రైల్వే లో 109 స్టేషన్లలో 120 ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా స్థానిక ఉత్పత్తుల ప్రచారం

Spread the love

తెలంగాణలోని 41 స్టాళ్ల ద్వారా 1435, ఆంధ్రప్రదేశ్‌లోని 56 స్టాళ్ల ద్వారా 1960, మహారాష్ట్రలోని 20 స్టాల్స్ నుండి 700, కర్ణాటకలోని 03 స్టాల్స్‌ నుండి 105 మంది వెరసి 120 ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా దాదాపు 4200 మంది ప్రత్యక్ష లబ్ధిదారులు వ్యాపార అవకాశాలను పొందారు.

భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ సమాజంలోని అల్ప ఆదాయ వర్గాలకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడానికి స్థానిక/స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్‌ను అందించడం మరియు వాటిని ప్రోత్సహించడానికి నూతన చొరవతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’అనే పథకాన్ని ప్రారంభించింది. 2022-23 యూనియన్ బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించినప్పటినుండి ప్రజాదరణ పొందింది. దక్షిణ మధ్య రైల్వే అంతటా మొదట ఆరు రైల్వే స్టేషన్ల లో ప్రారంభించబడినాయి. స్థానిక ప్రజల నుండి అపారమైన స్పందన రావడం వలన ఇప్పుడు, 109 రైల్వే స్టేషన్లలో 120 స్టాళ్లతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ నిర్వహించబడుతున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలోని తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్నాటక రాష్ట్రాలలో ఒక స్టేషన్‌ ఒక ఉత్పత్తి కలిగిన రైల్వే స్టేషన్ ల మరియు స్టాళ్ల సంఖ్య ఈ క్రింది విధముగా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ , వరంగల్, నిజామాబాద్ , గద్వాల్ మొదలైన 33 రైల్వే స్టేషన్‌ లలో , ఒక స్టేషన్‌ ఒక ఉత్పత్తితో కూడిన 41 స్టాల్స్‌ ఏర్పాటు ద్వారా స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధి మరియు సంక్షేమానికి పెద్ద ప్రోత్సాహాన్నికలుగజేస్తున్నాయి. ఇందులో కొన్ని ఉత్పత్తులలో సాంప్రదాయ నారాయణపేట, గద్వాల్ మరియు పోచంపల్లి చీరలు వంటి స్థానిక నేత కార్మికులు చేనేత వస్త్రాలు ఉన్నాయి; మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు; టిస్కో చేనేత, భద్రాచలం వెదురు ఉత్పత్తులు ; ఆలయ దేవతా విగ్రహాలు; అటవీ సేకరణలు చేతిపనుల బొమ్మలు; నిర్మల్ బొమ్మలు, స్థానిక రుచికరమైన వంటకాలు మొదలైనవి లభిస్తున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విజయవాడ, తిరుపతి , కర్నూలు, గుంటూరు, అనంతపురం , నెల్లూరు మొదలైన 53 రైల్వే స్టేషన్‌ లలో , “ఒక స్టేషన్‌ ఒక ఉత్పత్తి” 56 స్టాల్స్‌ ఏర్పాటు ద్వారా స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధి మరియు సంక్షేమానికి పెద్ద ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్టాల్స్‌లో కొన్ని ఉత్పత్తులలో జనపనార ఉత్పత్తులు, కలంకారి ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, చెక్క తో తయారు చేసిన వస్తువులు , మిల్లెట్ ఆధారిత మొదలైన ఉత్పత్తులు లభ్యమౌతున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని, నాందేడ్ , ఔరంగా బాద్ , హిమాయత్నగర్ , నాగర్సోల్ , ముద్ఖేడ్ మొదలైన వాటితో సహా 20 రైల్వే స్టేషన్ లలో “ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి “ 20 స్టాల్స్ ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజల జీవనోపాధికి ప్రధాన ప్రోత్సాహం లభిస్తుంది. ఈ స్టాల్స్‌లో కొన్ని ఉత్పత్తులలో చేనేత ఉత్పత్తులు, చాపలు, రాజ్గిరా లడ్డూ , జొన్నపిండి , పాపడ్స్ మొదలైనవి ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే అధికార పరిధిలోని కర్నాటక రాష్ట్రంలో బీదర్ , యాద్గిర్ మరియు రాయచూర్లు మొదలైన 03 రైల్వే స్టేషన్ లలో “ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి“ 03 స్టాల్స్ ఏర్పాటు స్థానిక ప్రజలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ స్టాల్స్‌లో ఉత్పత్తులలో చేనేత చీరలు, బిద్రి హస్తకళలు, చేతితో తయారు చేసిన ఆభరణాలు మొదలైన ఉత్పత్తులు ఉన్నాయి.

