Suryaa.co.in

Andhra Pradesh

బాబు కుటుంబంలోనే సర్టిఫైడ్ సైకోలు ఉన్నారు

– 2019లో జనం చితక్కొట్టినా మళ్లీ వస్తున్నాడు…ఇదేం ఖర్మరా అని ప్రజలు అనుకుంటున్నారు
– ప్రజల గుండెల్లో జగన్‌ గారు ఏనాడో స్టిక్కర్‌ వేసుకున్నారు
– ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని గూగుల్‌ని అడిగినా చెప్తుంది
– 2019లో ప్రజలు ఈ దరిద్రాన్ని వదిలించుకున్నా మళ్లీ రోడ్లమీదకు వస్తున్నాడు
– ఈయన ఎక్కడ పాదం మోపితే అక్కడ మరణమే…అదే పెద్ద దరిద్రపు పాదం
– అధికారం కోసం ఎవరికైనా వెన్నుపోటు పొడిచే చంద్రబాబే పెద్ద సైకో
– జగన్‌ గారు ప్రజలకి అదృష్టం…మీరు మాత్రమే దరిద్రం..
– పోలవరంపై మోడీ ఇచ్చిన సర్టిఫికెట్‌ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికీ రాలేదు
– చంద్రబాబుకు అసలు పోలవరం గురించి మాట్లాడే అర్హత లేదు
– పచ్చ మీడియా ఉంది కాబట్టి తండ్రీ కొడుకుల ఆటలు సాగుతున్నాయి
– “మమ్మల్ని క్షమించండి”.. అని అయ్యకొడుకులు యాత్రలు చేయండి
-మాజీ మంత్రి కురసాల కన్నబాబు

– చంద్రబాబునాయుడు మళ్లీ జగన్మోహన్‌ రెడ్డిని శాపనార్ధాలు పెట్టుకుంటూ రోడ్లపై తిరుగుతున్నాడు
– 2019లో జనం బాదిన దెబ్బకి దిక్కు మొక్కు లేకుండా, మైండ్‌ బ్లాంక్‌ అయ్యి ఇప్పటికీ తేరుకోలేక తండ్రీ కొడుకులు రోడ్లపై తిరుగుతున్నారు
– ఐదేళ్లు అవకాశం ఇస్తే…మోసం చేశాం అని క్షమాపణలు కోరి తిరిగితే బాగుండేది
– తిట్ల దండకం అందుకుని జగన్మోహన్‌రెడ్డి గారిని తిడితే మీకేమీ రాదు
– మీరు చేసిన దరిద్రపుగొట్టు పాలనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు
– ఆ రోజు బాదితే ఈరోజుకీ మీరు తేరుకోలేదు…
– చంద్రబాబుకి దేవుడు మతిమరుపు అనే గొప్ప వరం ఇచ్చాడు
– ఆయన ఐదేళ్ల పరిపాలనలో ఏం చేశాడో గుర్తులేక ఇవాళ జగన్‌ గారికి శాపనార్ధాలు పెడుతున్నాడు
– సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటున్నాడు
– ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని ఆయన మామగారు, ఆయన కుటుంబ సభ్యులే చెప్పారు
– ఆయనే దరిద్రం ఈ రాష్ట్రానికి అని.. ఆయన కుటుంబ సభ్యులతో పాటు 80 శాతం మంది ప్రజలు సర్టిఫికెట్‌ ఇచ్చి ఉంటారు
– 2019లో ఈ దరిద్రాన్ని వదిలించుకోడానికే జనం ఛీ కొట్టారు..అయినా ఆయనకు బుద్ధి రాలేదు

మీ పాదం మోపితే మరణమే కదా..అదీ దరిద్రం అంటే:
– జగన్‌ గారు ప్రజలకి అదృష్టం…మీరు మాత్రమే దరిద్రం..
– దరిద్రమెవరో అదృష్టం ఎవరో ప్రజలకు తెలుసు కాబట్టే జగన్‌ గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు
– చంద్రబాబు కుమారుడి గురించి ప్రజలు ఈయనో ఐరెన్‌ లెగ్‌ అనుకుంటున్నారు
– లోకేశ్‌ పార్టీ పగ్గాలు తీసుకున్నాకే కదా మొత్తం నాశనం అయ్యింది
– మొన్నటి కందుకూరు తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు..గుంటూరులో ముగ్గురు చనిపోయారు
– ఈయన ఎక్కడ పాదం మోపితే అక్కడ చనిపోతున్నారు..రాష్ట్రంలో అదే పెద్ద దరిద్రం
– జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి సకాలంలో వానలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది
– పుష్కరాల్లో ఈయన స్నానం సరదాకి 29 మంది చనిపోవడాన్ని దరిద్రం అనే అంటారు
– కష్టంలో బాధల్లో కన్నీళ్లలో ఉంటే తుడిచి ఆదుకునే జగన్మోహన్‌రెడ్డి గారిని అదృష్టం అంటారు
– బాబే పెద్ద దరిద్రం అని ప్రజలు అర్ధం చేసుకున్నారు కాబట్టే 2019లో తిరిగి లేవకుండా కొట్టారు

దరిద్రం పట్టిపీడిస్తుంది కాబట్టే కనిపించిన ప్రతి ఒక్కరికీ కన్ను కొడుతున్నావ్‌:
– 2019 తర్వాత ఏ ఒక్క ఎన్నికైనా మీరు గెలిచారా..?
– మీ దరిద్రం ఇంకా పట్టిపీడిస్తుంది కాబట్టే కనిపించిన ప్రతి ఒక్కరికీ కన్ను కొట్టి పొత్తు కు రమ్మంటున్నావ్‌
– ఓ పక్క పవన్‌ కళ్యాణ్, మరో పక్క కమ్యూనిస్టులను, బీజేపీని అందర్నీ ఒకే చోటకు రమ్మని పిలుస్తున్నావ్‌
– బలమున్న వాడెవడైన మేం ఒంటరిగా వస్తాను అంటాడు..కానీ కట్టకట్టుకుని మందలా వస్తాను అంటున్నావు అంటే ఎవరికి దరిద్రం పట్టిందో తెలుసుకో..!
– ఐదేళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని సంవత్సరాలు రాష్ట్రానికి కరువు వచ్చిందో గుర్తు చేసుకో చంద్రబాబూ..!
– సుభిక్షంగా వానలు కురుస్తూ జగన్‌ గారి పరిపాలనలో అదృష్టం కలిసి వస్తోంది

పోలవరం సకాలంలో పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబే:
– పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా…?
– రాత్రికి రాత్రి పోలవరం మేమే కడతామని కేంద్రంతో కుమ్మక్కు అయ్యి కాంట్రాక్టు కోసం పర్సెంటేజీల కోసం కాళ్లావేళ్లా పడి తెచ్చుకున్నావ్‌
– రాత్రికి రాత్రి స్వీట్లు పంచుకున్నావ్‌…
– ఆనాడు 2013–14 రేట్లలో సుమారు 28 వేల కోట్లకు కడతానని ఒప్పుకుని పోలవరానికి అన్యాయం చేశావ్‌
– జగన్మోహన్‌రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదని, తప్పులు తడకగా పోలవరం నిర్మాణం సాగుతుందని చెప్పారు
– రివైజ్డ్‌ ఎస్టిమేట్లు ఇవ్వండి…2017–18 అంచనాలు ఇవ్వాలి…55 వేల కోట్ల పైచిలుకు రావాలని పోరాడుతున్నది నిజం కాదా..?
– ప్రాజెక్టులకు నిపుణులు డిజైన్‌ చేస్తారు…కానీ చంద్రబాబు వాళ్ల పనిని కూడా చేయనీయలేదు
– ముందు స్పిల్‌ వే కట్టాలి..ఆ తర్వాత ఎర్త్‌ ఫిల్‌ రాక్‌డ్యాం, కాఫర్‌ డ్యాం కట్టాలి
– ఈయన చేసిన నిర్వాకానికి ముందు కాఫర్‌ డ్యాం కట్టాడంతో .. వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది
– ఎందుకు మట్టి పనులపై ఆయనకు శ్రద్ధ..?
– సగం నిర్మాణం పూర్తయ్యాక నాలుక కరుచుకుని మట్టికట్టలు వేస్తే గోదారి వెనక్కి తన్ని ముంపు గ్రామాలు మునిగిపోతాయని, వారికి పరిహారం కూడా ఇవ్వలేదని గుర్తొచ్చి మధ్యలో ఆపేశాడు
– పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోవడానికి కారణం చంద్రబాబే
– మళ్లీ ఇప్పుడు వచ్చి తగుదనమ్మా అంటూ పండుగలు పబ్బాలు వదులుకుని నేను పోలవరం కోసం తిరిగానని చెప్తున్నాడు

చంద్రబాబుకు ప్రధాని మోడీ ఆస్కార్‌ అవార్డు లాంటి అవార్డు ఇచ్చాడు:
– పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు ప్రధాని మోడీ అతి పెద్ద ఆస్కార్‌ అవార్డు లాంటి సర్టిఫికెట్‌ ఇచ్చారు
– రాజమండ్రి సభలో పోలవరం చంద్రబాబుకు ఒక ఏటీఎం అనేది స్వయాన ప్రధానిమంత్రి చెప్పారు
– ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఒక ప్రధాన మంత్రి ఇంత పెద్ద సర్టిఫికెట్‌ ఇచ్చాడా..?
– నువ్వు పెద్ద అవినీతి పరుడువనే కదా ఆనాడు మోదీ గారు చెప్పింది

పచ్చ మీడియా ఉంది కాబట్టి తండ్రీ కొడుకుల ఆటలు సాగుతున్నాయి:
– యువ గంగాళం.. అంటూ లోకేశ్‌ తిరుగుతున్నాడు…
– తండ్రికి బుద్ధిలేదు..తెలుసుకోవడం లేదు సరే…నాయకుడిగా ఎదుగుదాం అనుకున్న లోకేశ్‌ స్టడీ చేయాలి కదా..?
– రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ లోకేశ్‌ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు
– 6 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకూ జగన్మోహన్‌రెడ్డి గారు ఇచ్చింది నిజమా…కాదా..?
– అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 1.30 లక్షల ఉద్యోగాలను సచివాలయాల్లో జెట్‌ స్పీడులో నియామకాలు చేశారు
– ప్రభుత్వ ఆస్పత్రులను, వైద్య కళాశాలలను ఆధునికీకరించి ఉద్యోగాల కొరత లేకుండా 40 వేలమందిని నియమించింది జగన్‌ గారే..
– 6 వేల మంది పోలీసుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చారు
– 1998 డిఎస్సీ వారికి జగన్మోహన్‌రెడ్డి గారు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు
– ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను 1.50 లక్షల మందిని నియామకం చేశారు
– ఇవన్నీ మీకు తెలియదా..? మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు
– పచ్చ మీడియా ఉంది కాబట్టి మీ తండ్రీకొడుకుల ఆటలు సాగుతున్నాయ్‌

చంద్రబాబే పెద్ద సైకో:
– ఎవడు సైకో..? నువ్వు ఎంత సైకో అయితే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పోడుస్తావు.
– ఆయన ఎంత పవర్‌ సైకోనో.. ఎంతటి విశ్వాసఘాతుకానికి ఒడిగడతాడో ఆలోచించండి
– మీ తమ్ముడు ఎక్కడున్నాడు అడుగుతుంటే ఎందుకు బాబు మాట్లాడటం లేదు?
– సంక్రాంతికి కూడా కనిపించడేంటి అని అడిగితే మాట్లాడటం లేదు
– ఈ దేశంలో ప్రజాప్రతినిధుల్లో సర్టిఫైడ్‌ సైకోలు ఒక్క మీ కుటుంబంలోనే ఉన్నారు బాబూ..

