దేముడు ఇచ్చిన డాడీ అండగా వున్నాడు అని ఎంత కండకావరం ప్రదర్శించాడు?
చంద్రబాబు గారిని ప్రెస్ మీట్లో అరే ఒరే అని.. దుర్మార్గుడు దుష్టుడు అని.. రాళ్ళు తీసుకుని కొడతాను అని ఎంతగా రెచ్చిపోయాడు?
నడమంత్రపు సిరి నరం మీద పుండు మనిషిని నిలువనియ్యవు అని మన తరంలో నిర్ధారణ చేసిన లైవ్ ఎగ్జాంపుల్ ఈ దేముడు ఇచ్చిన కొడుకు..
వరుస క్రమంలో జరిగిన బళ్ళారి లో ఆర్కే గారి హత్య..
తగరకుంట ప్రభాకర్ గారి హత్య..
పరిటాల రవి గారి హత్య అన్నీ కూడా ఆరోజుల్లో దేముడు ఇచ్చిన డాడీ ప్రభుత్వ స్పాన్సర్డ్ హత్యలే..
రాష్ట్రంలో తాము సాగించబోయే దోపిడి యజ్ఞానికి ఎవరు అడ్డుచెప్పకుండా వుండాలి అంటే పరిటాల రవి గారి స్థాయి నేతనే చంపారు ఇక మనం ఎంత అనే భయం సృష్టించాలి అనే అనాటి క్రూర మారణకాండకు పూనుకున్నారు..
కాలం చాలా బలీయమైనది అని రుజువు కావడానికి ఎన్నాళ్ళో పట్టలేదు..
దేముడు ఇచ్చిన డాడీ దేముడు దగ్గరకే వెళ్ళిన తరువాత ఈ “గాలి” బతుకు తెగిన “గాలి పటంలా” మారింది..
ఆరోజుల్లో రాళ్ళు తీసుకుని కొడతాను అన్న నోటితోనే 2014 లో రాష్ట్రంలో కేంద్రంలో మళ్ళీ చంద్రబాబు గారు కీలక స్థాయిలో ఉండడంతో నన్ను క్షమించండి మీ కాళ్లు పుచ్చుకుంటా అని రాయబారం నడిపాడు అట..
దేముడు ఇచ్చిన డాడీ మిడిల్ డ్రాప్ చేసి పోయాడు. దేముడు ఇచ్చిన తమ్ముడు అసలు నమ్మే వ్యక్తి కాదు అని తత్వం బోధపడటానికి ఎన్నాళ్ళో పట్టలేదు..
అప్పట్లో బళ్ళారి నుంచి హెలికాప్టర్ లో బెంగళూరు వెళ్లి మరీ బ్రేక్ ఫాస్ట్ చేసిన “గాలి” బతుకు తరువాత రోజుల్లో అతనికి ఎదురు అయిన స్థితి చూసినప్పుడు ఇటువంటి మిడిసి పాటు సృష్టించే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ .
అన్నట్టు ఇతగాడి మీద ఇంకా ఈడీ కేసులు..
బెయిలు కోసం జడ్జి కి లంచం ఇచ్చిన కేసు కూడా రెడీ గానే వున్నాయి..
దేముడు ఇచ్చిన అన్న స్థితి చూసి దేముడు ఇచ్చిన తమ్ముడు రేపు నా సంగతి ఏంటీ అని కుమిలి పోతున్నాడు అట..
కూస్త పిల్లాడిని ఓదార్చండీ..
– రాజేష్ అప్పసాని..