చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత ప్రసంగం:-
• జగ్గపేటలో ఎప్పుడు అభివృద్ది జరిగినా అది తెలుగు దేశం హయాంలోనే.
• తెలుగు దేశం పార్టీలో కార్యకర్తలకు క్రమశిక్షణ, సమర్థత ఉంది. దేశంలోనే కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగు దేశం
• పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు వస్తే సొంత ఇంట్లో వారిలా చూసే పార్టీ తెలుగు దేశం పార్టీ
• ఎవరు పార్టీ కార్యాలయానికి వచ్చినా భోజనం పెట్టి పంపే సాంప్రదాయం మన దగ్గర ఉంది.
• కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం అమలు చేసిన పార్టీ తెలుగు దేశం
• గతంలో అధికారంలో ఉన్న సమయంలో పని చేసిన వారికి అనుకున్న స్థాయిలో న్యాయం చెయ్యలేకపోయాం. ఈ సారి అలా జరగకుండా పక్కా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం.
• ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్ లు అందరినీ కుటుంబ సాధికార సారధులుగా పిలుస్తాం.
• ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారధి ఉంటారు.
• ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారధి విభాగం ఉంటుంది. ప్రతి కుటుంబానికి న్యాయం చేసేందుకు ఈ విభాగం పని చేస్తుంది.
• ఈ సారి ఎన్నికల్లో జగన్ ఇంటికి పోవడం ఖాయం…..జగన్ పని అయిపోయింది.
• పిచ్చోడి చేతిలో రాయిలా…జగన్ చేతిలో అధికారం ఉంది. అతను ఆ రాయితో మనల్ని కొడతాడు…లేదా తనని తానే కొట్టుకుంటాడు.
• ప్రపంచానికి ఆక్వా ఉత్పత్తులు సరఫరా చేసిన ఈ ప్రాంత రైతాంగం ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు
• 1996లో ఈ ప్రాంతం లో తుఫాను వచ్చిన సమయంలో రాజమండ్రిలో కూర్చుని సహాయ చర్యలు చేపట్టాను. తుఫాను నుంచి నాడు ఈ ప్రాంతం కోలుకున్న తరువాతనే ఇక్కడి నుంచి వెళ్లాను.
• పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితల విషయంలో ప్రభుత్వ విధానం చూస్తే చాలా బాధేస్తుంది. ఆవేదన కలుగుతుంది.
• నాడు పోలవరం కోసం మనం అడిగితే ప్రధాని మోడీ ముంపు మండలాలను మనకు ఇచ్చారు.
• గోదావరికి వరద వస్తే పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు కనీసం భోజనం పెట్టని ప్రభుత్వం ఈ దద్దమ్మ ప్రభుత్వం
• రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అంటే ముఖ్యమంత్రికి క్రెడిబిలిటీ ఉండాలి….జగన్ ను చూస్తే పేటియం బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వస్తారు….కోడికత్తి గాళ్లు వస్తారు. పెట్టుబడులు రావు
• టీడీపీ అంటే అభివృద్ది, సంక్షేమం అనేది గుర్తు వస్తుంది…కానీ జగన్ ను చూస్తే భూ బకాసురులు, మాఫియా వాళ్లు వస్తున్నారు
• ఈస్ట్ గోదావరి లో కొండలు మాయం అవుతున్నాయి.
• జగన్ రుషికొండను కొట్టేసి దానిపై కవరింగ్ కు గ్రీన్ మ్యాట్ వేశాడు. ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచన చేస్తున్న జగన్ రెడ్డికి ఆస్కార్ ఇవ్వాలి.
• నాడు డ్వాక్రా సంఘాలతో మహిళల సాధికారత కు కృషి చేసిన పార్టీ తెలుగు దేశం
• రాష్ట్రంలో అన్న క్యాంటీన్ లు పోయాయి… వాక్ ఇన్ లిక్కర్ షాపులు వచ్చాయి.
• సమాజంలో అన్ని వర్గాలు ఇదేం ఖర్మ అంటున్నాయి. మన హయాంలో 90 శాతం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వలేదు.
•ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం.