖపట్నంలోని నియోజకవర్గ పర్యటనలను ప్రారంభించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ కు అనూహ్యంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను జీవీఎల్ కు వివరిస్తూ వాటి పరిష్కారానికై పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయి.

నిన్న గాజువాక నియోజకవర్గం తో పాటు, ఈరోజు విశాఖ వెస్ట్ నియోజకవర్గంలో కంచరపాలెం 56 వ వార్డు వద్ద గల రైల్వే సంబంధిత అండర్ పాస్ సమస్య, మరియు చాకలిగెడ్డ వద్ద మూడు గ్రామాల ప్రజలు దశాబ్దాలు ఎదుర్కొంటున్న విశాఖ నగరంతో వారికి కావలసిన కనెక్టివిటీ సమస్యను గురించి పరిశీలనకై వెళ్ళినప్పుడు మూడు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున జీవీఎల్ చుట్టుముట్టి తమ గోడును వెళ్ళబోసుకున్నారు.

వారికి హామీనిస్తూ జీవీఎల్ కేంద్ర నిధులతో నిర్మాణమైన అండర్ పాస్ కు ఎమ్మెల్యే గణబాబు తన పేరు పెట్టుకున్నారు అని, కానీ స్థానిక ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను మాత్రం పరిష్కరించలేక పోయారని,తాను వీలైనంత త్వరగా రైల్వే అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి తాను ప్రయత్నిస్తానని తెలియజేశారు.

ఎంతోకాలంగా ఈ సమస్యల పరిష్కారానికై తాము టిడిపి, వైసిపి పార్టీ వారిని అభ్యర్థిస్తున్నప్పటికీ తమను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూశారని, ఈ సమస్య పరిష్కారానికి ఏ విధమైన ప్రయత్నాలు జరగలేదని మూడు గ్రామాల ప్రజలు వాపోయారు.

ఈ రైల్వే అండర్ పాస్ లను వర్షాకాలంలో ,మరియు విశాఖ నగరంలో ప్రవేశానికి రైల్వే లైన్ లను దాటుతున్నప్పుడు అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో తమ యొక్క పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, తమను వీలైనంత త్వరగా ఈ దుస్థితి నుంచి గట్టెక్కించాలని వేడుకొనగా జీవీఎల్ వెంటనే స్పందించి వెంటనే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలో సంబంధిత సమస్యలపై పరిష్కారం కొరకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు..
తాను వీలైనంత త్వరగా సమస్యా పరిష్కారానికి కృషి చేస్తానని స్థానిక ప్రజలకు జీవీఎల్ హామీనిచ్చారు. ఈ పర్యటనలో బిజెపి వెస్ట్ కన్వీనర్ దాడి రమేష్ , యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బీసెట్టి నాని,స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE