– బీజేపీ కి పని చేసిన ఎంపీ కోమటి రెడ్డి ని సస్పెండ్ చేసే దమ్ము లేని రేవంత్ రెడ్డి
– ఖమ్మం సభ చూసి కూడా బీజేపీ కి సిగ్గు రాలేదు.
– ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
బీ ఆర్ ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయ్యింది.తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు దాటుతుందని అంచనా.గత బడ్జెట్ లో ఇప్పటికే 2లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసింది.
కేంద్రం రకరకాల ఆంక్షలు పెట్టినా తెలంగాణ ప్రగతి పథం లో దూసుకెళ్తుందితలసరి ఆదాయం గతానికి ఇప్పటికి రెట్టింపు అయ్యింది. బీజేపీ నేతలు తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్నారు. కేంద్రం నుంచి తెలంగాణ కు రావాల్సిన నిధులపై బీజేపీ మాట్లాడటం లేదు. బీ ఆర్ ఎస్ వైపు అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బీ ఆర్ ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
బీ ఆర్ ఎస్ ఎజెండా తో బీజేపీ కాంగ్రెస్ లు బెంబేలెత్తుతున్నాయి.బీ ఆర్ ఎస్ ఆవిర్భావం తో దేశంలో తమ పని అయిపోయిందని బీజేపీ భయపడుతోంది. ఖమ్మం సభ చూసి కూడా బీజేపీ కి సిగ్గు రాలేదు.దావోస్ పర్యటన ద్వారా కే టీ ఆర్ రాష్ట్రానికి 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించారు.పెట్టుబడులు సాధించిన మంత్రి కే టీ ఆర్ కు అభినందనలు.
కే టీ ఆర్ ను అభినందించాల్సిన ప్రతిపక్ష పార్టీ ల నేతలు శాడిస్టు ల్లా విమర్శిస్తున్నారు.కాంగ్రెస్ లో రేవంత్ ను మించిన బీజేపీ కోవర్టు లేరు. మునుగోడు లో పట్టపగలు బీజేపీ కి పని చేసిన ఎంపీ కోమటి రెడ్డి ని సస్పెండ్ చేసే దమ్ము లేని రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతలను బీజేపీ కోవర్టు లని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడం లేదు. ఇకనైనా ప్రతిపక్షాలు బుద్ది తెచ్చుకోవాలి.