ప్రజల గుండెల్లో జగన్‌ ఏనాడో స్టిక్కర్‌ వేసుకున్నారు:
– ఇంటి మీద స్టిక్కర్‌ వేస్తానంటేనే.. మీరు గజగజ వణికిపోతున్నారు
– జనం గుండెల్లో జగన్‌ ఏ రోజో స్టిక్కర్‌ గా ఉండిపోయారు.
– పేద ప్రజల ఇంటికి వెళ్లి తలుపు తట్టి చూడండి….జగన్‌ అంటే ఏంటో తెలుస్తుంది
– ఒక కుటుంబానికి కనీసం లక్ష నుంచి మూడు లక్షల వరకు లబ్ధి చేకూరింది
– మేం ఏం చేశామో ఇంటింటికి వెళ్లి గృహసారధుల ద్వారా చెప్తామంటే చంద్రబాబు వణికిపోతున్నాడు
– ఇంటింటికి వెళ్లి ఒట్లేయించుకుంటాం అని నువ్వు చెప్తున్నావ్‌..కానీ ఒట్టేసి ప్రజలే చెప్తున్నారు.. మేం మళ్లీ జగన్‌ గారిని గెలిపిస్తామని.
– వాలంటీర్‌ వ్యవస్థ మీద పడి నిరంతరం రోధన..ఇప్పుడు గృహసారధులపై అదే రోధనా?
– రాష్ట్రంలో జగన్‌ గారి నామస్మరణ చేసే వాళ్లలో మొదటిగా తండ్రీ కొడుకులే ఉంటారు..కలలో కూడా ఆయన పేరు తలుచుకుంటారు
– 1.92 లక్షల కోట్ల డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా..?
– మీరు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బు తగలేశారు
– చివరికి కార్యకర్తలు చనిపోకపోయినా.. చనిపోయినట్లు చూపించి వారి భార్యలకు వితంతు పింఛన్లు తీసుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది
– మా నాయకుడు ఇది చేశాడు అని మేం చెప్పుకుంటాం.. అంటే మీకేంటి అంత బాధ..?

చంద్రన్నా రాలేడు:
– చిన్న పిల్లలు అంతా చంద్రన్న రావాలి అంటున్నారట..చందమామ రావే అన్నట్లు ఆ చందమామా రాడు..ఈ చంద్రన్నా అధికారంలోకి రాలేడు
– ఎక్కడ తప్పులు చేశాం…2019 ఎన్నికల్లో జనం చావ చితకొట్టి చెవులు మూశారు అనేది ఒక్క సారైన సమీక్షించుకున్నారా..?
– జగన్‌ మీద, జనంలోకి వెళ్లి ఏడిస్తే వస్తాయా..? అసెంబ్లీలో కూర్చుని నా భార్యను అవమానించారు అంటే ఓట్లు వస్తాయా..?
– జనం గుండెల్లో ఉంటే ఓట్లు వస్తాయి…జనం అభిమానాన్ని సంపాదిస్తే ఓట్లు వస్తాయి
– నలభై ఏళ్ల ఇండస్ట్రీకి డీజిల్, గ్యాస్‌ ధరలు ఎవరు పెంచుతారో కూడా తెలియకుండా ఉన్నాడు
– అప్పుడే ప్రధాని అవుతానంటే లోకేశ్‌ వద్దన్నాడట..ప్రధాని అవ్వాలనుకున్న వ్యక్తికి డీజిల్‌ ధర ఎవరు పెంచుతారో తెలియదా..?
– మేం బలవంతంగా స్టిక్కర్లు వేయాల్సిన అవసరం లేదు..కులం మతం వర్గం లేకుండా పథకాలు ఇస్తున్నాం
– మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా మేం పథకాలు ఇస్తున్నాం
– మీరు సృష్టించిన మీడియాలో, మీరు సృష్టించిన వార్తలు చూసుకుని మీరే మోసపోతారు
– ప్రజలు వాటిని చూసి మోసపోలేదు కాబట్టే 2004లో రాజశేఖరరెడ్డి గారు, 2019లో జగన్‌ గారు అధికారంలోకి వచ్చారు