భారతీయ రైల్వేలు ఈ పథకం కింద స్వదేశీ/స్థానిక ఉత్పత్తులను ప్రదర్శించడం, విక్రయించడం మరియు అధిక దృశ్యమానతను అందించడం కోసం ఎన్.ఐ.డి./అహ్మదాబాద్ రూపొందించిన డిజైన్ ప్రకారం స్టేషన్‌లలో విలక్షణమైన రూపం, అనుభూతి మరియు లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన విక్రయ కేంద్రాలను అందిస్తోంది. స్టేషన్లలో లాట్ల డ్రా ద్వారా రొటేషన్ ప్రాతిపదికన పథకం యొక్క లక్ష్యాలను చేరుకునే టెండరింగ్ ప్రక్రియ ద్వారా దరఖాస్తుదారులందరికీ కేటాయింపు జరుగుతుంది.

ఓ.ఎస్.ఓ.పి పాలసీలో, ఈ పథకం యొక్క ప్రయోజనం తప్పనిసరిగా లక్ష్య సమూహాలకు అంటే పిరమిడ్ దిగువన ఉన్నవారికి కూడా చేరుకోవాలని మరియు దరఖాస్తుదారులందరికీ అవకాశం కల్పించాడానికి నిర్దేశించబడినది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి, వార్తాపత్రికలలో ప్రకటనలు, సామాజిక మాధ్యమాలు, పబ్లిక్ ప్రకటనలు, పత్రికా ప్రకటనలు, చేతివృత్తుల వారి వ్యక్తిగత సందర్శనలు మొదలైనవాటితో సహా వివిధ ప్రజలకు చేరుకునే చర్యలను రైల్వే అధికారులు చేపట్టారు.

ఉత్పత్తుల వర్గం మరియు స్థానిక కళాకారులు, చేనేత కార్మికులు, హస్తకళాకారులు, తెగలు ద్వారా తయారు చేసిన కళాఖండాలు, హస్తకళలు, వస్త్రాలు మరియు చేనేత వస్త్రాలు, బొమ్మలు, తోలు ఉత్పత్తులు, సాంప్రదాయ ఉపకరణాలు / సాధనాలు, వస్త్రాలు, రత్నాలు మరియు ఆభరణాల మొదలైన ఉత్పత్తుల వర్గీకరణ స్థానికంగా ఉంటుంది/ ఆ ప్రదేశానికి చెందినవిగా ఉంటాయి. ఈ ఉత్పత్తులలో ప్రాసెస్ చేయబడిన, సెమీప్రాసెస్డ్ మరియు దేశీయంగా తయారు చేయబడిన/ప్రాంతంలో పండించబడిన ఇతర ఆహార ఉత్పత్తులు మొదలైనవి లభ్యమవుతాయి.

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్థానిక నైపుణ్యం మరియు హస్తకళలో నిమగ్నమైన స్థానిక యువతకు రైల్వే అందించిన ఈ అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక కళలు మరియు సంస్కృతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం తద్వారా ప్రయాణీకులకు చుట్టుపక్కల ప్రదేశాలకు సేవలను అందించే అవకాశాన్ని కలుగజేస్తున్నది.

Leave a Reply