చితక్కొట్టినా మళ్లీ వచ్చాడు…ఇదేం ఖర్మరా అని ప్రజలు అనుకుంటున్నారు:
-2019లో ప్రజలు మిమ్మల్ని చావ చితకొట్టినా మళ్లీ వచ్చాడు…ఇదేం ఖర్మరా బాబు..అని నిన్ను చూసి జనం అనుకుంటున్నారు
– జగన్‌ గారి పాదయాత్రకు, లోకేశ్‌ యాత్రకు అసలు పొంతనే లేదు
– లోకేశ్‌ బాడీ లాంగ్వేజ్‌ చూస్తే నవ్వొస్తోంది..ఆ చేతులు ఊపడానికి అర్ధం ఏమిటో చెప్పాలి
– మీ ఉడుత ఊపులన్నీ చూసి బోరు కొట్టేసింది గురూ..!
– ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరు అని గూగుల్‌ని అడిగినా చంద్రబాబే అని చూపిస్తుంది
– ఈ రాష్ట్రానికి ఎవర్రా ఖర్మ అని ఇంకో వందేళ్ల తర్వాత అడిగినా చంద్రబాబే అని చూపిస్తుంది
– అసలు మీ బతుక్కి చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా..?
– పిల్లలను బడికి పంపి..నాణ్యమైన భోజనం పెట్టాలనే ఆలోచన మీకు రాలేదు
– నేత కార్మికులకు ఏటా 24 వేల రూపాయలు అందిస్తున్నాం..
– ఉచిత పంటల బీమాను పెట్టారు..ఏ సీజన్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఆ సీజన్లోనే పంచుతున్నారు
– ఇవన్నీ మీ చరిత్రలో ఎందుకు చేయలేదు..
– నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం నీ కుప్పాన్ని రెవిన్యూ డివిజన్‌ చేసుకోలేని చంద్రబాబు.. పోలవరం ముంపు గ్రామాలను జిల్లా చేస్తానంటే ప్రజలు నమ్మరు.
– మా నాయకుడు భవిష్యత్తు కోసం చూసే నాయకుడు..నువ్వే మా భవిష్యత్తు అని ప్రజలంతా చూసే నాయకుడు
– నీకు భవిష్యత్తు లేదు చంద్రబాబూ…అందుకే జగన్‌ గారిపై రోజు వారీగా తండ్రీ కొడుకులు బూతులు తిడితూ శాపనార్ధాలు పెడుతున్నారు
– గతంలోలా ప్రజలు మీ ట్రాప్‌లో పడే పరిస్థితి లేదు…
– ఇద్దరి ఫోటోలు పక్క పక్కన పెట్టి ఎవరిది దరిద్రపు మొఖమో ప్రజల్ని అడగండి..వాళ్ళే సమాధానం చెప్తారు
– మాట్లాడేటప్పుడు ఒక సంస్కారం ఉండాలి..అవన్నీ కొల్పోతే చంద్రబాబు, లోకేశ్‌లా తయారవుతారు
– తిడితే లోకేశ్‌కి ఉన్న పప్పు అనే బిరుదు పోతుంది అని ఎవరో చెప్పి ఉంటారు
– కానీ..పప్పులో మసాలా కలిపితే ఏమైనా విలువ ఉంటుందా..?

మమ్మల్ని క్షమించండి అని యాత్రలు చేయండి:
– “ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయాం..గ్రాఫిక్స్‌తో కాలం గడిపాం..మమ్మల్ని క్షమించండి” అని అయ్యకొడుకులు యాత్రలు చేయండి
– మీరు క్షమాపణ యాత్రలు చేయాలి కానీ..ఇలాంటి పాద యాత్రల వల్ల ఉపయోగం లేదు
– నేను వస్తే ఇది చేస్తాననడం ఏమిటి..? నువ్వు ఉన్నప్పుడు ఏం చేశావ్‌ అనేదే ప్రశ్న
– ఎక్కువ కాలం, ఎక్కువ మందిని మోసం చేసి బతకడం కష్టం అని గుర్తించండి
– జగన్మోహన్‌రెడ్డిని శాపనార్ధాలు పెట్టే కార్యక్రమం మానేసి క్షమాపణలు చెప్పే కార్యక్రమం చేయండి

వైఎస్సార్‌ ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ వల్లే యువతకు ఐటీ ఉద్యోగాలు:
– మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఉద్యోగాలు ఇస్తే భార్యలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు వచ్చాయని పచ్చి అబద్దాలు చెప్తున్నాడు
– సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగాలు రాజశేఖరరెడ్డి ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ పెట్టడం వల్లే ఆడపిల్లలకు కూడా వచ్చాయి
– ఆ పథకాలను ఈ రోజు జగన్మోహన్‌రెడ్డి మరింత విస్తృత పరిచారు
– ఆరోగ్య శ్రీని కూడా అంతే విస్తృత పరిచారు..ఇదంతా చరిత్ర. దానిని చెరిపేయలేవు
– మీకు మీడియా మద్దతు ఉంది కాబట్టి వక్రీకరించగలవు..నిజం నిప్పులాంటిది
– ఎప్పటికీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం మాత్రం చంద్రబాబే పేరే చెప్తారు

LEAVE A RESPONSE